తొక్కలో నువ్వెంత.. హేమపై ఊగిపోయిన శ్రీముఖి.. పెడబొబ్బలతో దద్దరిల్లిన బిగ్‌బాస్
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 3లో సెలబ్రిటీల మధ్య విబేధాలు రోజు రోజుకు ముదిరిపోతున్నాయి. ఒకరంటే మరొకరికి పడనంతగా అభిప్రాయ బేధాలు భగ్గుమన్నాయి. నాలుగో రోజు కార్యక్రమంలో హేమ, రాహుల్, హేమ-శ్రీముఖి మధ్య, అలాగే వరుణ్ సందేశ్ దంపతులు రాహుల్ విట్ట మధ్య గొడవలు తారస్థాయికి చేరుకొన్నాయి. వారి మధ్య గొడవలకు కారణమేమిటంటే..

మాటలు రువ్వుకొన్న హేమ, శ్రీముఖి..
హేమ, రాహుల్ మధ్య మూడో రోజు చోటుచేసుకొన్న గొడవ నాలుగో రోజు కూడా కొనసాగింది. వంట విషయంలో రాహుల్, హేమలు మాటలు రువ్వుకున్నారు. ఓ దశలో రాహుల్ ఈసడించుకొని వంటగది నుంచి బయటకు వెళ్లాడు. ఆ తర్వాత ఇంటి సభ్యులందరూ కలిసి సామరస్యంగా మాట్లాడుకొందామని అనుకొన్నారు. అయితే హేమ అందుకు ఒప్పుకోకపోగా నాగార్జున గారికి చెప్పుకొందాం అంటే.. మహేష్ స్పందిస్తూ నాగార్జున లెవెల్ ఎక్కడా ఈ చిల్లర పంచాయితీ గురించి ఆయనకెందుకు అని పంచ్ వేశాడు.

లగ్జరీ బడ్జెట్ టాస్క్ విఫలం
ఇంటిలో లగ్జరీ బడ్జెట్ టాస్క్ చోటుచేసుకొన్నది. హేమ, జాఫర్ ఈ టాస్క్‌లో పాల్గొని విజయం సాధించారు. ఇంటి సభ్యులకు 3000 పాయింట్ల మేర బడ్జెట్ లభించింది. బడ్జెట్‌ను ఉపయోగించుకోవడానికి కంపూటర్ డిస్ ప్లే, బోర్డుపై వస్తువులు రాయడంలో ఇంటి సభ్యులు విఫలమయ్యారు. బడ్జెట్ టాస్క్ విఫలం కావడంతో శ్రీముఖిని హేమ టార్గెట్ చేస్తూ నీవల్లనే వస్తువులను సమకూర్చుకోలేకపోయాం. వస్తువులు సెలెక్ట్ చేయకుండా నీవు ప్లేట్‌లో భోజనం పెట్టుకొంటావా అని హేమ ప్రశ్నించింది.

హేమపై ఆగ్రహంతో శ్రీముఖి..
తనను హేమ ప్రశ్నించడంతో శ్రీముఖి ఆగ్రహంతో ఊగిపోయింది. నేను సరైన సమయంలోనే టెలివిజన్ వద్దకు చేరుకొన్నాను. ప్లేట్‌లో అన్నం పెట్టుకొన్నప్పటికీ.. కరెక్ట్ టైమ్‌లోనే అక్కడికి వచ్చాను. అందులో నా తప్పేమిటీ? మీరే టెలివిజన్‌ను స్విచ్ఛాఫ్ చేశారు. తప్పంతా మీదే అని హేమ మీద శ్రీముఖి విరుచుకుపడింది. ఆ తర్వాత స్మోకింగ్ జోన్‌లోకి వెళ్లి అలిగి కూర్చోవడం జరిగింది.

శ్రీముఖి ఘాటుగా ఫైర్
శ్రీముఖి స్కోకింగ్ జోన్‌లోకి వెళ్లి నేను అన్నం తినను అని బెట్టు చేసింది. అయితే ఇంటి సభ్యులు వచ్చి సముదాయించడంతో రెండు నిమిషాలు ఆగి వస్తానని శ్రీముఖి చెప్పింది. ఇంతలోనే హేమ అక్కడికి వచ్చి తన వెర్షన్ చెప్పబోయింది. దాంతో మరోసారి శ్రీముఖి ఘాటుగా జవాబిచ్చింది. దాంతో ఆ గొడవ అక్కడే సద్దుమణిగింది. తొక్కలో అంటూ హేమపై గట్టిగా అరిచింది.


Click it and Unblock the Notifications











