Bigg Boss 8 Telugu Latest Promo: ‘చెత్త’ నామినేషన్స్..బ్రెయిన్‌లెస్ మనుషులు.. యూజ్‌లెస్ పిపుల్స్

Bigg Boss 8 Telugu Latest Promo: బిగ్ బాస్ సీజన్ 8 బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. చూస్తుండగానే రెండు వారాలను పూర్తి చేసుకుని మూడోవారంలోకి అడుగుపెట్టింది ఈ రియాలిటీ షో. ఈ సీజన్లో ఇప్పటివరకు బేజవాడ బేబక్క, ఆ తరువాత శేఖర్ భాషాలు ఎలిమినేట్ అయిపోయి ఇంటికి వెళ్లిపోయారు. అయితే.. ఆర్జే శేఖర్ బాషా ఎలిమినేషన్ బాగ్ బాస్ లవర్స్ కు ఏమాత్రం నచ్చడం లేదు. అతడ్ని అన్యాయంగా హౌస్ నుంచి బయటకు పంపించారనీ, శేఖర్ భాషా తిరిగి బీబీహౌస్ లోకి తీసుకోవాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా మూడో వారం తొలి రోజే.. నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన ప్రోమో తాజాగా విడుదలైంది.

బిగ్ బాస్ సీజన్ 8లో ప్రతీవారం నామినేషన్ల పర్వం చాలా రసవత్తరంగా సాగుతోంది. అసలూ నామినేషన్లు అంటేనే.. బీబీ హౌస్ షేక్ అవుతోంది. కంటెస్టెంట్ల తమ విశ్వరూపాన్ని చూపిస్తున్నారు. ఎన్నో రోజులు దాచుకున్న కోపాన్ని వెల్లగక్కుతున్నారు. అలా ఈ వారం ఎలిమినేషన్ కూడా తగ్గదేలే అన్నట్టుగా ప్రతి కంటెస్టెంట్ ఇరగదీశారు. అయితే..ఈ వారం చెత్త నామినేషన్స్ జరిగాయి. చెత్త నామినేషన్స్ ఎంటీ అని ఆలోచిస్తున్నారా..? అంటే ప్రతీ కంటెస్టెంట్ తమకు నచ్చని ఇద్దరూ కంటెస్టెంట్ల తలపై చెత్త వేసి నామినేట్ చేయాలి. ఈ నామినేషన్ల పర్వంలో మరోసారి బిగ్ బాస్ మహానటి యష్మీ గౌడ హైలెట్ గా నిలిచారు. అలాగే.. మణికంఠ తనలోని ఎమోషన్‌ను బయటపెట్టాడు. ఈ సారి నబిల్ కూడా తన విశ్వరూపాన్ని ప్రదర్శించారు.

Bigg Boss Telugu 8 Day 15 Promo 2 out Nomination Drama Intensifies

ముందుగా సోనియా ఆకుల వచ్చి డ్యాన్సింగ్ డాల్ నైనికాను నామినేట్ చేస్తూ.. ఓవర్ కాన్ఫిడెన్స్ ఉందని వార్నింగ్ ఇచ్చింది. మరోవైపు పృథ్వి కూడా నైనికాను నామినేట్ చేశారు. ఈ సందర్భంలో కొత్త పాయింట్స్ ఏమైనా ఉంటే చెప్పండంటూ నైనికా గట్టిగా అరిచేసింది. దానికి పృథ్వి బదులిస్తూ..
కొత్త పాయింట్స్ ఏమీ లేవన్నాడు. ఆ తరువాత నైనికా వంతు వచ్చింది. తనను నామినేట్ చేసిన సోనియాను నామినేట్ చేసింది నైనిక. ఈ సమయంలో 'నాకు అసలు మీరు పోటీ అనిపించడం లేదు'అని షాకింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చింది.

ఈ స్టెట్ మెంట్ తో రెచ్చిపోయిన సోనియా 'నేను చూపిస్తున్న బలం అంతా ముందు నుండి నాలోనే ఉంది' అంటూ దిమ్మ తిరిగే సమాధానమిచ్చింది. ఈ యష్మీ మరోసారి తన నోరుపారేసుకుంది. 'నిఖిల్, అభయ్,పృథ్వి మీద చూపించిన ఇంట్రెస్ట్ టీమ్‌పై చూపించలేదు. నీ కంఫర్ట్‌ను బట్టి నేను ఆడటానికి రాలేదు. బుర్ర లేదు'అంటూ సోనియాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ తరువాత ప్రేరణ వర్సెస్ విష్ణుప్రియ గా వార్ నడిచింది. విష్ణుప్రియాను ప్రేరణ నామినేట్ చేసింది. ఈ క్రమంలో విష్ణు.. 'నీకు వివరణ ఇవాల్సిన అవసరం లేదు, బ్రెయిన్‌లెస్ మనుషులు' అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. దీంతో వెంటనే ప్రేరణ కూడా ''యూజ్‌లెస్ పిపుల్స్ ' అంటూ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది విష్ణుకు.

ఆ తరువాత ఆదిత్య ఓం వచ్చి మణికంఠను నామినేట్ చేశారు. ఈ క్రమంలో 'నేను కూడా హార్డ్‌గా ఉంటే ఈ హౌజ్‌లో నీకు సపోర్ట్ చేయడు' అని అన్నాడు ఆదిత్య ఓం. వెంటనే రియాక్ట్ అయినా మణికంఠ.. 'నేనెప్పుడూ మీ దగ్గరకు వచ్చి పొగడండి అని అడగలేదు'అని అన్నారు. ఆ తరువాత యష్మీ వచ్చి.. సెన్సెషనల్ కామెంట్స్ చేసింది. తాను హౌజ్‌లో ఉన్ననని రోజులు నీను ఎలిమినేషట్ చేస్తానని మణికంఠకు వార్నింగ్ ఇచ్చింది.

ఇక నబీల్ వంతు వచ్చింది.అతడు ప్రేరణను నామినేట్ చేయగా అరవడం మొదలుపెట్టింది. దీంతో రియాక్ట్ అయినా.. నబిల్..'అరిస్తే గెలుస్తావంటే.. నీకంటే గట్టిగా అరవగలను' అన్నారు. అయితే.. అరుచుకో అంటూ పొగరుగా చెప్పింది ప్రేరణ. ఈ క్రమంలో వీరి ఓవరాక్షన్ చూసి కంటెస్టెంట్లంతా తలలు పట్టుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X