twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అమ్మ బాబోయ్ ‘జోర్దార్‌’గా డ్యాన్స్ చేసింది.. మొత్తంగా మారిపోయిన సుజాత

    |

    ప్రస్తుతం సోషల్ మీడియాలో బిగ్ బాస్ కంటెస్టెంట్లు ట్రెండింగ్‌లో ఉంటున్నారు. బిగ్ బాస్ కంటెస్టెంట్లతో స్పెషల్ షోలను ప్లాన్ చేస్తూ బాగా వాడేసుకుంటున్నారు. అలా స్టార్ మాలో ఇప్పుడు రెండు కొత్త షోలు ప్రారంభమయ్యాయి. కామెడీ స్టార్స్, స్టార్ట్ మ్యూజిక్ అనే రెండు షోలు గత వారం మొదలయ్యాయి. అయితే ఇందులో కామెడీ స్టార్స్ షో మొత్తంగా బిగ్ బాస్ కంటెస్టెంట్లను ఆధారంగా చేసుకుని నిర్వహిస్తున్నారు.

    అవినాష్‌తో అలా..

    అవినాష్‌తో అలా..

    బిగ్ బాస్ షోలోకి అవినాష్ వచ్చేందుకు జబర్దస్త్ అవకాశాలను వదులుకున్నాడు. అందుకే బిగ్ బాస్ అనంతరం స్టార్ మా అవినాష్‌తో ఓ స్పెషల్ ప్రోగ్రాంను ప్లాన్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. అందుకు అనుగుణంగానే మంచి షోనే ప్రారంభించారు.

    స్పెషల్ అట్రాక్షన్స్..

    స్పెషల్ అట్రాక్షన్స్..

    కామెడీ స్టార్స్ అనే షోను అవినాష్ ముందు పెట్టి ప్రారంభించారు. ఇందులో వర్షిణిని యాంకర్‌గా, శేఖర్ మాస్టర్, హీరోయిన్ శ్రీదేవీలను జడ్జ్‌లుగా పెట్టేశారు. గ్లామర్‌ బాగానే ఉండేలా చూసుకుంటూ , కామెడీని కూడా పెంచేందుకు బిగ్ బాస్ కంటెస్టెంట్లను పట్టుకొచ్చాడు.

    వారితో స్పెషల్ స్కిట్స్..

    వారితో స్పెషల్ స్కిట్స్..

    అవినాష్ మెయిన్ లీడ్‌గా ఉన్నా కూడా అదిరింది కంటెస్టెంట్లు, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్లతో స్పెషల్ స్కిట్స్ ప్లాన్ చేశారు. అవినాష్ తమ్ముడు అజయ్ కూడా కామెడీ స్టార్స్‌లోకి వచ్చేశాడు. అషూ, జోర్దార్ సుజాత, అరియానా వంటి వారితో అవినాష్ బాగానే కామెడీని ట్రై చేశాడు.

    షూటింగ్ గ్యాప్..

    షూటింగ్ గ్యాప్..

    అయితే మనకు తెరపై కనిపించే కామెడీ టైమింగ్, స్కిట్స్ మాత్రమే తెలుసు. షూటింగ్ జరుగుతూ ఉంటే మధ్య వచ్చే గ్యాప్‌లో ఆర్టిస్ట్‌లందరూ ఎంత సరదాగా ఉంటారు.. ఎంజాయ్ చేస్తుంటారో అందరికీ తెలియదు. తాజాగా కామెడీ స్టార్స్ షూటింగ్‌ గ్యాప్‌లో సుజాత, అషూ, అవినాష్ తమ్ముడు అజయ్ రెచ్చిపోయినట్టున్నారు.

    Recommended Video

    Rihanna, Greta Thunberg Draw International Attention To Indian Farmers ప్రొటెస్ట్
    మారిపోయిన సుజాత..

    మారిపోయిన సుజాత..

    ఇక సుజాత బిగ్ బాస్ షోలో, న్యూస్ చానెల్‌లో తెలంగాణ పిల్లలా కనిపిస్తుంటుంది. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో కొంత మార్పు కనిపిస్తోంది. వెరైటీ డిజైన్స్, వెరైటీ మేకప్పులతో రచ్చ చేస్తోంది. తాజాగా సుజాత వేసిన స్టెప్పులు, కనిపించిన తీరుకు అందరూ ఫిదా అవుతున్నారు. అజయ్, అషూ, సుజాతలు చేసిన ఈ రీల్ వీడియో బాగానే ఆకట్టుకుంటోంది.

    English summary
    Bigg Boss Fame Jordar Sujatha Dance video Goes viral.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X