twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్‌బాస్ సెలబ్రిటీపై క్రిమినల్ కేసు.. సోషల్ మీడియాలో మోసం.. బాధితుడు లబోదిబో

    By Rajababu
    |

    Recommended Video

    బిగ్‌బాస్ సెలబ్రిటీ బండ్గీ కల్‌రాపై క్రిమినల్ కేసు నమోదు

    బిగ్‌బాస్ సెలబ్రిటీ బండ్గీ కల్‌రాపై క్రిమినల్ కేసు నమోదైంది. బండ్గీ తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్టు చేసిన వ్యాపార ప్రకటన కారణంగా తాను మోసపోయానని బెంగళూరుకు చెందిన యువరాజ్ సింగ్ యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతకు ఈ వ్యవహారంలో ఏమి జరిగిందంటే...

    11 బిగ్‌బాస్‌లో చూశా

    11 బిగ్‌బాస్‌లో చూశా

    బండ్గీ కల్‌రాను 11వ సీజన్ హిందీ బిగ్‌బాస్‌లో చూశాను. అప్పటి నుంచి ఆమెను సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నాను. ఇటీవల ఆమె సోషల్ మీడియాలో తక్కువ ధరకే ఐఫోన్లు అనే ఒక వ్యాపార ప్రకటనను పోస్టు చేసింది.

    రెండు ఐఫోన్లు ఆర్డర్ చేశాను

    రెండు ఐఫోన్లు ఆర్డర్ చేశాను

    బండ్గీ కల్‌రా పోస్టు చేసిన యాడ్‌ను చూసి తక్కువ మొత్తానికి వస్తున్నాయని రెండు ఐఫోన్ల ఎక్స్‌ కోసం ఆర్డర్ చేశాను. కానీ నాకు నకిలీ ఐఫోన్లు పంపారు. దాంతో నేను ఆర్థికంగా, మానసికంగా మోసపోయాను అని పోలీసులకిచ్చిన ఫిర్యాదులో యువరాజ్ సింగ్ పేర్కొన్నారు.

    అనుమానంతో ఫోన్ చేశా

    అనుమానంతో ఫోన్ చేశా

    తనకు నకిలీ ఫోన్లు పంపిన రెండు కంపెనీలపై కూడా వినియోగదారుడు యువరాజ్ సింగ్ యాదవ్ కేసు నమోదు చేశాడు. రూ.30,500కే ఒక్కో ఐఫోన్ అని ప్రకటనలో తెలిపారు. నేను రూ.61 వేలు చెల్లించే మొత్తంలో నుంచి రూ.13 వేలు చెల్లించి ఆన్‌లైన్‌లో ఫోన్లను ఆర్డర్ చేశాను. ఆ తర్వాత వెంటనే ఆ యాడ్‌ను డిలీట్ చేయడంతో అనుమానం వచ్చింది.

    డమ్మీ ఫోన్లు పంపించారు

    డమ్మీ ఫోన్లు పంపించారు

    బండ్గీ కల్‌రా పోస్టు చేసిన యాడ్ తొలగించడంతో అందులోని ఫోన్ నంబర్లకు కాల్ చేయగా... వాళ్లు నాకు ఫోన్లు పంపిస్తామని భరోసా ఇచ్చారు. వాళ్లు చెప్పిన ప్రకారమే డెలివరీ బాయ్ నాకు ఫోన్లను తెచ్చి ఇచ్చాడు. దాంతో మిగితా 48 వేలు చెల్లించాను. తీరా ప్యాకెట్లను ఓపెన్ చేయగా అందులో డమ్మీ ఫోన్లు ఉన్నాయి.

    ఫోన్ చేస్తే నో రిప్లై

    ఫోన్ చేస్తే నో రిప్లై

    నేను మోసపోయానని నాకు అప్పడే అర్ధమైంది. వెంటనే కంపెనీ వాళ్లకు ఫోన్ చేయగా అటువైపు నుంచి సమాధానం లేదు. దాంతో కంగారు పడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చీటింగ్ చేసిన వారిపై తగు చర్యలు తీసుకొంటామని పోలీసులు తెలిపారని యువరాజ్ సింగ్ యాదవ్ తెలిపారు.

    లీగల్ యాక్షన్‌ తీసుకొంటా

    లీగల్ యాక్షన్‌ తీసుకొంటా

    యువరాజ్ సింగ్ ఫిర్యాదు మేరకు బండ్గీ కల్‌రా, రెండు కంపెనీలకు నోటీసులు పంపాం. మూడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నాం. నోటీసులకు సమాధానం ఇవ్వకపోతే వారిపై లీగల్ యాక్షన్ తీసుకొంటాం అని బెంగళూరు పోలీసులు వెల్లడించారు.

    English summary
    Bandgi Kalra gained popularity from her stint in Bigg Boss 11. The model turned reality show star has reportedly been booked for posting a fake iPhone ad on her Instagram account by a victim who was a student. A Banglore based student has filed a complaint against Bandgi and two Delhi based companies Different Collection and Nexafation.com.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X