twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కొత్త కారుతో ఆనందాలు.. శివజ్యోతి రేంజ్ మారిపోయిందిగా!!.. పిక్స్ వైరల్

    |

    బిగ్ బాస్ షో ఒక్కొక్కరి జీవితాన్ని ఒక్కోలా మలుపు తిప్పుతుంది. అప్పటి వరకు మంచి ఫాంలో ఉన్న వారిని ఎవ్వరికీ కనిపించకుండా చేస్తుంది. ఎవ్వరికీ తెలియని వారిని కూడా స్టార్స్‌గా నిలబెడుతుంది. బిగ్ బాస్ షోలో ఉండే మ్యాజిక్ అదే. అలా ఎంతో మందికి బిగ్ బాస్ షో వల్ల కెరీర్ ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంది. పాజిటివ్ ఇమేజ్ వచ్చిన వాళ్లు ఎంత మంది ఉన్నారో నెగెటివిటీని మూట గట్టుకున్న వాళ్లుకూడా ఉన్నారు. కానీ చాలా మంది మాత్రంబాగానే సెటిల్ అయ్యారు.

    మూడు, నాలుగు సీజన్‌లు..

    మూడు, నాలుగు సీజన్‌లు..

    బిగ్ బాస్ ఇప్పటికి తెలుగులో నాలుగు సీజన్లు పూర్తి చేసుకుంది. నాల్గో సీజన్ రీసెంట్‌గా పూర్తి చేసుకుంది. కాబట్టి కంటెస్టెంట్ల ఫాలోయింగ్ బాగానే ఉంది. హడావిడి కూడా ఎక్కువగానే ఉంది. అయితే నిజంగా ఎవరికి ఆఫర్లు వస్తాయి.. ఎవరెవరు కార్లు, ఇళ్లు కొనుక్కుని సెటిల్ అవుతారో చూడాలి. కానీ మూడో సీజన్ కంటెస్టెంట్లు మాత్రం భారీగానే సెటిల్ అయ్యారు.

     ఆ ముగ్గురు..

    ఆ ముగ్గురు..

    బిగ్ బాస్ మూడో సీజన్ కంటెస్టెంట్లలో విజేతగా నిలిచన రాహుల్ సిప్లిగంజ్ ఆల్రెడీ బెంజ్ కారు కొనేశాడు. అలీ రెజా కూడా అపార్ట్మెంట్ కొంటున్నట్టుగా ఆ మధ్య ప్రకటించేశాడు. ఇక శివజ్యోతి కూడా గతేడాదిలోనే కొత్తింటిని కొనేసింది. గృహ ప్రవేశ వేడుకలను ఘనంగా నిర్వహించేసింది. తాజాగా మరో అడుగు ముందుకు వేసింది.

     కొత్త కారుతో రచ్చ..

    కొత్త కారుతో రచ్చ..

    ఎవ్వరైనా సరే సొంతింటి కల నెరవేరాక కారు కొనాలని అనుకుంటారు. ఇక శివజ్యోతి కూడా అదే ఫార్మూలాను ఫాలో అయింది. కొత్తకారును ఈ మధ్యే కొనేసింది. ఈ మేరకు శివజ్యోతి కారుతో దిగిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. శివజ్యోతి కారు కొన్న విషయాన్ని హిమజ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.

    గ్యాంగ్ సందడి..

    గ్యాంగ్ సందడి..

    తాజాగా బిగ్ బాస్ మూడో సీజన్ కంటెస్టెంట్లు ఈ మధ్య అందరూ కలిసి రచ్చ చేశారు. వితిక షెరు సోదరి పెళ్లి వేడుకలో మూడో సీజన్ కంటెస్టెంట్లు రచ్చ చేశారు. ఇందులో శివజ్యోతి, హిమజ, రవికృష్ణ, పునర్నవిలు సందడి చేశారు. మొత్తానికి శివజ్యోతి మాత్రం ఇళ్లు, కారు, ఇలా ఫంక్షన్లు అంటూ యమా జోరు మీదుంది.

    English summary
    Bigg Boss Shiva jyothi New Creta Car Goes viral,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X