ఆకాశమంతా ఎత్తు ఎదిగినా నేలమీదే.. చిరుపై అభిజిత్ కామెంట్స్

బిగ్ బాస్ నాల్గో సీజన్ విజేత అభిజిత్ తాజాగా మెగాస్టార్ చిరంజీవిని కలిశాడు. బిగ్ బాస్ షో అనంతరం మళ్లీ ఇన్ని రోజులు తరువాత చిరు ఇంట్లో అభిజిత్ మెరిశాడు. ఈ క్రమంలో చిరుతో పంచుకున్న విషయాలు, చిరు ఇచ్చిన సలహాలు, చూపించిన ప్రేమకు అభిజిత్ ముగ్దుడయ్యాడు. చిరుతో దిగిన సెల్ఫీని షేర్ చేస్తూ మెగాస్టార్ గురించి అద్భుతంగా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అభిజిత్ షేర్ చేసిన పోస్ట్, ఫోటో రెండూ వైరల్ అవుతున్నాయి.

 బిగ్ బాస్ నాల్గో సీజన్..

బిగ్ బాస్ నాల్గో సీజన్..

బిగ్ బాస్ నాల్గో సీజన్ ఫినాలే ఎపిసోడ్ ఎంత గ్రాండ్‌గా జరిగిందో.. ఎంతో హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అదిరిపోయే టీఆర్పీలతో ఫినాలే ఎపిసోడ్ దూసుకుపోయింది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రావడం, కంటెస్టెంట్లందరి గురించి మాట్లాడటం, స్టేజ్ మీద మెహబూబ్‌కు పది లక్షల చెక్ ఇవ్వడం ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే.

చిరు, నాగ్‌లతో సోహెల్..

చిరు, నాగ్‌లతో సోహెల్..

బిగ్ బాస్ షో అనంతరం సోహెల్ చేసిన హల్చల్ అంతా ఇంతా కాదు. చిరంజీవి, నాగార్జునలను స్పెషల్‌గా కలిసి సోషల్ మీడియాలో హడావిడి చేశాడు. అయితే ఒక్క సోహెల్ మాత్రమే ఇలా కలవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. విన్నర్ అయిన అభిజిత్ మాత్రం ఎందుకు సైలెంట్‌గా ఉన్నారని అప్పుడు అంతా అనుకున్నారు. కానీ తాజాగా అభిజిత్ సైతం మెగాస్టార్ చిరంజీవిని కలిశాడు.

 ఆ మాటలను గుర్తుకు తెచ్చుకుని..

ఆ మాటలను గుర్తుకు తెచ్చుకుని..

బిగ్ బాస్ ఫినాలె ఎపిసోడ్‌ నాడు అభిజిత్ గురించి చిరంజీవి మాట్లాడుతూ.. నీ మొదటి సినిమాను నేను చూశాను. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ చేశావ్ కదా.. నువ్ హీరో మెటీరియల్ అని చిరంజీవి నాడు అన్న మాటలను నేడు గుర్తుకు చేసుకున్నాడు. ఆ మాటలను ఎప్పటికీ మరిచిపోను అంటూ అభిజిత్ ఎమోషనల్ అయ్యాడు.

 ఆకాశమంతా ఎత్తుకు..

ఆకాశమంతా ఎత్తుకు..

ఆకాశమంతా ఎత్తుకు ఎదిగిన ఓ మనిషి.. ఇలా నేలమీదే ఉండటం, ఎంతో ఒదిగి ఉండటం ఎలా సాధ్యం. ఎంతో మంచి మనిషి, ఎదుటివారిని ఎంకరేజ్ చేసే ఓ గొప్ప వ్యక్తిని నేడు నేను కలిశాను. నేను ఎంతో కంఫర్ట్‌గా ఫీలయ్యేలా చూశారు. నా ఎదుగుదల గురించి ఆయన ఆసక్తి చూపడం, మాట్లాడటం వంటివి చూసి నేను ఎంతో సంతోషపడ్డాను. నిజమైన ప్రేమను చూశాను అని అభిజిత్ చెప్పుకొచ్చాడు.

Recommended Video

Himaja With Pawan Kalyan In PSPK 27
సూచనలు, సలహాలు..

సూచనలు, సలహాలు..

తెలుగు సినిమాకు గర్వకారణమైన వ్యక్తితో ఇలా మనసు విప్పి మాట్లాడతానని ఎప్పుడూ అనుకోలేదు. మీరిచ్చిన సూచనలు, సలహాలు, దిశానిర్దేశం నాకెంతో విలువైనవి. నాలాంటి యంగ్ స్టర్స్‌ను ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్స్ సర్ అని అభిజిత్ ఎమోషనల్ అయ్యాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X