’ప్రభాస్ అంటే పిచ్చి.. అతడిని పెళ్లి చేసుకోవాలని ఉంది’
Prabhas: డార్లింగ్ ప్రభాస్.. టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే గుర్తుకు వచ్చేది మనోడు పేరే. మనోడి కటౌట్కు ఏ అమ్మాయి అయినా పడిపోవాల్సిందే. ప్రభాస్ కు లవ్ ప్రపోజ్ చేయడానికి, డార్లింగ్ ను పెళ్లి చేసుకోవడానికి వేలాదిమంది అమ్మాయిలు రెడీగా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. రెబల్ స్టార్ తో ఒక్కసారైనా మాట్లాడాలని, కలిసి కాఫీ తాగాలని, డేట్ చేయాలని ఎంతోమంది నిరీక్షిస్తూ ఉన్నారు. అలా ఓ బిగ్ బాస్ బ్యూటీ కూడా ప్రభాస్ అంటే పడి చచ్చిపోతుంది, అతన్ని పెళ్లి చేసుకోవాలని కలలు కంటుంది. ఇంతకీ ఆ బిగ్ బాస్ బ్యూటీ ఎవరో ఓ లుక్కేయండి.
ఆ అమ్మడు ఎవరో కాదు.. బిగ్బాస్ ఫేమ్ దివి వాద్త్యా ( Divi adthya). ఈ అమ్మడు గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పలు సినిమాల్లో నటిస్తూ.. తన టాలెంట్ నిరూపించుకుంటుంది. అలా వచ్చిన క్రేజ్ తోనే ఈ అమ్మడు బిగ్ బాస్ షోలో అడుగుపెట్టింది. ఈ షోలో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. అలాగే ఈ షోలో ఓ రేంజ్లో రచ్చ చేసింది. ఇలా అతి తక్కువ కాలంలోనే విపరీతమైన గుర్తింపు సంపాదించుకుంది. ఈ అమ్మడుకు ఇప్పుడిప్పుడే సినిమా అవకాశాలు వస్తున్నాయి. తనకు మంచి ఆఫర్ వస్తే, తనకు సినిమా కథ నచ్చితే ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోకుండా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు గతంలో ప్రకటించిందీ క్యూట్ బ్యూటీ.

అలాగే.. నటి దివి కొన్ని వెబ్ సిరీస్‌లలో నటించింది. ఇందులో 'క్యాబ్ స్టోరీస్'అనే వెబ్ సిరీస్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దివి పాల్గొని రెబల్ స్టార్ ప్రభాస్ పై తన అభిమానాన్ని వ్యక్తపరిచింది. ప్రభాస్ ను కలవాలని ఆయనతో కలిసి డేట్ చెయ్యాలని ఉందని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆయన మంచి హోస్ట్ అని చాలామంది చెబుతూ ఉంటే విన్న.. ఆయన తన ఇంటికి వచ్చిన వారిని ఎంతో చక్కగా చూసుకుంటారని, కడుపునిండా భోజనం పెట్టి పంపిస్తారని చాలామంది అన్నారు. ప్రభాస్ అంటే తనకు ఓ ప్రత్యేక అభిమానమని, అతడిని నేను ప్రేమిస్తున్న అంటూ ఓపెన్ గా చెప్పేసింది.
ఒకవేళ ప్రభాస్ ను కలిసే అవకాశం వస్తే ఏం చేస్తావని యాంకర్ ప్రశ్నించగా.. అతనితో కలిసి ఓ డీసెంట్ డిన్నర్, లేదా డేట్ ప్లాన్ చేసుకుంటానని, అతనితో కలిసి కాఫీ తాగాలని, కలిసి కూర్చొని కాసేపైనా సరదాగా మాట్లాడాలని భావిస్తున్నా.. మిర్చి లాంటి కుర్రాడుతూ ఒక్క కాఫీ తాగితే చాలు కదా.. అంటూ నటి దివి తన మనసులోని మాటను బయటపెట్టింది.

అంతేకాకుండా ప్రభాస్ ను ఒక్కసారైనా కలవాలని, అతనితో డేట్ చేయాలని, అతడు ఏంటి చాలా ఇష్టం అంటూ ఓపెన్ గా చెప్పేసింది దివి. తాను ఒకసారి సోషల్ మీడియా వేదికగా ప్రభాస్ కు మెసేజ్ చేశానని, తన మెసేజ్ ను ఎప్పుడో ఒకసారి అయినా చూస్తాడని వేచి చూస్తున్నానని తన కోరికను వెల్లడించింది నటి దివి.


Click it and Unblock the Notifications











