»   » ఉత్కంఠగా సాగిన ఫైనల్: ‘బిగ్ బాస్ తెలుగు’ విన్నర్ శివ బాలాజీ

ఉత్కంఠగా సాగిన ఫైనల్: ‘బిగ్ బాస్ తెలుగు’ విన్నర్ శివ బాలాజీ

Posted By:
Subscribe to Filmibeat Telugu
Bigg Boss Season 1 Title Winner Siva Balaji wins,takes home Rs 50 lakh | Filmibeat Telugu

తెలుగు టెలివిజన్ చరిత్రలో సరికొత్త రియాల్టీ షో 'బిగ్ బాస్’ సీజన్ 1 విజయవంతంగా పూర్తయింది. మొత్తం 14 మంది పోటీ పడగా... హరితేజ, శివ బాలాజీ, ఆదర్శ్, నవదీప్, అర్చన మధ్య చివరి వారం వరకు టఫ్ కాంపిటీషన్ జరిగింది. 10 వారాల పాటు పోటాపోటీగా సాగిన ఈ షోలో శివ బాలాజీ విన్ అయ్యారు. శివ బాలాజీ, ఆదర్శ్ చివరి వరకు పోటీ పడగా శివబాలాజీ 3 కోట్ల 34 లక్షల పైచిలుకు ఓట్లతో విజేతగా అవతరించారు. ఎన్టీఆర్ హోస్ట్ చేసిన ఈ షో హయ్యెస్ట్ టీఆర్పీ రేటింగులతో సంచలనం క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. 

విన్నర్‌ శివ బాలాజీ

విన్నర్‌ శివ బాలాజీ

ఆదివారం సాయంత్రం 6 గంటలకు స్టార్ మాటీవీలో బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే మొదలైంది. రాత్రి 10.30 గంటల వరకు ఉత్కంఠగా షో సాగింది. శివ బాలాజీ, ఆదర్శ్ ఈ ఇద్దరూ చివరకు వరకు కొనసాగారు. చివరకు శివ బాలాజీని విన్నర్‌గా ప్రకటించడంతో బిగ్ బాస్ సీజన్ 1కు తెరపడింది.

రికార్డు స్థాయిలో 11 కోట్ల ఓట్లు

రికార్డు స్థాయిలో 11 కోట్ల ఓట్లు

బిగ్ బాస్ తెలుగు విజేతను ఎంపిక చేసే ప్రక్రియలో భారీ స్థాయిలో ప్రేక్షకులు ఓట్లు వేశారు. మొత్తం 11 కోట్ల ఓట్లు ప్రేక్షకుల నుండి వచ్చినట్లు ఎన్టీఆర్ వెల్లడించారు.

ఎన్టీఆర్, దేవిశ్రీ డాన్స్‌తో మొదలు

ఎన్టీఆర్, దేవిశ్రీ డాన్స్‌తో మొదలు

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే షో దేవిశ్రీ ప్రసాద్ డాన్స్ పెర్ఫార్మెన్స్ తో మొదలైంది. తర్వాత ఎన్టీఆర్ కూడా జాయిన్ అయి షోను గ్రాండ్ గా ప్రారంభించారు.

ఊహించని పరిణామం, హరితేజ ఔట్

ఊహించని పరిణామం, హరితేజ ఔట్

చాలా మంది బిగ్ బాస్ విన్నర్ హరితేజ అవుతుందని భావించారు. అయితే చాలా మంది ఊహలు తారుమారు అయ్యాయి. ఆమె మూడో స్థానంలో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

టెన్షన్ గేమ్ అనంతరం నవదీప్ ఔట్

టెన్షన్ గేమ్ అనంతరం నవదీప్ ఔట్

ఐదుగురు ఫైనలిస్టుల్లో మొదట అర్చన ఎలిమినేట్ అవ్వగా..... అనంతరం నవదీప్ ఎలిమినేట్ అయ్యారు. నవదీప్ ఎలిమినేట్ అయ్యే క్రమంలో నలుగురు సభ్యులతో ఎన్టీఆర్ బాక్సుల గేమ్ ఆడించారు. గేమ్ ఉత్కంఠగా సాగిన అనంతరం నవదీప్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు.

అర్చన ఎలిమినేట్

అర్చన ఎలిమినేట్

ఐదుగురు హౌస్ మేట్స్ నుండి...ఒకరిని విజేతగా ప్రకటించే క్రమంలో అందరి కంటే ముందుగా అర్చన ఎలిమినేట్ చేశారు. ప్రేక్షకులు ఊహించినట్లే అందరికంటే ముందుగా అర్చన ఈ షో నుండి ఎలిమినేట్ అయ్యారు.

బిగ్ బాస్ మీద పుస్తకం

బిగ్ బాస్ మీద పుస్తకం

బిగ్ బాస్ షో మీద పుస్తకం రాయబోతున్నట్లు మహేష్ కత్తి ఈ సందర్భంగా వెల్లడించారు. 4 చాప్టర్లతో ఈ పుస్తకం ఉంటుందని, తారక్ తోనే ఈ పుస్తక ఆవిష్కరణ ఉంటుందని తెలిపారు.

నెక్ట్స్ సీజన్లో అవకాశం కోసం సంపూర్ణేష్ బాబు

నెక్ట్స్ సీజన్లో అవకాశం కోసం సంపూర్ణేష్ బాబు

బిగ్ బాస్ సీజన్ 1లో అవకాశం దక్కడమే గొప్ప. పరిస్థితులను తట్టుకోలేక బయటకు వెళ్లి తప్పు చేశాను. మరో సీజన్లో అవకాశం ఇస్తే చేస్తాను అని సంపూర్ణేష్ బాబు బిగ్ బాస్ కు విన్నవించారు.నా కూతురు ‘నాన్నా.. నువ్వు నిజంగానే ఏడ్చావా? లేక అది టాస్కా?' అని అడిగింది. ఆ మాటకు చచ్చిపోవాలనిపించింది.'' అని సంపూ నవ్వుతూ చెప్పారు. బిగ్‌బాస్ సీజన్-2లో అవకాశం వస్తే చివరి వరకు ఉండడానికి ప్రయత్నిస్తానని సంపూ తెలిపారు.

