కమ్మ వాళ్లవి ఏం పీకాడు.. వ్యూహం మూవీని మడిచి పెట్టుకోమను.. ఆర్జీవిపై బిగ్‌బాస్ శివాజీ ఫైర్
తెలుగు సినిమా పరిశ్రమలో నటుడిగా దాదాపు 100 సినిమాలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకొన్న హీరో శివాజీ. ఇటీవల బిగ్‌బాస్ తెలుగు 7 సీజన్‌లో తనదైన శైలిలో మైండ్ గేమ్ ఆడి అందర్ని ఆకట్టుకొన్నాడు. బిగ్‌బాస్ టైటిల్‌కు చేరువైన ఆయన తృటిలో తప్పించుకొన్నాడు. తాజాగా ఆయన మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శివాజీ మాట్లాడుతూ.. రాంగోపాల్ వర్మ నిప్పులు చెరిగారు. ఆయన చెప్పిన విషయాల్లోకి వెళితే.
దర్శకుడు రాంగోపాల్ వర్మ సినిమాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. గతంలో కమ్మరాజ్యంలో కడప రెడ్లు అనే సినిమా తీశాడు. కమ్మ వాళ్లవి ఏం పీకాడు? ఆయనకు జీవితాన్ని ఇచ్చిందే కమ్మవాళ్లు. ఆయనకు కూడు పెట్టిందే కమ్మవాళ్లు. అలాంటి కులంపై సినిమాలు తీస్తే ఏ మనిషి అనుకోవాలి అని శివాజీ ఘాటుగా స్పందించాడు.

చంద్రబాబును ఎవరైనా తిడితే వైఎస్ జగన్ వాళ్లకు వీరాభిమాని అవుతాడు. చంద్రబాబును తిడుతున్నాడు కాబట్టి వర్మకు సపోర్ట్ ఇస్తున్నాడు. జగన్ ఫండింగ్ చేస్తున్నాడు. వర్మ సినిమా తీస్తున్నాడు. ఆర్జీవి తెలివైన బిజినెస్ మెన్. జగన్‌ను వర్మ వాడుకొన్నాడు. వ్యూహం సినిమా ఏం ప్రభావం చూపదు. ఆ సినిమాను వర్మ మడిచిపెట్టుకోమని చెబుతాను అని శివాజీ చెప్పాడు.
ఏపీకి ప్రత్యేక హోదా గానీ, ఆంధ్రాకు కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని ఎవరైనా ప్రశ్నించారా? వైజాగ్‌లో ఉద్యమాలు చేస్తుంటే ఒక్కడైనా వచ్చాడా? వర్మ లాంటి పొరంబోకులు సినిమాలు తీయడం ద్వారా ఏదో చెప్పాలని ప్రయత్నిస్తే ఎవరైనా వింటారా? ఆయన మాటలు పోరంబోకులు మాత్రమే వింటారు. కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమా తీస్తే.. ఏం పీకావురా బఫూన్ అని తిట్టారు. త్వరలోనే ఆయనకు ఓ క్లారిటీ వస్తుంది అని శివాజీ చెప్పారు.

వర్మకు జగన్ ఫండింగ్ ఇస్తున్నాడు. ఆయన నడిపే ఛానెల్‌కు వాళ్లే ఫండింగ్ ఇస్తున్నారు. ఆయన కట్టుకొన్న డెన్ కూడా వాళ్లే కట్టించి ఇచ్చారు. ఉదయం లేచినప్పటి నుంచి పడుకొనే వరకు అయ్యే ఖర్చంతా వారిదే. అందుకే పవన్ కల్యాణ్‌ను, చంద్రబాబును వ్యూస్ కోసం తిడుతుంటాడు అని శివాజీ ఘాటుగా స్పందించాడు.

నాకు భయం లేదని వర్మ మాటలు చెబుతుంటాడు. అలాంటి మాటలు చెప్పడం చాలా ఈజీ. ప్రకృతి భయపెడుతుంది. కొన్నాళ్లు ఆగితే నీకే తెలుస్తుంది. కొద్దిగా ఓపిక పట్టు.. పనిపాట లేని వ్యక్తి ఆయన. అలాంటి వాళ్లే ఇలాంటివి ఆలోచిస్తుంటారు. నా మాట మీద నేనే నిలబడను. నేను నిజాలు చెప్పను అనే వ్యక్తి.. వ్యూహం లాంటి సినిమాలు తీస్తే ఎవరు చూస్తారు అని శివాజీ ప్రశ్నించాడు.


Click it and Unblock the Notifications











