Shivaji: రెండో భార్య గురించి బయటపెట్టిన శివాజీ... సంచలన విషయాలు వెలుగులోకి!

హీరో శివాజీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆ రోజుల్లో హీరోగా ఎన్నో సినిమాల్లో నటించి.. ప్రేక్షకులను అలరించాడు. ఇటీవల బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా ఎంటర్ అయి.. ప్రేక్షకులకు తన మైండ్ గేమ్ తో ఎంటర్ టైన్ చేస్తూ వచ్చాడు. అయితే శివాజీ తాజాగా ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అయితే ఆ ఇంటర్వ్యూలో తన రెండో భార్య గురించి, తన లైఫ్ గురించి ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. తొలిసారిగా లైవ్ లో శివాజీ తన రెండో భార్య గురించి చెప్పడం చర్చనీయాంశం అవుతుంది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా ఎన్నో పాత్రలు చేసి.. శివాజీ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 90స్ కాలంలో ఎన్నో సినిమాల్లో కామెడీ, సిరియస్ చిత్రాలు చేసి... ఎంటర్ టైన్ చేశాడు. అయితే సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. రాజకీయాల్లోకి వెళ్లిన శివాజీ.. ఇటీవల బిగ్ బాస్ రియాలిటీ షోలో కనిపించారు. ఇక శివాజీ బిగ్ బాస్ హౌస్ లో ఓ పెద్ద మనిషిలా... అందరితో మెలుగుతూ.. మైండ్ గేమ్ ఆడుతూ.. ప్రేక్షకుల మన్ననలు పొందారు.

 Bigg Boss Telugu 7 Shivaji revealed about his second wife for the first time Full Details Here

అయితే ఈ సీజన్ విన్నర్ శివాజీ అని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఓ కామన్ మ్యాన్ విజేతగా నిలిచారు. శివాజీ మూడో స్థానానికి కైవసం అయ్యారు. అయితే ఆ విషయం పక్కన పెడితే.. శివాజీ రాజకీయాలకు పుల్ స్టాప్ పెట్టేసి.. సినిమాలపై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఓ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. తన వ్యక్తిగత, సినిమాల విషయాల గురించి వెల్లడించారు.

లైవ్ ఇంటర్వ్యూలోనే శివాజీ.. తన రెండో భార్య గురించి బయట పెట్టారు. తన రెండో భార్య లేకుండా తాను లేను అంటూ వెల్లడించారు. రెండో భార్య అంటే.. మనిషి అనుకుంటే పొరపాటే... ఆయనకు ఎంతో ఇష్టమైన కాఫీనే తనకు రెండో భార్య అంటూ చెప్పుకువచ్చారు. ఆ కాఫీ లేకపోతే.. తాను బతకలేనని.. అది నా రెండో భార్య అంటూ కామెడీగా చెప్పుకువచ్చారు. ఇక రోజుకు రెండు సార్లు కాఫీ తాగుతాను అని చెప్పారు.

ఇక కాఫీ గురించి బిగ్ బాస్ హౌస్ లో కూడా రచ్చ జరిగిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ కాఫీ పంపించకపోవడంతో శివాజీ రచ్చ అంతా ఇంతా కాదు.. కాఫీనే నా భార్య అంటూ చెప్పుకువచ్చాడు. ఇక ఈ ఇంటర్వ్యులో బిగ్ బాస్ గురించి మాట్లాడుతూ... తనను విలన్ గా చూపించారని మండిపడ్డారు. తన స్క్రీన్ టైం తగ్గించి.. విలన్ గా చూపించారని అన్నారు. ఇక తను ఎప్పుడు న్యాయం వైపు ఉంటానని తెలిపారు.

 Bigg Boss Telugu 7 Shivaji revealed about his second wife for the first time Full Details Here

అందుకే జన్యూన్ గా వచ్చిన పల్లవి ప్రశాంత్, యావర్ లకు సపోర్ట్ చేసినట్లు తెలిపారు. వారితో బంధం ఎప్పటికి ఉంటుందని తెలిపారు. పల్లవి ప్రశాంత్ కు ఏమి తెలియదు... ఆరోజు రాత్రి ఎవరో కావాలని చేసిన పని... అంటూ చెప్పుకువచ్చారు. ఇక బిగ్ బాస్ స్క్రిప్టెడా అని ప్రశ్నించగా.. స్క్రిప్టెడ్ మాత్రం కాదు అన్నారు. ఇక శివాజీ ప్రస్తుతం 90స్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. ఈ సిరీస్ వచ్చే ఏడాది జనవరి 5న రిలీజ్ ఈటీవీ విన్ లో రిలీజ్ కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X