హెబ్బా పటేల్‌తో కౌశల్.. కీలక ప్రకటన చేసిన బిగ్ బాస్ విన్నర్.. ఫ్యాన్స్‌కు పండగే
కౌశల్ మండా.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు ఒక సంచలనం. తెలుగు రియాలిటీ షో 'బిగ్‌బాస్' ద్వారా ఈయన హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. గత సంవత్సరం 'స్టార్ మా' చానెల్‌లో ప్రసారమైన బిగ్‌బాస్ సీజన్-2 ద్వారా కౌశల్ స్టార్ అయిపోయాడు. ఈ షోలో ఎన్నో కష్టాలను ఎదుర్కొనడంతో పాటు, హౌస్‌లోని అందరూ టార్గెట్ చేయడంతో చాలా మంది కౌశల్‌కు మద్దతుగా నిలిచారు. అతడు పడుతున్న కష్టాలు చూసి ప్రేక్షకులు భారీ స్థాయిలో ఓట్లు వేశారు. ఈ క్రమంలో కొందరు ఆర్మీలా తయారై అతడిని విన్నర్‌ను చేశారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా కౌశల్ పేరు మారుమ్రోగిపోయింది. తాజాగా కౌశల్ ఓ కీలక ప్రకటన చేశాడు.

గెలిపించిన సానుభూతి
ఆ షోలో ఎన్నో కష్టాలను ఎదుర్కొనడంతో పాటు, హౌస్‌లోని అందరూ టార్గెట్ చేయడంతో చాలా మంది కౌశల్‌కు మద్దతుగా నిలిచారు. అతడు పడుతున్న కష్టాలు చూసి ప్రేక్షకులు భారీ స్థాయిలో ఓట్లు వేశారు. ఈ క్రమంలో కొందరు ఆర్మీలా తయారై అతడిని విన్నర్‌ను చేశారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా కౌశల్ పేరు మారుమ్రోగిపోయింది.

సినిమాలు చేయడం లేదంటూ ట్రోల్స్
కౌశల్.. ‘బిగ్ బాస్' విన్నర్ అయినప్పటికీ ఆయనతో సినిమాలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదంటూ కొందరు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసిన విషయం తెలిసిందే. దీన్ని ప్రస్తావిస్తూ చాలా మంది అతడిపై విమర్శలు చేశారు. దీంతో కౌశల్ ఫ్యాన్స్ కూడా.. సినిమా ఎందుకు తీయడం లేదంటూ అతడిని ప్రశ్నించారు.
కౌశల్ స్పందన
సినిమాలు తీయడం లేదంటూ వస్తున్న వార్తలపై కౌశల్ ఇటీవల స్పందించాడు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ‘‘నా జీవితాన్ని చూసుకోవడం కంటే నా భార్యను కాపాడుకోవడమే ముఖ్యం. ఆమె ఆరోగ్యం నా కెరీర్ కంటే ఎక్కువ. నా సినిమాల కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ అందరికీ ఇదే నా ఆన్సర్. ఆమె ఆరోగ్యం మెరుగైన తర్వాతనే సినిమాలు చేస్తాను'' అంటూ తన భార్యతో ఉన్న ఫొటోను షేర్ చేశాడు.

హెబ్బా పటేల్‌తో ఫిల్మ్
సోషల్ మీడియా వేదికగా కౌశల్ కీలక ప్రకటన చేశాడు. త్వరలోనే ‘కుమారి 21F' ఫేం హెబ్బా పటేల్‌ను డైరెక్ట్ చేయబోతున్నట్లు వెల్లడించాడు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఇద్దరూ దిగిన పిక్‌ను షేర్ చేశాడు. అంతేకాదు, ‘టైటిల్స్ వస్తుంటాయి.. పోతుంటాయి.. నా మల్టీటాస్కింగ్ మాత్రం అలాగే ఉండిపోతుంది. శ్రీరామ్ గోల్డ్ లోన్ యాడ్ ఫిల్మ్ కోసం హెబ్బా పటేల్‌ను డైరెక్ట్ చేస్తున్నా' అని రాసుకొచ్చాడు.

సొంత యాడ్ ఫిల్మ్ ఏజెన్సీ
కౌశల్.. తొలుత మోడలింగ్‌లో అవకాశాలు అందుకున్న ఆయన అనంతరం నటుడిగా మారాడు. మారుతి కార్గో, విజయ్ టెక్స్‌టైల్స్ వంటి సంస్థల వాణిజ్య ప్రకటనలకు మోడల్‌గా పని చేశాడు. 200కిపైగా వాణిజ్య ప్రకటనల్లో నటించిన కౌశల్ హైదరాబాద్‌లో సొంతంగా యాడ్ ఏజెన్సీ, ప్రొడక్షన్ హౌస్ నిర్వహిస్తున్నాడు. దీని ద్వారా ఎన్నో వ్యాపార ప్రకటనలు రూపొందించాడు.


Click it and Unblock the Notifications











