డబ్బుతో గెలిచినట్లు ప్రూవ్ చేయ్, టైటిల్ మీకే ఇస్తా: గోగినేనికి కౌశల్ సవాల్!
Recommended Video

కౌశల్ బిగ్‌బాస్ టైటిల్ గెలవక ముందు నుండే.... కౌశల్ ఆర్మీ మీద రకరకాల ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. డబ్బులు ఖర్చు పెట్టి ఆర్మీ ఫాం చేశారని, బయట ఉండి ఎవరో దీన్ని ఆర్గనైజ్ చేస్తూ కౌశల్‌కు భారీగా ఓట్లు పడేలా చేస్తున్నారంటూ బాబు గోగినేని లాంటి వారు మీడియా డిబేట్లలో సైతం వ్యాఖ్యలు చేశారు. ఇపుడు కౌశల్ బిగ్‌బాస్ విన్నర్‌గా నిలిచి టైటిల్‌తో బయటకు వచ్చారు. బాబు గోగినేని అండ్ అతడి బ్యాచ్ చేస్తున్న ఆరోపణలపై కౌశల్ తీవ్రంగా స్పందించారు.

3500 డాలర్లకు లక్ష ఈమెయిల్స్ అమ్ముతున్నారు
3500 డాలర్లకు లక్ష ఈమెయిల్ అడ్రస్‌లు అమ్ముతున్నారు. వాటి ద్వారా చాలా చేస్తున్నారు, కౌశల్ ఆర్మీ కూడా అలాంటివి ఉపయోగించి కౌశల్‌కు ఓట్లు వేయింవచ్చేమో అని బాబు గోగినేని వ్యక్తి చేసిన అనుమానంపై కౌశల్ రియాక్ట్ అయ్యారు. ‘‘బాబు గోగినేనిగారు 3500 డాలర్లు అంటున్నారు. ఈ విషయం ఆయనకు ఎలా తెలిసింది? ఆయన ఆ డాలర్లు యూజ్ చేసుకుని బిగ్ బాస్ ఇంట్లో ఏడెనిమిది వారాలు ఉన్నారేమో?'' అంటూ మండి పడ్డారు.

బాబు గోగినేని అనుమానాలు
కౌశల్ బిగ్‌బాస్ ఇంట్లకి వెళ్లే ముందే ఆర్మీని ఎరేంజ్ చేసుకుని వెళ్లారు. అది వట్టిగా ఏర్పాటు చేసుకున్నరో? గట్టిగా ఏర్పాటు చేసుకున్నారో? నాకు అనవసరం. సోషల్ మీడియాను వాడుకుని మానిప్యులేట్ చేశారు. రూల్స్ బ్రేక్ చేసుకుంటూ ముందే ఎరేంజ్మెంట్స్ చేసుకున్నారు. లోపలి నుండి బయటకు సంకేతాలు పంపినట్లుగా నాకు అనుమానాలు ఉన్నాయి... అంటూ బాబు గోగినేని ఆరోపించారు.

కౌశల్ సవాల్
నాపై ఆరోపణలు చేస్తున్న బాబు గోగినేనికి నేను చెప్పేది ఒక్కటే.... కేవలం ఆరోపణలు చేయడం కాదు, ప్రూవ్ చేయమనండి. నేను డబ్బులిచ్చి గెలిచినట్లు రుజువు చేయండి. టైటిల్ అతడి చేతిలో పెట్టి వెళ్లిపోతాను... అంటూ కౌశల్ సవాల్ విసిరారు.

ఎంత మందిని ఫ్రాడ్ చేయగలం?
జనాలు ఇంత మాసివ్‌గా తామంతట తాము వచ్చే అవకాశం ఉండుదు. ఎవరో ఆర్గనైజ్ చేశారు అని బాబు గోగినేని బ్యాచ్ ఆరోపించడంపై కౌశల్ రియాక్ట్ అవుతూ.... అంత మందిని ఎవరు ఫ్రాడ్ చేయగలరు? ఒకరినో, వంద మందినో, వెయ్యి మందినో చేయొచ్చు. 40 కోట్ల మందిని ఎవరు ఫ్రాడ్ చేస్తారు? అడిగే వాళ్లకైనా ఇంగిత జ్ఞానం ఉండాలి... అంటూ కౌశల్ మండి పడ్డారు.

నా ఆర్మీ అంటే ఎంతవరకైనా వెళతాను
కౌశల్ ఆర్మీని ఫ్రాడ్ ఆర్మీ అంటే ఊరుకునే ప్రసక్తే లేదు. అది బిగ్‌బాస్ హౌస్‌లో కానీ, బిగ్‌బాస్ బయట కానీ ఊరుకునే సమస్యే లేదు. ఈ విషయంలో నేను చాలా సీరియస్. కౌశల్ ఆర్మీని ఎవకడతా ఏమైనా అంటే నేను ఎంత వరకైనా వెళ్లడానికి సిద్ధం అంటూ కౌశల్ హెచ్చరించారు.


Click it and Unblock the Notifications











