AP Elections బిగ్‌బాస్ శివాజీ సంచలన వీడియో.. ఓటింగ్‌కు ముందు వైఎస్ జగన్ దుర్మార్గాలు ఇవే అంటూ!
ఓ సర్వే సంస్థ ఏపీ రాజకీయాలు, ఎన్నికలపై ఓ రిపోర్టు ఇచ్చేందుకు సిద్దమైంది. తనకు సీటు ఇవ్వలేదని కూటమికి వ్యతిరేకంగా సర్వే ఇవ్వబోతున్నాడు. తప్పుడు సర్వేలతో ప్రజలను మార్చలేవు. నీవు ఏం చేసినా, 100 సర్వేలు ఇచ్చినా కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు. సైలెంట్‌గా ఉంటే ఉన్న పరువు కాపాడుకోవచ్చు అంటూ శివాజీ ఓ వీడియోను రిలీజ్ చేశారు.
ఇక ఏపీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ముస్లింలు అంటే ప్రేమ లేదు. బీసీలు, ఎవరిపై ప్రేమ లేదు. కేవలం ఆయనకు ఉన్న ప్రేమ మొత్తం అక్రమంగా సంపాదించుకోవడమే అని ఘాటుగా స్పందించారు. మిస్బా అనే విద్యార్థిని ఎలా చంపారో తెలియదా? వైసీపీ నేత కూతురు కంటే ఎక్కువ మార్కులు వస్తున్నాయని మిస్పాను ఆ స్కూల్ నుంచి పంపించి మానసిక క్షోభ గురయ్యేలా చంపేశారు అని శివాజీ అన్నారు.

నా ముస్లిం సోదరులు అంటూ దొంగ మాటలు చెబుతారు. నంద్యాలలో ఓ ముస్లిం కుటుంబం రైలు పట్టాల మీద ఆత్మహత్య చేసుకొంటే.. అప్పుడు ఏమౌపోయావు సీఎం గారు. అలాగే పిడుగురాళ్ల వద్ద ఇద్దరు ముస్లిం సోదరుల్ని ఊరి నుంచి తరిమివేసి... వారిని నాపరాళ్లతో కాళ్లు విరగొట్టినప్పుడు ఏమైందని ఆయన అన్నారు.

ఏపీలో వైఎస్ జగన్‌కు తప్పా ఎవరికైనా ఓటు వేయండి. రాష్ట్రానికి ఆయన చేసిందేమీ లేదు. ఆయన సంపాదించుకోవడం తప్ప. మందు మీద అక్రమంగా సంపాదించుకొన్నాడు. అన్ని చోట్ల డబ్బు సంపాదించాడు. ఇక రైతుల నుంచి భూములు, డబ్బు లాగేసుకోవడానికి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తెచ్చారు. నీ సొంత భూమిని కూడా నిరూపించుకోవాల్సిన పరిస్థితి రైతులకు ఏర్పడింది. ప్రైవేట్ అధికారులు చేతుల్లో ఉండే భూమి ఉంటుంది. నీవు మీ అమ్మాయికి ల్యాండ్ ట్రాన్స్‌ఫర్ చేయాలంటే.. ఆ అధికారులు మెప్పించాలి. ఆ చట్టం దుర్మార్గమైంది అని శివాజీ అన్నారు.

వైఎస్ జగన్ గత ఐదు ఏళ్లలో అక్రమంగా భారీగా సంపాదించాడు. ఆయన సంపాదించిన సొమ్ముతో ఏపీలో ఐదు, ఆరు బుల్లెట్ ట్రైన్స్ వేయవచ్చు. నేను తెలుగుదేశం పార్టీకి ఓటు వేయమని చెప్పడానికి, లేదా మిమ్మల్ని మభ్య పెట్టడానికి చెప్పడం లేదు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రైతుల మీదు పిడుగు లాంటిదే అని ఆయన అన్నారు.


Click it and Unblock the Notifications











