twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కల్యాణి అందుకే వదిలేసింది.. 9 ఏళ్లలో కనీసం 300 సార్లైనా సూసైడ్ .. సూర్య కిరణ్

    |

    బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4లోకి వెళ్లిన దర్శకుడు సూర్య కిరణ్ తొలివారంలోనే ఇంటి ముఖం పట్టారు. ఈ సీజన్‌లో బిగ్‌బాస్ హౌజ్ నుంచి బయటకు వచ్చిన తొలి కంటెస్టెంట్‌గా ఆయన నిలిచారు. బిగ్‌బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చిన సూర్యకిరణ్ పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలకు ఇచ్చారు. తన జీవితంలో చోటుచేసుకొన్న కొన్ని షాకింగ్ విషయాలను వెల్లడించారు. సూర్య కిరణ్ ఏం చెప్పారంటే..

    సొంతంగా సినిమా తీసి నష్టపోయాను

    సొంతంగా సినిమా తీసి నష్టపోయాను

    సత్యం లాంటి హిట్టుగా వచ్చిన తర్వాత ఓ సినిమాను సొంతంగా నిర్మించాను. ఆ సినిమా ఫ్లాప్ కావడంతో సినిమా ఆఫర్లు తగ్గిపోయాయి. దాదాపు 9 ఏళ్లుగా సినిమాకు దూరంగా ఉన్నాను. ఒక్క సినిమా నా జీవితాన్ని అధోపాతాళానికి తొక్కేసింది. నేను సినిమా సొంతంగా తీసినప్పుడు డిజిటల్ లేకపోయింది. ప్రింట్స్ కావడం వల్ల నేను ఎక్కువగా నష్టపోయాను. జీవితంలో సంపాదించిందంతా పోగొట్టుకొన్నాను అని సూర్య కిరణ్ చెప్పారు.

    ఇంటిని సీజ్.. కార్లు తీసుకెళ్లితే..

    ఇంటిని సీజ్.. కార్లు తీసుకెళ్లితే..

    నాకు ఎనిమిదేళ్ల వయసులోనే బాల నటుడిగా నటించాను. ఆ తర్వాత దర్శకుడిగా మారి హిట్లు ఇచ్చాను. 80వ దశకంలో ఇండియన్ ఎయిర్‌లైన్స్‌లో అత్యధిక సార్లు ప్రయాణించిన వారిలో నేను ఒక్కరిని. అలాంటిది ఒక్క ఫ్లాప్ నా జీవితాన్ని తారుమారు చూసింది. బ్యాంకు వాళ్లు వచ్చి ఇంటిని సీజ్ చేశారు. నాలుగు కార్లు తీసుకెళ్లారు. బీఎండబ్ల్యూ కారులో వెళ్లే నేను నా అసిస్టెంట్ ద్విచక్రవాహనంపై వెళ్లే అంతగా జీవితం దిగజారింది అని సూర్య కిరణ్ పేర్కొన్నారు.

    అప్పుల వాళ్లు ఇంటిపైకి వచ్చి

    అప్పుల వాళ్లు ఇంటిపైకి వచ్చి

    నా కెరీర్ దిగజారి నా ఆస్తులన్నీ పోవడం కారణంగానే నా భార్య కల్యాణి నన్ను వదిలేసి పోయింది. తన పెద్ద హీరోయిన్.. అలాంటి ఆమె ఇంటికి అప్పుల వాళ్లు వచ్చి గొడవ చేస్తే తట్టుకోలేకపోయారు. అందుకే నన్ను వదిలేసి పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ 5జీ అనే సినిమాను తీశాను. అప్పుడు ఏదో ప్రమాదం జరిగింది. నేను చేసినా ప్రతీది నాకు చేదు అనుభవాన్ని ఇచ్చింది అంటూ సూర్య కిరణ్ ఆవేదన వ్యక్తం చేశారు.

    నాకు నా స్నేహితులు అండగా నిలబడి

    నాకు నా స్నేహితులు అండగా నిలబడి


    నాకు వచ్చిన కష్టాలకు తట్టుకొని నిలబడ్డాను. సమస్యల్లో ఉన్నప్పుడు నా స్నేహితులు, కొందరు నిర్మాతలు నాకు అండగా నిలిచారు. నాకు డబ్బు అవసరం ఉందంటే వెంటనే 20 లక్షల రూపాయలు ఇచ్చారు. నాకు అప్పు ఇచ్చిన వాళ్లు ఎవరూ కూడా నాపై ఒత్తిడి చేయడం లేదు. అందుకే ప్రశాంతంగా ఉన్నాను అని సూర్య కిరణ్ చెప్పారు.

    Recommended Video

    Bigg Boss Telugu 4: Noel sean Demands Sorry From Bigg Boss
    కనీసం 300 సార్లైనా సూసైడ్ చేసుకొనే పరిస్థితి

    కనీసం 300 సార్లైనా సూసైడ్ చేసుకొనే పరిస్థితి

    బిగ్‌బాస్‌లోని వాళ్లకు జీవితం ఎలా ఉంచుకోవాలనే విషయాలను చెప్పాను. మీరు గుడికి వెళ్లితే కొందరు డబ్బు కావాలని, మరి కొందరు మంచి కెరీర్ కావాలని, అలాగే ఇంకొందరు ఇంకేదో కావాలని కోరుకొంటారు. కానీ నా జీవితంలో మీరు కోరుకొనే అన్నీ నేను కోరుకోవాల్సి వస్తుంది. నాకు బలుపు ఎక్కువ. నేను ఎదుర్కొన్న సమస్యలకు కనీసం 300 సార్లైనా సూసైడ్ చేసుకొనే పరిస్థితి అంటూ సూర్య కిరణ్ అన్నారు.

    English summary
    Director Surya Kiran eliminated from Bigg Boss Telugu 3 after first week. After Elimination, Surya Kiran spoke to media and revealed his struggles and failures and separation with Kayani. He said, After failure, He should have committed suicide 300 times.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X