బూతు సినిమాలో బిగ్ బాస్ భామ.. వైరల్ అవుతున్న దృశ్యాలు!
Recommended Video

నటిగా, డాన్సర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన భానుశ్రీ పలు చిత్రాల్లో నటించింది. కానీ సరైన గుర్తింపు లభించలేదు. బిగ్ బాస్ తెలుగు 2 సీజన్ లో కంటెస్టెంట్ గా అవకాశం దక్కడంతో భానుశ్రీ క్రేజీ సెలేబ్రిటిగా మారిపోయింది. బిగ్ బాస్ హౌస్ లో భానుశ్రీ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. టైటిల్ విన్నర్ కౌశల్,భానుశ్రీ మధ్య జరిగిన ఆపిల్ టాస్క్ గొడవ ఎప్పటికీ మరిచిపోలేం. బిగ్ బాస్ తరువాత భానుశ్రీ కెరీర్ జోరందుకున్నట్లే కనిపిస్తోంది. యాంకర్ గా, నటిగా పలు అవకాశాలు అందుకుంటోంది. ఇదిలా ఉండగా భానుశ్రీ తాజాగా నటించిన ఏడూ చేపల కథ అనే చిత్రం హాట్ టాపిక్ గా మారింది.

శృంగార భరిత చిత్రం
ఏడు చేపల కథ చిత్రం శృంగారం ప్రధానాంశంగా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో భానుశ్రీ కూడా ఓ పాత్రలో నటిస్తోంది. సెక్సీ సీన్స్ లో భానుశ్రీ రెచ్చిపోయి నటించడం హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్ర టీజర్ ఇటీవల విడుదలై సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ఆ తరహాలోనే
ప్రస్తుతం బోల్డ్ కంటెంట్ ఉన్న చిత్రాల ట్రెండ్ నడుస్తోంది. ఆ కోవలోకి చెందిన ఏడూ చేపల కథ చిత్రంలో శృంగారం కాస్త శృతిమించినట్లే కనిపిస్తోంది. ఈ చిత్రంలో హీరో ఓ వింత శృంగార సమస్యతో బాధపడుతుంటాడు. దాని పర్యవసానం ఎంటనేదే ఈ చిత్ర కథ. ఏది ఏమైనా ఏ చిత్రంతో భానుశ్రీ మరో మారు హాట్ టాపిక్ గా మారింది.

బుల్లితెరపై యాంకర్‌గా
ప్రస్తుతం బుల్లి తెరపై భానుశ్రీ యాంకర్ గా కూడా రాణిస్తోంది. ఢీ 11 లో సుధీర్ సరసన యాంకర్ గా చెలరేగిపోతోంది. బాహుబలి చిత్రంలో తమన్నాకు డూప్ గా నటించినా, కొన్ని చిన్న చిత్రాల్లో పాత్రలు చేసినా రాని గుర్తింపు భానుశ్రీకి బిగ్ బాస్ షో ద్వారా లభించింది అని చెప్పొచ్చు.

ఆ ఇమేజ్ సొతం చేసుకుంటుందా
ప్రస్తుతం చాలా మంది నటీమణులు బోల్డ్ చిత్రాల్లో నటిస్తూ గ్లామర్ షోకు తెరలేపుతున్నారు. రష్మీ కూడా గుంటూరు టాకీస్ లాంటి చిత్రంలో నటించి హీరోయిన్ గా మారింది. అదే తరహా ఇమేజ్ భానుశ్రీకి కూడా దక్కుతుందేమో చూడాలి.


Click it and Unblock the Notifications











