ఆమెను హీరోయిన్ కాకుండా ఓ ఆడపిల్లగానైనా గుర్తించండి: బిగ్ బాస్ శివాజీ ఫైర్
ఆంధ్రప్రదేశ్ లో ముంబాయి నటి వ్యవహరం సంచలనంగా మారింది. గత ప్రభుత్వం హాయాంలో ఆ వైసీపీ పార్టీ నేతలు, పోలీస్ అధికారుల చేతిలో గురైన బాలీవుడ్ నటి కాదంబరి జెత్వానీ చిత్ర హింసలు గురైనట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు తర్వాత తనకు న్యాయం చేయాలంటే.. మీడియా ముందుకొచ్చింది. ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని ఏపీ సర్కార్ కూడా తీవ్రంగా పరిగణిస్తుంది. ఏపీ సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో విచారణకు సహకరించేందుకు నటి ముంబాయి నుంచి హైదరాబాద్‌కు చేరుకొన్నారు.
ఇదిలా ఉంటే.. ఈ విషయంపై పలువురు రాజకీయ, సినీ పెద్దలు స్పందిస్తున్నారు. తమ గత ప్రభుత్వంలో అమ్మాయిలకు రక్షణ లేదనీ, పలువురు నాయకులు, అధికారాలు తమ సొంత ప్రయోజనాల కోసం అధికార దుర్వినియోగం చేశారనీ, ఆడపిల్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ విషయంపై హీరో శివాజీ తనదైన రీతిలో స్పందించారు. గత ప్రభుత్వంలాగా కాకుండా .. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం తన తీరు మార్చుకోవాలని సూచించారు.

చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజలు చాలా నమ్మకం పెట్టుకున్నారనీ, తాను కూడా కొత్త ప్రభుత్వంపై చాలా నమ్మకం పెట్టుకున్నానని, ఇప్పటికైనా అధికారులు తమ తీరు మార్చుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రజలు మంచి సోసైటీ కోసం.. మెరుగైన సమాజం కోసం వెయిట్ చేస్తున్నారని అన్నారు. వండించే వాడు మనవాడైతే... అధికారంలో ఉంటే ఏమైనా చెయొచ్చని గత ప్రభుత్వంలో అధికారులు వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వంలో అధికార వ్యవస్థ పూర్తిగా నాశమైందనీ, గతంలో పలువురు నాయకులు తమ సొంత ప్రయోజనాల కోసం అధికార దుర్వినియోగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ అమ్మాయిని హీరోయిన్ లాగా కాకుండా.. ఓ ఆడపిల్లా చూడండనీ..లేదా కనీసం మనిషిలాగా అయినా గుర్తించండని, ఆడపిల్లలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
విజయవాడలోని ఓ హోటల్‌లో ఉన్న ముంబై నటి కాదంబరి జిత్వానీ నుంచి పోలీసులు వాగ్ములం తీసుకున్నారు. విచారణ సమయంలో నటి తనపై జరిగిన అత్యాచారం నుంచి వరుసగా జరిగిన ఘటనలు వివరించినట్లు సమాచారం. విటిపియస్ గెస్ట్ హౌస్‌లో బంధించి పోలీసులు ఎలా ఇబ్బంది పెట్టారో.. తనపై రేప్ చేశారని కేసు పెట్టిన డిసెంబరు 2023 నుంచి కేసు కొట్టేసిన మార్చి 2024 వరకు జరిగిన ఘటనలు జిత్వానీ వివరించారు. ఆమె చెప్పిన అంశాలను స్టేట్‌మెంట్ రూపంలో, వీడియో రూపంలో విచారణ అధికారులు తీసుకున్నట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











