పవన్ కల్యాణ్‌పై పోటీకి బిగ్‌బాస్ కంటెస్టెంట్.. పిఠాపురం బరిలో డిపాజిట్ దక్కించుకొంటుందా?
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో వేసవిని మించిన వాతావరణం కనిపిస్తున్నది. రాజకీయా పార్టీల ఎత్తులుపైఎత్తులతో ప్రచార సభలు దద్దరిల్లుతున్నాయి. రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను రంగంలోకి దించి గెలుపు దిశగా ప్రయత్నాలు ప్రారంభిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రధాన పార్టీలకు సంబంధం లేకుండా ఇండిపెండెంట్లుగా రంగంలోకి దిగి ప్రత్యేక ఆకర్షణగా మారారు. అయితే ఏపీలో అత్యంత ఆసక్తిని రేపుతున్న పిఠాపురం నియోజక వర్గం నుంచి బిగ్‌బాస్ కంటెస్టెంట్ బరిలోకి దిగడం రాజకీయంగా ఆ నియోజకవర్గంపై అందరి దృష్టి పడింది. ఆ బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఎవరు అనే వివరాల్లోకి వెళితే..
ఏపీలో అత్యంత పాపులారిటీని సంపాదించుకొన్న అసెంబ్లీ నియోజకవర్గం పిఠాపురం. ఈ నియోజకవర్గంపై దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారంతా దృష్టిపెట్టారు. ఈ నియోజకవర్గం నుంచి పవన్ కల్యాణ్ ఎంత మెజారిటీతో గెలుస్తారనే విషయంపై బెట్టింగులు జోరుగా జరుగుతున్నాయి.

పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకొంటున్నాయి. పవన్ కల్యాణ్‌పై ప్రధాన రాజకీయ పార్టీలే కాకుండా స్వతంత్ర్య అభ్యర్థులు రంగంలోకి దిగుతున్నాయి. అలా రంగంలోకి దిగుతున్న వారిలో బిగ్ బాస్ కంటెస్టెంట్ తమన్నా సింహాద్రి ఉన్నారు. ఆమె కూడా పిఠాపురం నుంచి పోటీ చేసేందుకు సిద్దమయ్యారు.
ట్రాన్స్‌జెండర్‌గా బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలోకి ప్రవేశించిన తమన్నా సింహాద్రి ఇంటిలో ఫైర్ బ్రాండ్‌గా కనిపించారు. ఇంటి సభ్యులతో ఆమె తన హక్కుల కోసం పోరాడిన తీరు కొంత వివాదాస్పదంగాను, కొంత న్యాయంగా కనిపించింది. బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొన్ని సినిమాల్లో కనిపించినా పెద్దగా కెరీర్ పరంగా ఎదుగలేకపోయింది.

తెలుగు సినిమా పరిశ్రమను కుదిపేసిన క్యాస్టింగ్ కౌచ్ సమయంలో వివాదాస్పద నటి శ్రీరెడ్డికి తమన్నా అండగా నిలిచింది. దాంతో ఆమె కొంత పాపులారిటీని సంపాదించుకొన్నది. ఆ తర్వాత ట్రాన్స్ జెండర్ల హక్కుల గురించి పోరాటం చేస్తూ.. వినోద రంగంలో రాణించే ప్రయత్నం చేస్తున్నది.
ఇక రాజకీయ రంగంలో తమన్నా సింహాద్రి గతంలో యాక్టివ్‌గా కనిపించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేసింది. టీడీపీ అభ్యర్థి నారా లోకేష్, వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి మీద పోటీ చేసి డిపాజిట్ కూడా దక్కించుకలేకపోయింది. తాజాగా పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన ఆమె భారత చైతన్య యువజన పార్టీ తరఫున పిఠాపురం నుంచి బరిలోకి దిగుతుండటం విశేషంగా మారింది.


Click it and Unblock the Notifications











