Maanas Nagualapalli అరుదైన ఘనత.. నాలుగు భాషల్లోకి బిగ్‌బాస్ కంటెస్టెంట్ మూవీ!
టాలీవుడ్‌లో వర్థమాన నటుడు మానస్ నాగులపల్లి ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులకు సంబంధించిన ఇంటిలో ఒక సభ్యుడిగా మారిపోయారు. బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో కాలుపెట్టిన మొదటి రోజు నుంచి వైవిధ్యమైన హావభావాలతో ఆకట్టుకొంటూ.. టాస్క్‌ల సమయంలో తన మాస్టర్ మైండ్‌ను ఉపయోగిస్తూ ప్రతీ ఒక్కరి హృదయంలో చోటు సంపాదించుకొన్నారు. అయితే బిగ్‌బాస్‌లో ప్రతిభను చాటుతున్న సమయంలో ఆయన నటించి క్షీరసాగర మథనం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తాజాగా అరుదైన విశేషతను సొంతం చేసుకొన్నది. ఆ ఘనత ఏమిటంటే..

అమెజాన్ ప్రైమ్‌లో క్షీరసాగర మథనం
బిగ్‌బాస్ తెలుగు 5 ఫేమ్ మానస్ నాగులపల్లి హీరోగా నటించిన క్షీరసాగర మథనం చిత్రానికి తెలుగులో అసాధారణ విజయం లభించడం తెలిసిందే. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రానికి ఇప్పటికీ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ చిత్రంలో కీలక పాత్రను పోషించిన మానస్ టాప్ 5కి చేరడం క్షీరసాగర మథనం చిత్రానికి బాగా కలిసొచ్చింది.

మానస్ మూవీకి మంచి ఆదరణ
అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో రిలీజైన క్షీరసాగర మథనం సినిమాను ఆడియన్స్ ఇప్పటికీ విశేషంగా ఆదరిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అనువాదం చేసేందుకు ప్లాన్ చేశాం. హీరో మానస్ నాగులపల్లి బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5లో ఫైనలిస్టు కావడమే కాకుండా రియాలిటీ షో ద్వారా లక్షలాది మంది బుల్లితెర ప్రేక్షకుల అభిమానం సొంతం చేసుకోవడం హ్యాపీగా ఉంది. మానస్‌కు పెరిగిన ఫాలోయింగ్ కారణంగా క్షీరసాగర మథనం చిత్రం ఇంత ఘన విజయం సాధించడానికి కారణమైంది అని దర్శకుడు అనిల్ పంగులూరి తెలిపారు.

బ్రహ్మాజీ తనయుడు కీలక పాత్రలో
ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్,... అక్షత సోనావని, చరిష్మా శ్రీకర్, ప్రదీప్ రుద్ర ఇతర ముఖ్య తారాగణంగా... యువ ప్రతిభాశాలి అనిల్ పంగులూరి దర్శకత్వంలో రూపొందిన "క్షీరసాగర మథనం" చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర పిక్చర్స్ తో కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ నిర్మించింది. ఈ సినిమా కంటెంట్ పరంగా యువతను ఆలోచింప చేసే విధంగా ఉండటంతో థియేటర్లలో మంచి రెస్పాన్స్‌ను సొంతం చేసుకొన్నది.

బిగ్‌బాస్ తెలుగు 5 ఫైనలిస్టుగా మానస్
బిగ్‌బాస్ తెలుగు 5లో ఫైనలిస్టుగా చేరిన మానస్ విజేతగా నిలుస్తారా అనే విషయం కోసం డిసెంబర్ 19వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. ఈ రియాలిటీ షో గ్రాండ్ ఫినాలే డిసెంబర్ 19న అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. మానస్ నాగులపల్లి బిగ్ బాస్ విజేతగా నిలవాలని మనసారా కోరుకుంటున్నామని, అందుకు మానస్ అన్నివిధాల అర్హుడని అనిల్ పంగులూరి ఆకాంక్షించారు.


Click it and Unblock the Notifications











