అవే ఆడదాని ఆయుధాలు.. బిగ్ బాస్ ఫేమ్ దివి షాకింగ్ పిక్స్
బిగ్ బాస్ నాల్గో సీజన్ ద్వారా చాలా మంది కంటెస్టెంట్లు ప్రపంచానికి పరిచయమయ్యారు. బిగ్ బాస్ షో కంటే ముందుగా వారెవ్వరో కూడా ఎవ్వరికీ తెలియదు. కానీ బిగ్ బాస్ పుణ్యమా అని కొందరికి విపరీతమైన పాపులార్టీ వచ్చింది. ఏకంగా స్టార్ హీరోయిన్ రేంజ్ క్రేజ్ కొల్లగొట్టేశారు. అందులో ముఖ్యంగా దివి గురించి చెప్పుకోవాలి. షో ప్రారంభమైన రోజు దివి అంటే ఎవ్వరికీ తెలియదు. ఆమె మహర్షి చిత్రంలో చేసిందట అని మాత్రమే చెప్పుకునే వారు. కానీ అందులో ఏ సీన్‌లో ఉందో కూడా ఎవ్వరికీ తెలియదు. కానీ బిగ్ బాస్ మాత్రం ఆమెకు ఎక్కడా లేని ఇమేజ్‌ను తెచ్చిపెట్టాడు.

అలా ఫేమస్..
బిగ్ బాస్ షోలో మొదటి రెండు మూడు రోజులు దివి కనిపించనైనా కనిపించలేదు. అప్పటికే మొదటి వారంలోనామినేట్ అయి ఉంది దివి. ఇక మొదటి వారంలో ఇంటి నుంచి దివి బయటకు వెళ్లిపోతుందని అంతా భావించారు. కానీ ఒకే ఒక్క ఎపిసోడ్ మొత్తం మార్చేసింది. మార్నింగ్ మస్తీలో ఇంటి సభ్యుల ప్రవర్తన, వ్యక్తిత్వాల గురించి ఎంతో గొప్పగా క్లియర్‌గా మాట్లాడింది. దీంతో దివి ఇమేజ్ పూర్తిగా మారిపోయింది.

కలల రాణి..
దివి ఎంతో మందికి కలలరాణిగా మారిపోయింది. అలా వారాలు గడుస్తున్న కొద్దీ దివి ఇమేజ్ పెరుగుతూనే వచ్చింది. కుర్రాళ్ల గుండెల్లో గిలిగింతలు పెట్టేసింది. చీరకట్టుతో ఎంతో మందికి గాలమేసేది. అలా దివిక ఫుల్ ఫాలోయింగ్ పెరిగింది. టాప్ 5 వరకు ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ ఆమె అమ్మ రాజశేఖర్ చాటున ఉంటూ ఆట ఆడుతుందని అందరూ భావించడంతో ఎలిమినేట్ కాకతప్పలేదు.

బయటకు వచ్చాక అలా..
దివి బయటకు వచ్చాక తన ఫాలోయింగ్, క్రేజ్ చూసి మురిసిపోయింది. బిగ్ బాస్ షోలోకి వెళ్లేముందు.. షో నుంచి బయటకు వచ్చే వరకు మధ్యలో జరిగిన మార్పులు చూసి షాక్ అయింది. తన స్టార్డంను చూసి దివి సంబరపడిపోయింది. సినిమా ఆఫర్లు కూడా భారీగానే పెరిగాయి.

ఫినాలే నాడు..
బిగ్ బాస్ ఫినాలె ఎపిసోడ్ రోజును కూడా దివి అందాన్ని చూసి చిరంజీవి కూడా ఫిదా అయ్యాడు. దివి ఓ ఆఫర్ కూడా ఇవ్వమని మెహర్ రమేష్‌ను అడిగినట్టు చిరు బయటపెట్టేశాడు. వేదాళం రీమేక్‌లో దివికి మంచి రోల్ ఇచ్చినట్టు కూడా చిరు చెప్పేశాడు. మొత్తానికి దివి అలా బాగానే ఫేమస్ అవుతోంది.

అవే ఆయుధాలు..
బయటకు వచ్చాక దివి వెరైటీ ఫోటో షూట్లతో రచ్చ రచ్చ చేస్తోంది. తాజాగా కొన్ని మత్తెక్కించే ఫోటోలను షేర్ చేసింది. వాటిని షేర్ చేస్తూనే ఓ కామెంట్ చేసింది. కళ్లు, హావభావాలే ఆడవారికి ఆయుధాలు అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