మహేష్ కత్తికి ఉచిత సలహా అవార్డ్

మహేష్ కత్తికి ఉచిత సలహా అవార్డ్

ఈ సందర్భంగా కొన్ని అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. మహేష్ కత్తికి ఉచిత సలహా అవార్డును ఎన్టీఆర్ బహూకరించారు.

మధుప్రియ

మధుప్రియ

గండిపేట గండి మైసమ్మ పాట పాడుతూ సింగర్ మధు ప్రియ పాట పాడి లైవ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది.

సంపూకు అయోమయం అవార్డు

సంపూకు అయోమయం అవార్డు

బిగ్ బాస్ షోలో ప్రధానం చేసిన ఫన్నీ అవార్డుల్లో.... సంపూర్ణేష్ బాబుకు అయోమయం అవార్డు ఇచ్చారు. ఈ సందర్భంగా సంపూ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ ఆస్కార్ అవార్డుకు ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ లా ఉందని ఎన్టీఆర్ ప్రశంసించారు. మీరు బిగ్ బాస్ ఇంట్లో తక్కువ రోజులు జర్నీ చేసినా... అది అందరికీ గుర్తుండి పోయిందని ఎన్టీఆర్ అన్నారు. అయోమయం అవార్డు ఇచ్చినంత మాత్రాన మీరు అయోమయం వ్యక్తి కాదని ఎన్టీఆర్ అన్నారు.

దీక్షకు గ్రైండర్ అవార్డ్

దీక్షకు గ్రైండర్ అవార్డ్

బిగ్ బాస్ ఇంట్లో తిండిబోతుగా ఫోకస్ అయిన దీక్ష పంత్‌కు గ్రైండర్ అవార్డు ఇచ్చారు. ఈ సందర్భంగా దీక్ష మాట్లాడుతూ.... తాను ఫూడీ కాదని, ఆకలైనపుడు మాత్రమే తింటానని, అయితే బిగ్ బాస్ తనకు ఏదో ఒక అవార్డు ఇచ్చినందుకు హ్యాపీగా ఉందని తెలిపారు.

ప్రిన్స్ మిస్టర్ రోమియో అవార్డ్

ప్రిన్స్ మిస్టర్ రోమియో అవార్డ్

మిస్టర్ రోమియో అవార్డుకు నవదీప్, శివ బాలాజీ పోటీ పడగా... వారిని అధిగమించి ప్రిన్స్‌కు ఈ అవార్డు దక్కింది. ఈ అవార్డును ప్రిన్స్... దీక్ష చేతుల మీదుగా అందుకోవడం గమనార్హం. అనంతరం ఇద్దరూ కలిసి డాన్స్ పెర్పార్మెన్స్ ఇచ్చారు.

ధనరాజ్ కు బెస్ట్ ఎంటర్టెనర్ అవార్డ్

ధనరాజ్ కు బెస్ట్ ఎంటర్టెనర్ అవార్డ్

బిగ్ బాస్ ప్రజంట్ చేసిన అవార్డుల్లో నవదీప్‌కు బెస్ట్ ఎంట్టెన్మెంట్ అవార్డు దక్కింది. తన కెరీర్లో తీసుకున్న మొదటి అవార్డు ఇదే అని ధనరాజ్ తెలిపారు.

ఫిట్టింగ్ మాస్టర్ అవార్డ్

ఫిట్టింగ్ మాస్టర్ అవార్డ్

బిగ్ బాస్ ఫన్నీ అవార్డుల్లో భాగంగా.... కత్తి కార్తీకకు ఫిట్టింగ్ మాస్టర్ అవార్డు ఇచ్చారు. ఆమె ఇంట్లో ఉన్న సమయంలో సభ్యుల మధ్య ఫిట్టింగ్స్ పెట్టారని కొన్ని వీడియో క్లిప్సింగ్స్ ప్రదర్శించిన అనంతరం ఆమెకు ఈ అవార్డు ప్రకటించారు.

గుండెల్లో గోదారి అవార్డ్

గుండెల్లో గోదారి అవార్డ్

ఇంట్లో అందరికంటే ఎక్కువగా ఏడ్చిన సింగర్ మధు ప్రియకు గుండెల్లో గోదారి అవార్డు ఇచ్చారు. ఆమె బిగ్ బాస్ ఇంట్లో ఉన్నంత సేపూ ఎక్కువగా ఏడుస్తూనే కనిపించిన సంగతి తెలిసిందే.

సమీర్- గురకరాయుడు అవార్డ్

సమీర్- గురకరాయుడు అవార్డ్

బిగ్ బాస్ ఇంటి సభ్యుడైన సమీర్ ను బిగ్ బాస్ గురకరాయుడు అవార్డుతో సత్కరించారు.

బిగ్ బాస్

బిగ్ బాస్

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే షోకు బిగ్ బాస్ ఇంటి నుండి ఎలిమినేట్ అయిన సంపూర్ణేష్ బాబు, ధనరాజ్, దీక్ష, ప్రిన్స్, మధుప్రియ, కత్తి మహేష్, సమీర్, జ్యోతి, కత్తి కార్తీక తదితరులతో పాటు.... ఫైనల్ కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

English summary
Finally after 70 days of waiting the final winner of telugu bigg boss season 1 final winner name announced in few hours.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu