twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రెచ్చిపోతోన్న బిగ్ బాస్ కంటెస్టెంట్: మొన్న ఏపీ సీఎంపై.. ఇప్పుడు ఈ ఎమ్మెల్యేపై.. బలిసి మాట్లాడితే!

    |

    సినిమాల్లో నటించినా కొంత మందికి పెద్దగా గుర్తింపు రాదు.. ఇలాంటి వాళ్లే బిగ్ బాస్ రియాలిటీ షోలోకి వస్తే మాత్రం విపరీతమైన పాపులారిటీ దక్కుతోంది. ఇది చాలా కాలంగా మనం చూస్తూనే ఉన్నాం. ఇలా ఎంతో మంది చిన్న చిన్న ఆర్టిస్టులు బిగ్ సెలెబ్రిటీలుగా మారిపోతున్నారు. ఆ కోవలోకే వస్తారు నాలుగో సీజన్ కంటెస్టెంట్ కరాటే కల్యాణీ. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నది రెండు వారాలే అయినా మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఇక, బయటకు వచ్చిన తర్వాత పాలిటిక్స్‌పై ఫోకస్ చేసిన ఆమె.. ఇటీవల ఏపీ సీఎంపై విమర్శలు చేసింది. తాజాగా ఓ ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇచ్చింది. ఆ వివరాలు మీకోసం!

     ఆ ఒక్క డైలాగ్‌తో ఫేమస్.. వరుస ఆఫర్లు

    ఆ ఒక్క డైలాగ్‌తో ఫేమస్.. వరుస ఆఫర్లు

    తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్నారు సీనియర్ నటి కరాటే కల్యాణీ. 'బాబీ' అనే డైలాగ్‌తో విపరీతమైన క్రేజ్‌ను అందుకున్న ఆమె.. వరుసగా సినిమా ఆఫర్లను కూడా ఒడిసిపట్టుకున్నారు. అదే సమయంలో తెలుగు బుల్లితెరపై ప్రసారం అయిన పలు సీరియల్స్‌లోనూ మంచి పాత్రలను పోషించి గుర్తింపును తెచ్చుకున్నారు.

    బిగ్ బాస్‌లోకి ఎంట్రీ... గొడవలు మొదలు

    బిగ్ బాస్‌లోకి ఎంట్రీ... గొడవలు మొదలు

    సినిమాలు, టీవీ సీరియళ్లలో బిజీ బిజీగా గడుపుతోన్న సమయంలోనే కరాటే కల్యాణీకి బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనే అవకాశం వచ్చింది. సోషల్ మెసేజ్ ఇస్తూ హౌస్‌లోకి ప్రవేశించిన ఆమె.. అందరికీ వండి పెడుతూ.. హరికథలు చెబుతూ సందడి చేసింది. అదే సమయంలో చిన్న విషయాలకే ఫీలైపోయి.. గొడవకు దిగేది. ఆట మాత్రం బాగానే ఆడేదీ భామ.

     ఆదిలోనే ఎదురుదెబ్బ.. వెళ్తూ మరొకరిని

    ఆదిలోనే ఎదురుదెబ్బ.. వెళ్తూ మరొకరిని

    ఎన్నో ఆశలతో బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టింది కరాటే కల్యాణీ. కానీ, ఆరంభంలోనే కొందరితో గొడవలకు దిగి హల్‌చల్ చేసింది. దీంతో రెండో వారానికి గానూ ఆమెను నామినేట్ చేశారు తోటి కంటెస్టెంట్లు. దీంతో ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. అదే సమయంలో తనకు వచ్చిన బిగ్ బాంబ్‌తో దేవీ నాగవల్లిని నామినేట్ చేసింది. తర్వాతి వారం ఆమె కూడా ఎలిమినేట్ అయింది.

     పాలిటిక్స్‌పై ఫోకస్.. బయటికొచ్చాక రచ్చ

    పాలిటిక్స్‌పై ఫోకస్.. బయటికొచ్చాక రచ్చ

    బిగ్ బాస్ షో ద్వారా తనకు వచ్చిన పాపులారిటీని ఉపయోగించుకునేందుకు కరాటే కల్యాణీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రకటించిందామె. అంతేకాదు, 2024 ఎన్నికల లోపు బలమైన నాయకురాలిగా ఎదిగేందుకు ప్లాన్లు కూడా చేస్తోంది. ఇందుకోసం బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించి.. విమర్శలకు దిగుతోంది.

    ఏపీ సీఎంపై సంచలన వ్యాఖ్యలు చేసింది

    ఏపీ సీఎంపై సంచలన వ్యాఖ్యలు చేసింది

    ఇటీవల రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహాన్ని కొందరు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. దీని కోసం అక్కడకు వెళ్లి నిరసన చేసిన కరాటే కల్యాణీ.. 'రాష్ట్రంలో రావణ రాజ్యం నడుస్తుంది. హిందువులను కించపరిచేలా నాయకులే రెచ్చగొడుతున్నారు. అందుకే వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి' అంటూ ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసింది.

    ఈ ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇచ్చిన కల్యాణీ

    ఈ ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇచ్చిన కల్యాణీ

    తాజాగా తెలంగాణకు చెందిన విద్యా సాగర్ అనే ఎమ్మెల్యే రామ మందిరానికి విరాళలు సేకరించడంపై విమర్శలు చేశారు. దానిపై ఫేస్‌బుక్ లైవ్‌లో స్పందించిన కల్యాణీ.. 'నీ అయ్యా, అమ్మ జాగీరు ఇస్తున్నావా? రామ భక్తితో సేవ చేస్తాం.. రామకార్యాన్ని కాదనడానికి ఇతనెవరు? రామ మందిరం నిర్మాణంపై బలిసి మాట్లాడితే తాట తీస్తాం.. జాగ్రత్తగా ఉండు' అంటూ వార్నింగ్ ఇచ్చారామె.

    English summary
    Karate Kalyaniborn on 31 October 1977. She is an Indian character actor and comedian from Vizianagaram, Andhra Pradesh. She predominantly works in the Tollywood and appeared in thr Telugu films Chatrapathi and Mirapakay. She has also done some vamp characters in films.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X