కరాటే కల్యాణీ కుటుంబంలో పెను విషాదం: నన్ను తీసుకెళ్లండి.. ఇక్కడ ఉండలేకపోతున్నా అంటూ ఎమోషనల్

ఎన్ని సినిమాల్లో నటించినా.. గుర్తింపు వచ్చేలా ఒక్క పాత్ర దొరికితే చాలు.. ఎంతో ఫేమస్ అయిపోతారు నటీనటులు. అలా ఒకే ఒక్క రోల్‌తో తెలుగు సినీ ఇండస్ట్రీలో బిజీ ఆర్టిస్టుగా మారిపోయారు సీనియర్ నటి కరాటే కల్యాణీ. 'బాబీ' అనే డైలాగ్‌తో విపరీతమైన క్రేజ్‌ను అందుకున్న ఆమె.. ఆ తర్వాత ఎన్నో అవకాశాలను దక్కించుకుని సత్తా చాటారు. ఇక, ఈ మధ్య బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత స్పీడు పెంచి పాలిటిక్స్ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కరాటే కల్యాణీ కుటుంబంలో పెను విషాదం చోటు చేసుకుంది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే...

సినిమాలు.. సీరియళ్లు.. కల్యాణీ కెరీర్ అలా

సినిమాలు.. సీరియళ్లు.. కల్యాణీ కెరీర్ అలా

హరికథ కళాకారిణిగా ఎన్నో స్టేజ్ షోలు ఇచ్చారు కరాటే కల్యాణీ. ఇలాంటి పరిస్థితుల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'ఆది'తో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి నటిగా అడుగు పెట్టారామె. ఆ తర్వాత 'లక్ష్మీ నరసింహా', 'శంకర్ దాదా', 'చత్రపతి', 'కృష్ణ', 'మిరపకాయ్' సహా ఎన్నో సినిమాల్లో నటించారు. అదే సమయంలో 'గోరంత దీపం', 'ముత్యాల ముగ్గు', 'మధుమాసం' వంటి సీరియల్స్ చేశారు.

బిగ్ బాస్‌లోకి ఎంటర్.. ఆదిలోనే భారీ దెబ్బ

బిగ్ బాస్‌లోకి ఎంటర్.. ఆదిలోనే భారీ దెబ్బ

వరుస ఆఫర్లతో బిజీ బిజీగా గడుపుతోన్న కరాటే కల్యాణీ ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చారు. అక్కినేని నాగార్జున సారథ్యంలో వచ్చిన ప్రారంభ ఎపిసోడ్‌లో సంప్రదాయమైన వస్త్రాధరణతో హౌస్‌లోకి ప్రవేశించారామె. అయితే, ఆదిలోనే కొన్ని గొడవల కారణంగా ఆమె నామినేషన్ జోన్‌లోకి వచ్చారు. అలా రెండో వారంలోనే ఎలిమినేట్ అయ్యారు.

రాజకీయాల్లోకి అడుగు... ఆ పార్టీలో చేరిక

రాజకీయాల్లోకి అడుగు... ఆ పార్టీలో చేరిక

బిగ్ బాస్ షో ద్వారా తనకు వచ్చిన పాపులారిటీని ఉపయోగించుకునేందుకు కరాటే కల్యాణీ వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. ఇందులో భాగంగానే త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఆ మధ్య ప్రకటించారామె. అంతేకాదు, 2024 ఎన్నికల లోపు బలమైన నాయకురాలిగా ఎదిగేందుకు ప్లాన్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు.

ఆ ఘటనతో ఏపీ పాలిటిక్స్‌లో.. జగన్‌పైనే

ఆ ఘటనతో ఏపీ పాలిటిక్స్‌లో.. జగన్‌పైనే

రామతీర్థంలో ఉన్న రామాలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. దీంతో అక్కడకు వెళ్లి నిరసన చేశారు కరాటే కల్యాణీ. ఈ సందర్భంగా 'రాష్ట్రంలో రావణ రాజ్యం నడుస్తుంది. హిందువులను కించపరిచేలా నాయకులే రెచ్చగొడుతున్నారు. అందుకే వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి' అంటూ ఏపీ సీఎం జగన్‌‌పై ఫైర్ అయ్యారామె.

కరాటే కల్యాణీ కుటుంబంలో పెను విషాదం

కరాటే కల్యాణీ కుటుంబంలో పెను విషాదం

ఇప్పుడిప్పుడే ప్రజల్లోకి వస్తూ తన భవిష్యత్‌కు బంగారు బాటలు వేసుకుంటున్నారు కరాటే కల్యాణీ. ఇలాంటి సమయంలో ఆమె తండ్రి ప్రముఖ మృదంగ విద్వాంసులు, హరికథ భాగవతలు పడాల రామదాసు ఆదివారం రాత్రి కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధ పడుతోన్న ఆయన చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచారు. దీంతో ఇండస్ట్రీలో విషాదం అలముకుంది.

నన్ను తీసుకెళ్లండి.. ఇక్కడ ఉండలేకపోతున్నా

నన్ను తీసుకెళ్లండి.. ఇక్కడ ఉండలేకపోతున్నా

తన తండ్రి మరణించిన విషయాన్ని కరాటే కల్యాణీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ మేరకు తన ఫేస్‌బుక్ ఖాతాలో కొన్ని పోస్టులు పెట్టారు. తన తండ్రితో దిగిన ఫొటోలనూ షేర్ చేశారు. ఈ సందర్భంగా ఎమోషనల్ అవుతూ కొన్ని కామెంట్లు చేశారు. 'నన్ను ఒంటరిదాన్ని చేసేశారు నాన్నగారూ. నన్ను తీసుకెళ్లండి.. ఇక్కడ ఉండలేకపోతున్నా' అంటూ కన్నీటి పర్యంతం అయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X