ఉదయ్ కిరణ్‌ని ఎప్పటికీ మరచిపోలేను.. ధృవ లాంటి సినిమాల్లో విలన్‌గా చేస్తా.. కౌశల్!

బిగ్ బాస్2 విజేత కౌశల్ ఇప్పడు క్రేజీ సెలెబ్రిటీ. బిగ్ బాస్ ద్వారా కౌశల్ కి వచ్చినంత క్రేజ్ మరే సెలెబ్రిటీకి రాలేందంటే అతిశయోక్తి కాదు. షో ఆరంభం నుంచి ఆధిపత్యం ప్రదర్శించిన కౌశల్ విజేతగా నిలిచాడు. ఇప్పుడు బిగ్ బాస్ ద్వారా వచ్చిన పాపులారిటీని అవకాశాలుగా మలచుకునే ప్రయత్నాలో ఉన్నాడు. తాజగా ఓ ఇంటర్వ్యూలో కౌశల్ పలు ఆసక్తికర విశేషాలు తెలియజేశాడు. దివంగత నటుడు, హీరో ఉదయ్ కిరణ్ తో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నాడు.

 ఎప్పటికీ మరచిపోలేను

ఎప్పటికీ మరచిపోలేను

కౌశల్ మాట్లాడుతూ.. ఉదయ్ కిరణ్ ని తాను ఎప్పటికి మరచిపోలేనని తెలిపాడు. ఉదయ్ ని తొలిసారి విశాఖ బుల్లయ్య కళాశాల వద్ద కలిశా. అప్పటి నుంచి మా స్నేహం ప్రారంభమైంది. మా ఇద్దరి మధ్య చాలా మరపురాని సంఘటనలు ఉన్నాయని కౌశల్ తెలిపాడు.

 మనసంతా నువ్వే చిత్రంలో

మనసంతా నువ్వే చిత్రంలో

ఉదయ్ కిరణ్ తో కలసి తొలిసారి మనసంతా నువ్వే చిత్రంలో నటించా అని కౌశల్ తెలిపాడు. ఆ తరువాత లవ్ టుడే, మరో 8 చిత్రాల్లో కలసి నటించాం అని కౌశల్ తెలిపాడు. విశాఖలో ప్రతి ప్రాంతం కలసి తిరిగాం. కలసి గోవాకు కూడా వెళ్ళాం అని కౌశల్ ఉదయ్ కిరణ్ తో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నాడు.

తొలిసారి ఫోన్ చేసింది వారే

తొలిసారి ఫోన్ చేసింది వారే

బిగ్ బాస్ విజేతగా తిరిగివచ్చిన తరువాత దర్శకులు మారుతి తొలిసారి ఫోన్ చేసి అభినందించారు. ఆ తరువాత సుకుమార్ కూడా ఫోన్ చేశారు. ఇలా ప్రముఖులంతా ఫోన్ చేసి అభినందించడం సంతోషంగా ఉంది. ఓ యూనివర్సిటీ వాళ్ళు ఫోన్ చేసి త్వరలో డాక్టరేట్ ప్రధానం చేస్తాం అని చెప్పారు.

విలన్ పాత్రలకు రెడీ

విలన్ పాత్రలకు రెడీ

హీరోగా అవకాశం వస్తే చేస్తా. అదే సమయంలో విలన్ పాత్రలకు కూడా నేను సిద్ధం. రాంచరణ్ ధృవ చిత్రంలో అరవింద స్వామి నటించిన తరహా పాత్రలకు నేను సరిపోతానని అనిపిస్తోంది. అలాంటి అవకాశం వస్తే వదులుకోను అని కౌశల్ తెలిపాడు. ప్రస్తుతం రెండు సినిమాలు సంబంధించి సంప్రదింపులు జరుగుతున్నట్లు కౌశల్ తెలిపాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X