మోనాల్ గజ్జర్‌కు కింగ్ నాగార్జున బంపర్ ఆఫర్.. అంతా బిగ్‌బాస్ మాయ!
గ్లామర్ తార మోనాల్ గజ్జర్ సుడిగాడు సినిమాతో టాలీవుడ్‌లోకి ప్రవేశించి పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రయత్నం చేసింది. అయితే తెలుగులో అంతగా గుర్తింపు రాకరపోవడంతో మలయాళం, హిందీ, గుజరాతీ భాషలపై ఫోకస్ పెట్టింది. అయినా మోనాల్ గజ్జర్ కెరీర్ గ్రాఫ్ మాత్రం రివ్వును ఎగురలేకపోయింది. అయితే బిగ్‌బాస్ తెలుగు 4లో నటించిన తర్వాతే మోనాల్ తెలుగు రాష్ట్రాల్లో అందరికి సుపరిచితమైంది. ఇప్పుడు బిగ్‌బాస్‌లోని మ్యాజిక్‌తో మోనాల్ కెరీర్ ఊపందుకొన్నట్టు కనిపిస్తున్నది. నాగార్జున సరసన నటించే అవకాశం దక్కించుకొన్న మోనాల్ గురించి మరిన్నీ వివరాలు..

బిగ్‌బాస్‌లోకి అలాంటి క్రేజ్‌తో
బిగ్‌బాస్ తెలుగు 4 వేదికపై మోనాల్ గజ్జర్ మెరిసినా గానీ అంతగా ఆమెను గుర్తించలేకపోయారు. అప్పటి వరకు థర్డ్ గ్రేడ్ హీరోయిన్ అనే అభిప్రాయం ఉండేది. ఒక్కసారి బిగ్‌బాస్‌లో అందచందాలతో ఆకట్టుకొన్న తర్వాత చాలా మంది బుల్లితెర అభిమానులు ఫిదా అయిపోయారు. ఓ దశలో బిగ్‌బాస్ తెలుగు 4 టైటిల్ రేసులో కూడా ఉన్నట్టు కనిపించింది.

అఖిల్ సార్థక్‌తో కెమిస్ట్రీ
ఇక బిగ్‌బాస్ తెలుగులో అఖిల్ సార్థక్‌తో రొమాంటిక్ ఎపిసోడ్స్, అతడితో కెమిస్ట్రీ కారణంగా భారీగా ఫాలోయింగ్ ఏర్పడింది. వారి మధ్య ముద్దులు, సన్నిహితంగా ఉండే సీన్లతో గ్లామర్ పరంగా మంచి క్రేజ్ సంపాదించుకొన్నది. అఖిల్ సార్థక్‌తో కెమిస్ట్రీ వర్కవుట్ కావడంతో మోనాల్‌కు మంచి గుర్తింపు వచ్చింది.

బిగ్‌బాస్ షో తర్వాత మోనాల్ క్రేజ్
ఇక బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మోనాల్ రేంజ్ భారీగా పెరిగిపోయింది. షోలో సంపాదించుకొన్న క్రేజ్‌తో అవకాశాలు కుప్పలుతెప్పలుగా వచ్చాయి. కానీ వాటిని ఆచితూచి ఆఫర్లను అందుకొంటున్నది. బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఓంకార్ హోస్ట్‌గా నిర్వహించే డాన్సీ ++ షోలో జడ్జీగా ఆకట్టుకొన్నది. డాన్సీ ప్లస్‌లో గ్లామర్ పంట కూడా పండించింది. ఆ తర్వాత బెల్లంకొండ శ్రీను నటించిన అల్లుడు అదుర్స్ అనే చిత్రంలో స్పెషల్ సాంగ్‌లో మైమరిపించింది.

నాగార్జున బంగర్రాజులో ఆఫర్
ఇప్పుడు ఏకంగా నాగార్జున నటించే చిత్రంలో క్రేజీ రోల్‌ను సొంతం చేసుకొన్నట్టు తెలుస్తున్నది. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్తున్న బంగార్రాజు చిత్రంలో స్సెషల్ రోల్‌ను మోనాల్‌కు ఆఫర్ చేసినట్టు తెలిసింది. ఈ చిత్రం సొగ్గాడే చిన్నినాయన చిత్రానికి సీక్వెల్ అనే సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో సొగ్గాడే చిన్నినాయన చిత్రంలో నాగార్జున, రమ్యకృష్ణను కలిపిన ఈ దర్శకుడు మరోసారి ఆ జంటను తెరపై ఆవిష్కరించడానికి సిద్దమవుతున్నాడు.

ఇంద్రలోకంలో రంభగా
ఇక బంగార్రాజు చిత్రంలో మోనాల్ గజ్జర్ ఇంద్రలోకంలో రంభగా నటించనున్నారనేది తాజా సమాచారం. ఈ చిత్రంలో స్వర్గంలో రంభగా ఆమె కనిపిస్తారు. అంతేకాకుండా స్వర్గం ఎపిసోడ్‌లో చిత్రీకరించే పాటలో కింగ్ నాగార్జునతో రొమాన్స్ చేస్తారనే విషయం బయటకు వచ్చింది. నాగ్, మోనాల్ పాట అభిమానులను ఉర్రూతలూగించడం ఖాయమనే మాట కూడా వినిపిస్తుంది.
Recommended Video

నాగచైతన్య, కృతిశెట్టి స్పెషల్ రోల్స్‌లో
బంగర్రాజు చిత్రంలో నాగచైతన్య, కృతిశెట్టి ప్రత్యేక ఆకర్షణగా మారారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 20వ తేదీన హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది. ఈ సినిమా తొలిషెడ్యూల్‌ను రాజమండ్రిలో నిర్వహించే ప్లాన్‌లో ఉన్నారు. నవంబర్ కల్లా షూటింగు ముగించి 2022 వేసవిలో సినిమాను రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.


Click it and Unblock the Notifications











