Shanmukh Jaswanth వారంలో పెళ్లనగా షణ్ముఖ్ జశ్వంత్ అరెస్ట్... గంజాయి కేసులో అడ్డంగా బుక్కైన బిగ్‌బాస్ రన్నర్

యూట్యూబర్ షణ్ముక్ జశ్వంత్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఓ కేసులో విచారణ కోసం వెళితే గంజాయితో యూట్యూబర్ షణ్ముక్ పట్టుబడ్డాడు. డ్రగ్ కేసులో షణ్ముఖ్ ను, అమ్మాయిని మోసం చేసిన కేసులో ఆయన సోదరుడు సంపత్ వినయ్‌ ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

బిగ్ బాస్ రన్నర్, యూట్యూబర్ షణ్ముక్ జశ్వంత్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో రన్నరప్ గా నిలిచిన షణ్ముఖ్ జస్వంత్ ను పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్ కేసులో షణ్ముఖ్, అమ్మాయిని మోసం చేసిన కేసులో ఆయన సోదరుడు సంపత్ వినయ్‌ ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. డాక్టర్ మౌనిక అనే యువతిని మోసం చేసి.. మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడని షణ్ముఖ్ సోదరుడు సంపత్ పై బాధితురాలు కేసు నమోదు చేసింది.

Bigg Boss Runner Shanmukh Jaswanth Arrested in Ganja Case Full Details Here

మౌనిక ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు... అతడిని ప్రశ్నించేందుకు షణ్ముఖ్ నివసిస్తున్న ఫ్లాట్ కు వెళ్లారు. పోలీసులు అక్కడ తనిఖీలు జరుపగా... అక్కడ షణ్ముఖ్ గంజాయితో అడ్డంగా బుక్కయ్యాడు. మౌనిక వీడియో తీస్తుండగా డ్రగ్స్ మత్తులో ఉన్న షణ్ముఖ్ వీడియో తీయోద్దంటూ రచ్చ చేశాడు. షణ్ముఖ్, సంపత్‌ లను పోలీసులు అరెస్టు చేసి వారిపై కేసులు నమోదు చేశారు. డ్రగ్స్ కేసులో షణ్ముఖ్ అరెస్ట్ అవ్వగా.. అమ్మాయిని మోసం చేసిన కేసులో సంపత్ ను అరెస్ట్ చేసారు.

షణ్ముఖ్ అరెస్టు కావడం ఇది మొదటి సారి కాదు.... గతంలో హిట్ అండ్ రన్ కేసులో అరెస్టు అయ్యాడు కూడా. అప్పుడు మద్యం సేవించి లేకపోవడంతో ఆ కేసు నుండి రిలీజ్ అయ్యాడు. యూట్యూబ్ వీడియోలతో సెలబ్రిటీగా మారిన షణ్ముఖ్... సాఫ్ట్ వేర్ డెవలపర్, సూర్య వెబ్ సిరిసులతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ గుర్తింపు అతడ్ని బిగ్ బాస్ 5లోకి ఎంటర్ అయి.. సీజన్ రన్నర్ అయ్యాడు. ఇక ఆ సీజన్ విన్నర్ కావాల్సిన షణ్ముఖ్ చివరగా రన్నర్ గా నిలిచాడు.

సిరి హనుమంత్ తో కలిసి హద్దులు మీరడంతో విన్నర్ కావాల్సిన జశ్వంత్ రన్నర్ అయ్యేనే వాదనలు వినిపించాయి. ఇక వీజే సన్నీ విజేతగా నిలిచాడు. ఇక బిగ్ బాస్ ఇంట్లో సిరితో చేసిన సిల్లీ పనుల వల్ల అతడి ప్రేమ కూడా బ్రేకప్ అయింది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ దీప్తి సునైనా షణ్ముఖ్ బ్రేకప్ చెప్పేసి బయటకు వచ్చేసింది. ఇక షణ్ముఖ్ ప్రముఖ కమెడియన్ వైవా హర్ష చిత్రం సుందరం మాష్టార్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో ఇటీవల సందడి చేశాడు.

Bigg Boss Runner Shanmukh Jaswanth Arrested in Ganja Case Full Details Here

ఇంతలోనే ఊహించని విధంగా పోలీసులకు దొరికిపోయాడు షణ్ముక్. ప్రస్తుతం షన్ను, అతడి సోదరుడు పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. గంజాయి కేసు కావడం, అమ్మాయి విషయం కావడంతో కేసు స్ట్రాంగ్ ఉండే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్... ఏంట్రా ఇది అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. షణ్ముక్ ఇలా చేయడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు. చూడాలి మరి ఏం జరగనుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X