twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్‌బాస్ సెలబ్రిటీ రవికృష్ణకు కరోనా.. వాళ్లందరికీ ప్రమాదమేనంటూ బాంబ్ పేల్చాడు

    By Manoj
    |

    కరోనా వైరస్ రోజురోజుకూ భారీగా విస్తరిస్తోంది. వాతావరణంలో మార్పులు రావడంతో ఆ మహమ్మారి విజృంభిస్తోంది. దీంతో చిన్నా పెద్దా.. రాజు బీద తేడా లేకుండా అందరిపై ప్రభావం చూపిస్తోంది. మరీ ముఖ్యంగా మన దేశంలో కోవిడ్ -19 ఊహించని స్థాయిలో పెరిగిపోతోంది. ఇక, తెలుగు రాష్ట్రాల్లోనైతే పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఈ వైరస్ కారణంగా ఎంతో మంది ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. ఇదిలాఉండగా, కరోనా వైరస్ బుల్లితెరను వణికిస్తోంది. ఇప్పటికే పలువురు ఈ వైరస్ బారిన పడగా... తాజాగా హీరో రవికృష్ణ కరోనా పాజిటివ్‌గా తేలాడు. ఆ వివరాలు మీకోసం.!

    Recommended Video

    Bigg Boss Fame TV Serial Actor Ravi Krishna Tests Corona Positive వాళ్లందరికీ ప్రమాదమేనంటూ బాంబ్..!!
     హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు

    హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు

    ఐదారు నెలలుగా కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. దీని వల్ల ఎంతో మంది మృత్యువాత పడ్డ విషయం తెలిసిందే. అన్ని రంగాలనూ కుదిపేస్తున్న కోవిడ్ - 19.. సినీ రంగంపైనా ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడి ఎంతో మంది నటులు మరణించారు. హాలీవుడ్ నుంచి మొదలెట్టి బాలీవుడ్ వరకు చాలా మంది ప్రాణాంతక వైరస్ బారిన పడ్డారు.

    తెలుగు బుల్లితెరకు కరోనా వైరస్

    తెలుగు బుల్లితెరకు కరోనా వైరస్

    లాక్‌డౌన్ కారణంగా షూటింగులు అన్నీ నిలిచిపోవడంతో మన దేశంలోని నటులకు కరోనా అంతగా సోకలేదు. అయితే, ఇటీవల షూటింగ్‌లు మొదలు కావడంతో పలువురు ఈ వ్యాధికి గురవుతున్నారు. మరీ ముఖ్యంగా తెలుగు బుల్లితెర రంగానికి చెందిన కొందరు నటులు, టెక్నీషియన్లకు కరోనా పాజిటివ్ రావడం ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది.

    ఇద్దరు ప్రముఖులకు కోవిడ్ పాజిటివ్

    ఇద్దరు ప్రముఖులకు కోవిడ్ పాజిటివ్

    ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న ‘సూర్యకాంతం' అనే సీరియల్‌లో నటిస్తోన్న సీనియర్ యాక్టర్ ప్రభాకర్‌కు కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో బుల్లితెర రంగంలో కలకలం రేగింది. ఇక, ఈ మధ్య ‘ఆమె కథ' హీరోయిన్ నవ్య స్వామి కూడా కోవిడ్ బారిన పడ్డారు. దీంతో ఆమెతో పాటు షూటింగ్‌లో పాల్గొన్న అందరిలోనూ వణుకు పుడుతోంది.

     టీవీ స్టార్ రవికృష్ణకు కరోనా పాజిటివ్

    టీవీ స్టార్ రవికృష్ణకు కరోనా పాజిటివ్

    వరుస కేసులతో భయపడిపోతోన్న టెలివిజన్ రంగానికి మరో భారీ షాక్ తగిలింది. బుల్లితెరపై తనదైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న హీరో రవికృష్ణ తాజాగా మహమ్మారి కరోనా బారిన పడ్డాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అతడే స్వయంగా వెల్లడించాడు. మూడు రోజుల క్రితం చేసిన పరీక్షల్లో తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పాడు.

    వాళ్లందరికీ ప్రమాదమేనంటూ బాంబ్

    తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ‘మొన్న జరిగిన టెస్టులో నాకు కరోనా పాజిటివ్ అని వచ్చింది. మూడు రోజులుగా ఇంట్లోనే ఐసోలేట్ అవుతున్నా. ప్రేక్షకుల అభిమానం... దేవుడి దయ వల్ల నాకు ఎటువంటి లక్షణాలు లేవు. అయితే, నాతో కాంటాక్ట్‌లో ఉన్న వారందరూ టెస్ట్‌లు చేయించుకోండి. అలాగే, ఇంట్లోనే ఉండండి. జాగ్రత్తగా ఉండండి' అంటూ అతడు రాసుకొచ్చాడు.

     మమ్మల్ని దయచేసి అలా చూడకండి

    మమ్మల్ని దయచేసి అలా చూడకండి

    అంతేకాదు, కరోనా ప్రమాదకరమైన వ్యాధి అయినప్పటికీ... జాగ్రత్తలు తీసుకుంటే త్వరగా కోలుకోవచ్చని రవికృష్ణ వెల్లడించాడు. ‘కరోనా సోకిన వారిని దయచేసి వివక్షతో చూడకండి. అలా చేయడం వల్ల మేము మానసికంగా బలహీనం అయిపోతాము. మాకు మద్దతుగా నిలిస్తే త్వరగా కోలుకుంటాము' అంటూ అతడు ప్రేక్షకులను, సామాన్యులను అభ్యర్ధించాడు.

     మొగలిరేకులు.. వరూధినీ పరిణయం

    మొగలిరేకులు.. వరూధినీ పరిణయం

    రవికృష్ణ ‘మొగలిరేకులు' సీరియల్‌తో తెలుగు బుల్లితెరకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ప్రసారం అయిన ‘వరూధినీ పరిణయం'తో బాగా ఫేమస్ అయ్యాడు. ఈ ఒక్క సీరియల్ అతడి కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ -3కి ఎంపికయ్యాడు. అప్పటి నుంచి రవికృష్ణ పక్కింటి కుర్రాడిలా పేరు తెచ్చుకుని పాపులారిటీని పెంచుకుంటున్నాడు.

    English summary
    Ravi Krishna is an Indian actor who works in Telugu television industry. He is participating in one of the popular television reality show, Bigg Boss Telugu Season 3 hosted by Akkineni Nagarjuna.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X