సంజన, నిఖితా....మగాళ్లకు చీర సింగారిస్తూ!(ఫోటోలు)
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నిర్వహిస్తున్న 'బిగ్ బాస్' రియాల్టీ షో బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమం ఇన్ఫ్సిరేషన్‌గా....కన్నడ వెర్షన్లో 'బిగ్ బాస్' రియాల్టీ షో ఇప్పటికే ప్రారంభం అయింది. కన్నడ స్టార్ హీరో, ఈగ మూవీ విలన్ సుదీప్ ఈ షోను నిర్వహిస్తున్నారు.
ఈ షోలో మొత్తం 12 మంది కంటెస్టెంట్స్ పాల్గొంటున్నారు. అందరూ కన్నడ సినీ పరిశ్రమకు చెందిన వారే. కనడ టీవీ నటుడు నరేంద్రబాబు శర్మ, కన్నడ సినీ నటుడు విజయ్ రాఘవేంద్ర, కన్నడ టీవీ నటి, యాంకర్ అపర్ణ, కన్నడ మూవీ హాట్ లేడీ చంద్రిక, బిజేపీ మినిస్టర్‌తో సెక్స్ స్కాండల్ ఆరోపణలు ఎదుర్కొంటున్న జయలక్ష్మి, కన్నడ సినిమాల్లో కమెడియన్, ఆర్ట్ డైరెక్టర్ అయిన అరుణ్ సాగర్, హీరోయిన్ సంజన, హీరోయిన్ నిఖిత, నటుడు వినాయక్ జోషి, నటుడు తిలక్, టెలివిజన్ నటి అనుశ్రీ, హాట్ లేడీ శ్వేతా పండిత్ తదితరులు ఈ బిగ్ బాస్ షోలో పాల్గొంటున్నారు.
9వ రోజు...కన్నడ బిగ్ బాస్ హౌజ్‌లో పలు ఆసక్తికర విషయాలు చోటు చేసుకున్నాయి. ఇందులో పాల్గొంటున్న మహిళలు పురుషులుగా, పురుషులు మహిళలుగా మారిపోయారు. వస్త్రధారణ కూడా మర్చేసి పనులు చేయడం మొదలు పెట్టారు. హీరోయిన్ నిఖిత, సంజన తదితరులు మగవారికి మేకప్ వేయడం, చీరకట్టుకోవడంలో వారికి సాయం చేయడం లాంటివి చేసారు.
అందుకు సంబంధించిన ఫోటోలు క్రింది స్లైడ్ షోలో వీక్షించండి.

కన్నడ బిగ్ బాస్ షో దృశ్యాలు

కన్నడ బిగ్ బాస్ షో దృశ్యాలు

కన్నడ బిగ్ బాస్ షో దృశ్యాలు

కన్నడ బిగ్ బాస్ షో దృశ్యాలు

కన్నడ బిగ్ బాస్ షో దృశ్యాలు


Click it and Unblock the Notifications











