బిగ్‌బాస్‌కు ఇక సెలవు... గుడ్ బై చెబుతూ నాని ట్వీట్!
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 2 ముగియడంతో హోస్ట్‌గా వ్యవహరించిన నాని ఇక బిగ్ బాస్‌కు సెలవు అంటూ ట్వీట్ చేశారు. బిగ్ బాస్ షో చివరి రోజు కావడంతో ఈ నేచురల్ స్టార్ భావోద్వేగంతో స్పందించారు.
ఈ రోజు బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలె ... హోస్ట్‌గా నాకు చివరి రోజు. ఇప్పటి వరకు నేను నా బెస్ట్ ఇచ్చాను అనుకుంటున్నాను. ఈ షోను హోస్ట్ చేయడం ఒక అద్భుతమైన అనుభూతి. దీని ద్వారా చాలా నేర్చుకున్నాను. నేర్చుకోలేనివి చాలా ఉన్నాయి... అని నాని తెలిపారు.

ఈ షో ద్వారా నన్ను ఇష్టపడిన వారికి అందరికీ ధన్యవాదాలు. హోస్ట్‌గా నన్ను ఇష్టపడని వారిని థియేటర్లలో కలుస్తాను. బిగ్ బాస్‌కు ఇక సెలవు.... అంటూ గ్రాండ్ ఫినాలె మొదలవ్వడానికి కొన్ని గంటల ముందు నాని ట్వీట్ చేశారు.
నాని ట్వీట్ బట్టి.... ఇదే ఆయన బిగ్ బాస్ షో చివరి హోస్టింగ్ అని, నెక్ట్స్ సీజన్‌ను ఈ నేచురల్ స్టార్ హోస్ట్ చేసే అవకాశం లేదని స్పష్టం అవుతోంది. మరి బిగ్ బాస్ సీజన్ 3గా ఎవరు వస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











