ఆ మాటలకి భాధకలిగింది, మేకప్ రూమ్ లోకి వెళ్లి ఏడ్చేశాను: ఆనాటి చేదు సంఘటన గురించి శివబాలాజీ
Recommended Video

టాలీవుడ్‌లో విభిన్నమైన పాత్రలు పోషిస్తూ మంచి పేరు తెచ్చుకొన్న నటుడు శివ బాలాజీ. ఇటీవల కాలంలో కాటమరాయుడు చిత్రంలో పోషించిన పాత్రకు మంచి పేరు వచ్చింది. తెలుగు బిగ్‌బాస్ రియాలిటీ షో విజేతగా నిలువడంతో మరింత క్రేజ్ వచ్చింది. బిగ్ బాస్ విన్నర్‌గా నిలిచిన తర్వాత స్వీయ నిర్మాణ సారథ్యంలో స్నేహమేరా జీవితం సినిమాను తెరక్కెక్కించాడు. అయితే ఇప్పుడంటే ఫేం అయ్యాడుగానీ కెరీర్ ఆరంభం లో శివబాలాజీ కూడా చాలా అవమానాలనే ఎదుర్కున్నాడు...

ఎన్నో అవమానాలు
అప్పటి ఒక చేదు అనుభవాన్ని ఒక ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు ఈ నటుడు... కెరియర్లో ఎన్నో అవమానాలు ఎదురవుతూ ఉంటాయి .. అవన్నీ దాటుకుంటూ ముందుకు వెళ్లినప్పుడే సక్సెస్ లు దొరుకుతుంటాయి. అలా అనుకున్నప్పటికీ ఏదో ఒక చేదు జ్ఞాపకం వెంటాడుతూనే ఉంటుంది.

చేదు అనుభవం
అలాంటి చేదు అనుభవం ఏదైనా ఉందా మీ జీవితంలో?" అనే ప్రశ్న తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వూలో శివబాలాజీకి ఎదురైంది. అప్పుడాయన స్పందిస్తూ .. " నేను సినిమాల్లోకి రావడం మా నాన్నకు ఇష్టం లేకపోవడం వలన, నా కెరియర్ జీరోతో మొదలైంది" అన్నాడు.

మా అశోగ్గాడి లవ్ స్టోరీ
"నా ఫస్టు మూవీ 'ఇది మా అశోగ్గాడి లవ్ స్టోరీ' షూటింగ్ జరుగుతోంది. ప్రొడక్షన్ వాళ్లు ప్రతి ఆర్టిస్టుకు ఓ వాటర్ బాటిల్ ఇచ్చేవాళ్లు. నాకు కూలింగ్ వాటర్ తాగడం అలవాటు. అందువలన నేను ఒక వాటర్ బాటిల్ తీసుకుని .. ఐస్ బాక్స్ లో పెట్టడం కోసం మరో బాటిల్ ను అడగమని నా అసిస్టెంట్ తో చెప్పాను.

మేకప్ రూమ్‌లో ఏడ్చేశాను
'మా సార్ కి ఇంకో వాటర్ బాటిల్ కావాలి' అని నా అసిస్టెంట్ ప్రొడక్షన్ బాయ్ ను అడిగాడు. అప్పుడతను 'మీ సార్ కి ఒక బాటిల్ ఇవ్వడమే ఎక్కువ, రెండవ బాటిల్ అవసరం లేదు' అన్నాడు. అంతే, ఆ మాటలు నాకు చాలా బాధ కలిగించాయి .. మేకప్ రూమ్ లోకి వెళ్లి ఏడ్చేశాను" అంటూ చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications











