నాగ్‌తో అలా చిరుతో ఇలా.. ప్లానింగ్ మామూలుగా లేదు.. మెగా ఇంట్లో సోహెల్ రచ్చ

బిగ్ బాస్ షో నాల్గో సీజన్ ముగిసి సరిగ్గా నెల రోజులు అవుతుంది. ఈ క్రమంలో సోహెల్ మళ్లీ ఓసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. గత నెలలో ఇదే టైంకు సోహెల్ సోషల్ మీడియాలో మొత్తం ట్రెండ్ అయ్యాడు. ఇరవైదు లక్షలు తీసుకుని ఆటలోంచి తప్పుకోవడంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. అలా సోహెల్ వేసిన స్టెప్‌తో ఫినాలే ఎపిసోడ్ రూపు రేఖలే మారిపోయాయి.

25 లక్షలతో ఆట మారింది..

25 లక్షలతో ఆట మారింది..

బిగ్ బాస్ ఫినాలె ఎపిసోడ్ నాడు అఖిల్ అభిజిత్ సోహెల్ టాప్ 3లోకి వచ్చారు. అలా ఆ సమయంలో 20 లక్షల ఆఫర్‌ను నాగ్ ఇచ్చాడు. అయినా ఎవ్వరూ ముందుకు రాలేదు. ఇంకో ఐదు లక్షలు పెంచి 25 చేయడంతో సోహెల్ ఆ అవకాశాన్ని వాడుకున్నాడు. అలా రన్నర్ కావాల్సిన వాడు.. బిగ్ బాస్ క్యాష్ విన్నర్‌గా నిలిచాడు. అభిజిత్ నాల్గో సీజన్ విజేతగా, అఖిల్ రన్నర్‌గా మిగిలిపోయాడు.

 ట్రోలింగ్ సైతం..

ట్రోలింగ్ సైతం..

అలా సోహెల్ 25 లక్షలు తీసుకుని బయటకు రావడం, మెహబూబ్ డ్రామా, చిరంజీవి నాగార్జున చెరో పది లక్షలు ఇస్తాననడం, స్టేజ్ మీద నాడు జరిగిన ఘటనలన్నీ ఇంకా వైరల్ అవుతున్నాయి. అలా బిగ్ బాస్ షో అయిపోయి నెల రోజులు అవుతున్న సందర్భంగా సోహెల్.. నాగార్జున, చిరంజీవిలను కలిశాడు.

 నాగార్జునతో అలా..

నాగార్జునతో అలా..

ఇక నాగార్జునతో కలిసిన సోహెల్ స్పెషల్ వీడియోలను షేర్ చేశాడు. నాగార్జున బిగ్ బాస్ మీద చేసిన ఓ వీడియోను చూపించాడు. నాగార్జునతో ఉన్న సమయం, చెప్పిన మాటలను తలుచుకుంటూ సోహెల్ ఎమోషనల్ అయ్యాడు. మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు థ్యాంక్స్.. మీ సూచనలు ఎప్పుడూ ఫాలో అవుతానంటూ సోహెల్ చెప్పుకొచ్చాడు.

చిరుతో ఇలా..

చిరుతో ఇలా..

చిరంజీవి ఇంట్లో సోహెల్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. చిరంజీవి రెండు గంటల విలువైన సమయాన్ని ఇచ్చాడని చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. అంజనా దేవీ, సురేఖలతో కలిసి సోహెల్ ఆశీర్వాదం తీసుకున్నాడు. ఎన్నో గొప్ప గొప్ప సూచనలు ఇచ్చాడు. జీవితానికి సరిపడా మాటలను చెప్పాడని సోహెల్ ఎమోషనల్ అయ్యాడు.

స్పెషల్ గిఫ్ట్..

స్పెషల్ గిఫ్ట్..

ఇక చిరంజీవి సోహెల్‌కు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు. దాన్ని తన అభిమానులకు చూపిస్తూ ఎమోషలన్ అయ్యాడు, అది ఎవరు ఇచ్చారో గెస్ చేస్తూ ఉండండి అంటూ ఆసక్తిని పెంచాడు. చివరకు అది చిరంజీవి ఇచ్చిన గిఫ్ట్‌ అని చెబుతూ.. ఇక అది ఎప్పుడూ కూడానాతో పాటే ఉంటుందని ఎమోషనల్ అయ్యాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X