‘ఉదయ్ కిరణ్ అందుకే చనిపోయాడు’: ఇండస్ట్రీలో పాలిటిక్స్ పై బిగ్ బాస్ ఆదిత్య ఓం షాకింగ్ కామెంట్స్

Aaditya Om- Uday Kiran: అన్ లిమిటెడ్ ఎంటర్టైన్ పేరుతో బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభమైంది. ఈ సీజన్ లో దిమ్మతిరిగే ట్విస్టులతో బిగ్ బాస్ లవర్స్ ను ఎంటర్టైన్ చేస్తున్నారు. ఈ సీజన్ లో ఎవరూ ఊహించని విధంగా మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అయినా హీరో ఆదిత్య ఓం ఎలిమినేట్ చేశారు. ఇలా బయటకు వచ్చిన ఆదిత్య ఓం వరుస ఇంటర్య్వూలు ఇస్తూ.. బిజీబిజీ గా మారారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో హీరో ఆదిత్య ఓం మాట్లాడుతూ.. హీరో ఉదయ్ కిరణ్ ఆత్మహత్యపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట్లో వైరలవుతున్నారు. మీరు కూడా ఓ లూక్కేయండి.

తాజాగా బిగ్ బాస్ ఆదిత్య ఓం ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో హీరో ఉదయ్ కిరణ్ ఆత్యహత్య గురించి ప్రశ్నించగా.. ఉదయ్ కిరణ్ టాలెంటెడ్, సక్సెస్ పుల్ హీరో. అయితే.. సక్సెస్ లో ఉన్న వ్యక్తికి సడెన్ గా ఫెయిల్యూర్స్ రావడంతో ఆ సిచ్యూవేషన్స్ తట్టుకోలేకపోయారు. తనకు కూడా అలాంటి పరిస్థితే వచ్చిందనీ, అసలు నేను పరిశ్రమకు దర్శకుడిగానే వచ్చాను. హీరోగా వరుస ప్లాప్స్ రావడంతో.. తాను డైరెక్షన్స్ వైపు , రైటింగ్స్ వైపు వెళ్లాననీ ఆదిత్య ఓం అన్నారు. కానీ, నటుడుగా ఉంటే.. సినిమాలు లేకపోతే, ఇంట్లో ఖాళీగా కూర్చోంటే.. ఆ పరిస్థితి దారుణంగా ఉంటుందనీ, నలుగురులోకి వెళ్తే.. అందరూ అడుగుతారు. మీరు ఎందుకు సినిమాలు చేయడం లేదు? ఎందుకు మీ సినిమాలు సక్సెస్ కావడం లేదు? అంటూ నానా ప్రశ్నలు వేస్తారని ఆదిత్య ఓం.

Bigg Boss Season 8 fame Aaditya Om sensational comments on hero Uday Kiran suicide

హీరోలకు మెంటల్ హెల్త్ చాలా ముఖ్యం. హీరోస్ కంటే.. క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ లైఫ్ బెటర్. సినిమాల్లో నటించవచ్చు.. అటు సీరియల్స్ లో చేసుకోవచ్చు. వరుసగా అవకాశాలు వస్తాయి. కానీ, హీరో మాత్రం హీరో పాత్రలే చేయాలి. ఉదయ్ కిరణ్ ఈ పరిణామాలు తట్టుకోలేకపోయాడు. నాతో రెండు సినిమాలు చేసిన విజయ్ సాయి కూడా ఇలానే సూసైడ్ చేసున్నారు. ఎలాంటి బ్యాక్ గ్రౌడ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టాలంటే.. మెంటల్ హెల్త్ చాలా ముఖ్యం, అది లేకుండా ఉండటమంటే.. చాలా కష్టమన్నారు ఆదిత్య ఓం.

మరో టాలీవుడ్ లో కొత్త హీరోస్ రాకుండా పాలిటిక్స్ జరిగాయా ? అని ప్రశ్నించగా.. నేను, రోహిత్, ఆకాష్, తరుణ్, ఉదయ్ కిరణ్, అల్లరి నరేష్, ఇలా కొందరు యంగ్ హీరోలందరం ఒకేసారి ఇండస్ట్రీలోకి వచ్చాం. పాలిటిక్స్ అంటే.. ఏం చెప్పలేం, మాకు మంచి ప్లాట్ ఫామ్ దొరికింది. తెలుగు ప్రేక్షకులు మమల్నీ ఆదరించారు. మంచి సక్సెస్ కూడా వచ్చింది. కానీ తరువాత కాలంలో సరైన గైడెన్స్ లేకపోవడం, ఓ పెద్ద మనిషి, గాడ్ ఫాదర్ లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదన్నారు.

అదే సమయంలో పరిచయాలు కూడా ఉండాలని ఆదిత్య ఓం అన్నారు. మిమ్మల్నీ తెలుగు ఇండస్ట్రీలో ప్రోత్సహించే వ్యక్తులు, స్నేహితులేరా అని ప్రశ్నించగా.. ఇండస్ట్రీ అనేది క్లోస్డ్ గ్రూప్. కమర్షియల్ ఇండస్ట్రీ, సక్సెస్, హిట్స్ ఉంటేనే.. ప్రెండ్స్ ఉంటారు. అప్పుడు..ఇప్పుడూ కూడా అలానే ఉంది. పరిశ్రమలో ఎదగాలంటే కచ్చితంగా బ్యాగ్రౌండ్ ఉండాలని చెప్పకనే చెప్పారు ఆదిత్య ఓం.

Bigg Boss Season 8 fame Aaditya Om sensational comments on hero Uday Kiran suicide

ఇదిలా ఉంటే.. ఉదయ్ కిరణ్ ఆత్మహత్య ఇప్పటికే ఇండస్ట్రీలో చర్చనీయమే. ఎలాంటి బ్యాగ్ రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు ఉదయ్ కిరణ్. డైరెక్టర్ తేజ డైరెక్షన్స్ తెరకెక్కించిన 'చిత్రం' మూవీతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు ఉదయ్ కిరణ్. ఆ మూవీ సూపర్ హిట్. రెండో చిత్రం కూడా తేజ దర్శకత్వంలో 'నువ్వు- నేను' అనే బ్లాక్ బస్టర్ కొట్టారు. ఇలా వరుసగా రెండు సినిమాలు హిట్ కొట్టడంతో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు ఉదయ్ కిరణ్ . ఇక మూడో సినిమా 'మనసంతా నువ్వే' ఇది కూడా బ్లాక్ బాస్టర్ కావడంతో లవర్ బాయ్ మారిపోయారు.

హ్యాట్రిక్ హిట్ అందుకోవడంతో ఉదయ్ కిరణ్ స్టార్ హీరోగా ఎదిగారు. 'కలుసుకోవాలని', 'శ్రీరామ్', 'నీస్నేహం' మూవీస్ కాస్త పర్లేదు అనిపించాయి. కానీ, ఆ తరువాత వరుస పరాజయాలు ఎదుర్కొన్నారు. ఉదయ్ కిరణ్ స్టార్ హీరోగా ఉన్న సమయంలో చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మితతో పెళ్లి ఫిక్స్ చేసినట్టు, దాదాపు ఖాయం అనుకున్న సమయంలో వాళ్ల మ్యారేజ్ కాన్సిల్ అయినట్టు టాక్. అనంతరం ఉదయ్ మరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. కానీ, పెళ్లి తరువాత వరుస ప్లాప్స్, తన భార్యతో విబేధాలు తలెత్తాయనీ అందుకే హీరో ఉదయ్ కిరణ్ సూసైడ్ చేసుకున్నారని ఇండస్ట్రీ టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X