twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సీఎం జగన్‌కి బిగ్ బాస్ బ్యూటీ వినతి.. ఇలా చేయడమే పరిష్కారం అంటూ!

    |

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి బుల్లితెర యాంకర్ శ్యామల సోషల్ మీడియా వేదికగా చిన్న వినతి ఇచ్చింది. ఇటీవలే పాపికొండల్లో జరిగిన పడవ ప్రమాదంపై స్పందిస్తూ తన అభిప్రాయాన్ని ఫేస్‌బుక్ వేదికగా వెల్లడించింది శ్యామల. ఆమె చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకీ జగన్‌కి శ్యామల ఏమని కోరింది? ఆమె విన్నవించుకుందేంటి? వివరాల్లోకి పోతే..

     పాపికొండల్లో బోటు ప్రమాదం

    పాపికొండల్లో బోటు ప్రమాదం

    గోదావరి నదిలో ఘోర ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు 65 మందితో వెళ్తున్న బోటు మునగడంతో ప్రయాణికులంతా గల్లంతయ్యారు. పాపికొండలు విహార యాత్రకు వెళుతుండగా దేవీపట్నం మండలం కచులూరు వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఇప్పటికే మృతదేహాల సంఖ్య 12కి చేరడం ఆందోళన కలిగిస్తోంది.

    బుల్లితెర హాట్ యాంకర్ శ్యామల రియాక్షన్

    బుల్లితెర హాట్ యాంకర్ శ్యామల రియాక్షన్

    పాపికొండల్లో జరిగిన ఈ దుర్ఘటనపై బుల్లితెర హాట్ యాంకర్ శ్యామల రియాక్ట్ అయింది. సోషల్ మీడియా వేదికగా సీఎం జగన్‌కి వినతి ఇచ్చిన శ్యామల.. వరుసగా జరుగుతున్న బోటు ప్రమాదాలను నివారించాలంటే ఒక్కటే మార్గమని, బొట్ల నిర్వహణను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉండనీయకుడని ఆమె పేర్కొంటూ పోస్ట్ పెట్టింది.

    నాడు కృష్ణలో, నేడు గోదావరిలో.. వైఎస్ జగన్ గారు

    ''గోదావరి బోటు ప్రమాదం ఆందోళన కలిగిస్తుంది. నాడు కృష్ణలో, నేడు గోదావరిలో జరుగుతున్న ప్రమాదాలకు మూలం బొట్ల నిర్వహణ ప్రయివేటు వ్యక్తుల చేతిలో ఉండడమే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు కీలకమైన ఈ నిర్వహణను ప్రభుత్వ సారథ్యంలోని ఏపీ టూరిజం శాఖ పరిధిలోకి తీసుకురావాలని మనవి'' అంటూ శ్యామల తన విన్నపాన్ని తెలియజేసింది.

    బిగ్ బాస్ 2 ద్వారా శ్యామల ఫేం

    బిగ్ బాస్ 2 ద్వారా శ్యామల ఫేం

    బుల్లితెరపై తనదైన శైలితో యాంకరింగ్ చేస్తూనే, అందాలతో అందరినీ ఆకర్షించే శ్యామల.. బుల్లితెర పాపులర్ షో బిగ్ బాస్ 2 ద్వారా బాగా ఫేం అయింది. సోషల్ మీడియాలో ఈమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. 2019 ఎన్నికల సందర్భంగా తన భర్తతో కలిసి జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకుంది యాంకర్ శ్యామల. కాగా సీఎం జగన్‌కి ఆమె ఇచ్చిన వినతి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

    English summary
    Anchor Shyamala reponds on Papikondalu boat Accident. She requests Ap Cm Y. S. Jaganmohan Reddy to take boat operetions in to Ap turiusm.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X