సజీవంగా కాల్చి చంపుతాం.. దుబ్బాక ఉప ఎన్నికల్లో కత్తి కార్తీక.. ప్రత్యర్థుల బెదిరింపులు

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోతో తెలుగు వారికి దగ్గరైన కత్తి కార్తీక ఇప్పుడు రాజకీయ నేత అవతారం ఎత్తారు. దుబ్బాక నియోజకవర్గంలో జరిగే ఉప ఎన్నికల బరిలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీలోకి దిగారు. ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆకస్మిక మరణంతో ఏర్పడిన ఖాళీతో దుబ్బాక నియోజకవర్గంలో ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ క్రమంలో గత నెల రోజులుగా కార్తీక దుబ్బాక నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రజా సమస్యలపై అవగాహన పెంచుకొంటున్నారు. గత కొద్దిరోజులుగా ప్రచారంలో దూసుకెళ్తున్న కార్తీకకు ప్రత్యర్థి వర్గాలు ఝలక్‌ ఇవ్వడం వివాదంగా మారింది. కత్తి కార్తీక డ్రైవర్‌పై జరిగిన దాడి గురించి వివరాల్లోకి వెళితే..

దుబ్బాక నియోజకవర్గంలో విస్తృత పర్యటనలు

దుబ్బాక నియోజకవర్గంలో విస్తృత పర్యటనలు


దుబ్బాక నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నిక ప్రచారాన్ని విస్తృతంగా కొనసాగిస్తున్నారు. ప్రతీ గ్రామంలో నిరుద్యోగ యువత, పేద ప్రజలతో కలిసి వారి సమస్యలను వింటున్నారు. తనను గెలిపిస్తే నియోజకవర్గం అభివృద్ధికి బహుజన అభ్యర్థిగా పాటుపడుతానని కత్తి కార్తీక హామీలు ఇస్తున్నారు.

కత్తి కార్తీకకు ప్రచారానికి మంచి స్పందన

కత్తి కార్తీకకు ప్రచారానికి మంచి స్పందన


దుబ్బాకలో పర్యటిస్తున్న కత్తీ కార్తీకకు యువత, నిరుద్యోగుల నుంచి మంచి స్పందన లభిస్తున్నది. పలు కుల సంఘాలు ఆమెకు స్వాగతం పలుకుతూ సన్మానం చేస్తున్నారు. కత్తి కార్తీక ప్రచారానికి మంచి స్పందన కనిపిస్తున్నట్టు స్థానికులు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో ఆడబిడ్డను ఆదరించమని అడిగితే సానుకూలంగా స్పందిస్తున్నారనే విషయాన్ని కత్తి కార్తీక వెల్లడిస్తున్నది.

ప్రత్యర్థి వర్గాల బెదిరింపులు

ప్రత్యర్థి వర్గాల బెదిరింపులు

ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యర్థి వర్గానికి చెందిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తన డ్రైవర్‌పై దాడికి దిగినట్టు కత్తి కార్తీక రామాయంపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో డ్రైవర్ షరీఫ్ హైదరాబాద్ నుంచి దుబ్బాకకు వస్తున్న క్రమంలో దాడికి దిగినట్టు సమాచారం. దాడి ఘటనపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసి రక్షణ కల్పించాలని కోరినట్టు తెలుస్తున్నది.

Recommended Video

Bigg Boss Telugu 4 : Episode 12 Highlights : బిగ్ బాస్ ముందు ఏడ్చేసిన Gangavva | Filmibeat Telugu
సజీవంగా చంపేస్తామంటూ..

సజీవంగా చంపేస్తామంటూ..


కత్తి కార్తీక ఫిర్యాదులో తెలిపిన ప్రకారం.. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సిల్వర్ కలర్ ఇన్నోవా కారులో వచ్చి డ్రైవర్ షరీఫ్‌ను అడ్డగించారు. నీవు కత్తి కార్తిక డ్రైవర్‌వు కదా అంటూ అడిగి బెదిరించారు. నిన్ను మీ మేడంను సజీవంగా కాల్చివేస్తామని హెచ్చరించారు. వారి బెదిరింపులతో డ్రైవర్ ద్విచక్ర వాహనాన్ని వదిలి పారిపోయి వచ్చారు అని కార్తీక తన ఫిర్యాదులో తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X