కన్నీరు తెప్పిస్తున్న కౌశల్ పోస్ట్.. ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ రిప్లై

Recommended Video

Kaushal Manda Made His Fans Emotional By His Post || Filmibeat Telugu

కౌశల్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. తెలుగు రియాలిటీ షో 'బిగ్‌బాస్' ద్వారా ఈయన ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన విషయం తెలిసిందే. గత సంవత్సరం 'స్టార్ మా' చానెల్‌లో ప్రసారమైన బిగ్‌బాస్ సీజన్-2 ద్వారా తెలుగు రాష్ట్రాల్లో కౌశల్ స్టార్ అయిపోయాడు. ఈ షోలో ఎన్నో కష్టాలను ఎదుర్కొనడంతో పాటు, హౌస్‌లోని అందరూ టార్గెట్ చేయడంతో చాలా మంది కౌశల్‌కు మద్దతుగా నిలిచారు. అతడు పడుతున్న కష్టాలు చూసి ప్రేక్షకులు భారీ స్థాయిలో ఓట్లు వేశారు. ఈ క్రమంలో కొందరు ఆర్మీలా తయారై అతడిని విన్నర్‌ను చేశారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా కౌశల్ పేరు మారుమ్రోగిపోయింది.

భార్య కష్టమే

భార్య కష్టమే

కౌశల్ హౌస్‌ లోపల ఉంటే బయటి వ్యవహారాలు మొత్తం ఆయన భార్య నీలిమనే చూసుకున్నారు. ఒకవైపు కంపెనీ వ్యవహారాలు.. మరోవైపు భర్తకు ఓట్లు వేయించే బాధ్యతను దగ్గరుండి చూసుకున్నారు. ఇదే విషయాన్ని కౌశల్ కూడా ఎన్నో సందర్భాల్లో వెల్లడించాడు.

క్యాన్సర్ అని చెప్పడంతో..

క్యాన్సర్ అని చెప్పడంతో..

గతంలో ఓ టీవీ డిబెట్‌లో కౌశల్ తన భార్య ఆరోగ్యం గురించి మాట్లాడాడు. ‘‘నేను బిగ్ బాస్ హౌస్‌లో ఉంటే నా భార్య నీలిమి నాకోసం ఎంతో కష్టపడింది. తన ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోలేదు. నా తల్లి కోరికను తీర్చిడం కోసం నేను హీరోగా సినిమా చేయాలని నా భార్య ఇప్పటికీ కష్టపడుతూనే ఉంది. నా తల్లిలా నా భార్యకు కూడా క్యాన్సర్ ఉంది. కడుపులో కంతి పెట్టుకుని నా కోసం కష్టపడుతుంది'' అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

సినిమాలు చేయడం లేదంటూ ట్రోల్స్

సినిమాలు చేయడం లేదంటూ ట్రోల్స్

కౌశల్.. ‘బిగ్ బాస్' విన్నర్ అయినప్పటికీ ఆయనతో సినిమాలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదంటూ కొందరు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్న విషయం తెలిసిందే. దీన్ని ప్రస్తావిస్తూ చాలా మంది అతడిపై విమర్శలు చేస్తున్నారు. దీంతో కౌశల్ ఫ్యాన్స్‌ కూడా.. సినిమా ఎందుకు తీయడం లేదంటూ అతడిని ప్రశ్నిస్తున్నారు.

కౌశల్ స్పందన

సినిమాలు తీయడం లేదంటూ వస్తున్న వార్తలపై కౌశల్ స్పందించాడు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ‘‘నా జీవితాన్ని చూసుకోవడం కంటే నా భార్యను కాపాడుకోవడమే ముఖ్యం. ఆమె ఆరోగ్యం నా కెరీర్ కంటే ఎక్కువ. నా సినిమాల కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ అందరికీ ఇదే నా ఆన్సర్. ఆమె ఆరోగ్యం మెరుగైన తర్వాతనే సినిమాలు చేస్తాను'' అంటూ తన భార్యతో ఉన్న ఫొటోను షేర్ చేశాడు.

ట్రోలర్స్‌ను సెంటిమెంట్‌తో కొట్టాడు

ట్రోలర్స్‌ను సెంటిమెంట్‌తో కొట్టాడు

తనపై వస్తున్న విమర్శలను కౌశల్ ఖండించాడు. అంతేకాదు, తనను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న వారిని సెంటిమెంట్‌తో కొట్టాడు. దీంతో కౌశల్ సినిమాలు చేయడం లేదని వస్తున్న వార్తలకు బ్రేక్ పడింది. అలాగే, కౌశల్ చేసిన పోస్టుకు మంచి స్పందన వస్తోంది. ఇది చూసి అంతా ఆవేదనకు గురవుతున్నారు. నీలిమ త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X