ఇంకా ఆ వేషాలు మానలేదు!.. సెట్‌లో సోహెల్ నిర్వాకం..హీరోయిన్ కంటతడి
బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ చేసే అల్లరి, అరిచే అరుపులు, పెట్టుకునే గొడవల గురించి అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ ఇంట్లో సోహెల్ గొడవ పడని రోజంటూ లేదు. ఆ సమయంలో సోహెల్‌కు సంబంధించిన పాత వీడియోలు కూడా చక్కర్లు కొట్టాయి. సోహెల్ మీద ఎవరో ప్రాంక్ చేస్తే ఆ సమయంలోనూ రెచ్చిపోయాడు. చాచి ఒక్కటి ఇచ్చాడు సోహెల్. అలా గొడవలు అంటే సోహెల్‌కు మహా ఇష్టమున్నట్టుంది. బిగ్ బాస్ ఇంట్లో పెట్టుకున్న గొడవలు చాలవన్నట్టుగా ఇప్పుడు మరో గొడవ పెట్టుకున్నాడు. కానీ చివరకు ట్విస్ట్ ఇచ్చాడు.

బిగ్ బాస్ ఇంట్లో అలా..
బిగ్ బాస్ ఇంట్లో సోహెల్ చేసిన గొడవలు, కంటెస్టెంట్లతో పోట్లాడిన ఎపిసోడ్‌ల గురించి అందరికీ తెలిసిందే. దాదాపు ప్రతీ ఒక్క కంటెస్టెంట్‌తో సోహెల్ గొడవకు దిగాడు. అరియానా, హారిక, అఖిల్, మెహబూబ్, అభిజిత్, అవినాష్ ఇలా ప్రతీ ఒక్కరితో ఏదో ఒక విషయంలో సోహెల్ గొడవలు పెట్టుకున్నాడు.

తాజాగా మూవీ సెట్‌లో..
ప్రస్తుతం సోహెల్ తన మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ప్రతీ రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉండాల్సి వస్తుందట. ఈ మధ్యే హీరోయిన్‌ను కూడా పరిచయం చేశారు. ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య ఫేమ్ రూపా కొడవయూర్‌ను సోహెల్ కోసం తీసుకొచ్చారు. అయితే తాజాగా ఈ హీరోయిన్‌ను చిత్రయూనిట్ భయపెట్టేసింది.
ఫైటింగ్ అంటూ..
మామూలుగానే సోహెల్‌కు కోపం ఎక్కువ. ఈ విషయం అందరికీ తెలిసిందే. మూవీ యూనిట్‌లో ఓ వ్యక్తితో గొడపడినట్టు, ఇద్దరూ కొట్టుకునే స్థాయి వరకు వ్యవహారం వెళ్లినట్టు, నిర్మాత మధ్యలో వచ్చి సద్దుమణిగేట్టు చేసినట్టు ఓ వీడియో చక్కర్లు కొట్టేసింది. ఇందులో హీరోయిన్ దెబ్బకు షాకై కన్నీరు పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. సోహెల్ కోపం, ఆ గొడవలు చూసి ఆమె భయపడినట్టు తెలుస్తోంది.

పర్ఫామెన్స్ పీక్స్..
అయితే అది ఫ్రాంక్ అని హీరోయిన్ మీద కావాలనే చేశామని, ఇందులో సోహెల్ అద్భుతంగా జీవించాడని అందరూ సెటైర్లు వేశారు. ఇక తనతో గొడవకు దిగిన మణి అనే వ్యక్తి అద్భుతంగా నటించాడని సోహెల్ కామెంట్ చేశాడు. హీరోయిన్ భయపడటంతో ఆమెను దగ్గరకు తీసుకుని సోహెల్ ఓదార్చాడు. మొత్తానికి సోహెల్ నిర్వాకానికి హీరోయిన్ కంటతడి పెట్టేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











