Son Of india డైరెక్టర్.. బిగ్ బాస్ విన్నర్ తో మల్టీస్టారర్ మూవీ.. బడ్జెట్ ఎంతంటే?
బిగ్ బాస్ ద్వారా మంచి క్రేజ్ అందుకున్న వారిలో కొందరు ఇండస్ట్రీలో ఎదో ఒక రకంగా బిజీ అయితే అవుతున్నారు. అయితే అందులో టైటిల్ విన్నర్స్ కంటే మిగతా కంటెస్టెంట్స్ సినిమాలతో టెలివిజన్ షోలతో బిజీ అవుతున్నారు. బిగ్ బాస్ తెలుగు సీజన్స్ లో ఇప్పటివరకు టైటిల్ విన్నర్ అయిన వారిలో ఎవరు కూడా కెరీర్ మరో రేంజ్ కు వెళ్లే విధంగా క్లిక్కవ్వలేదు. ఇక ఇటీవల ఒక బిగ్ బాస్ విన్నర్ సన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ తో మల్టీస్టారర్ మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ వివరాల్లోకి వెళితే..

విన్నర్స్ కు కలిసి రాలేదు
బిగ్ బాస్ తెలుగు మొదటి సీజన్ నుంచి చూసుకుంటే టైటిల్ విన్నర్స్ కు అంతగా కలిసి రాలేదు. కేవలం ఆ షో ద్వారా వచ్చిన రెమ్యునరేషన్ తప్ప సినిమా ఇండస్ట్రీలో ఆఫర్స్ ఏమి రాలేదు. శివబాలాజీ, కౌశల్ మండా ను ఎక్కువ రోజులో ఎవరు గుర్తు పెట్టుకోలేదు. ఇక రాహుల్ సిప్లిగంజ్ తన సింగింగ్ టాలెంట్ తోనే నిలదొక్కుంటున్నాడు.

హీరోయిన్ కూడా క్లిక్కవ్వలే..
ఇక 4వ సీజన్ లో గెలిచిన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ హీరో అభిజిత్ ఒక్క మంచి సినిమా ఆఫర్ కూడా అందుకోలేదు. ఇక 5వ సీజన్ లో గెలిచిన సన్నీ పరిస్థితి కూడా అంతే. ఇక మొదటిసారి బిగ్ బాస్ నాన్ స్టాప్ ద్వారా గెలిచిన హీరోయిన్ బిందుమాధవి ఇప్పటివరకు కూడా పెద్దగా అవకాశాలు ఏమి అందుకుంది లేదు.

ఆ విన్నర్ కు ఒక ఛాన్స్
ఇక బిగ్ బాస్ క్రేజ్ తో సంబంధం లేకుండా ఎవరి ప్రయత్నంలో వారు ముందుకు సాగుతున్న క్రమంలో VJ సన్నీకి మాత్రం ఒక ఆఫర్ వచ్చింది. అతను మొదట ఒక రిపోర్టర్ స్థాయి నుంచి ఆ తరువాత ఒక నటుడిగా కూడా తన కెరీర్ ను కొనసాగించాడు. ఇక బిగ్ బాద్ 5వ సీజన్ లో విన్నర్ గా నిలిచిన సన్నికి ఆ తరువాత చాలా ఆఫర్స్ వచ్చాయి కానీ నచ్చని వాటిని ఒప్పుకోలేదు.

అన్ స్థాపబుల్
ఇక ఫైనల్ గా అతను డైమండ్ రత్నబాబు చెప్పిన కంటెంట్ కు కనెక్ట్ అయ్యాడట. అతను చెప్పిన ఒక మినీ మల్టీస్టారర్ కథ నచ్చడంతో వెంటనే ఒప్పేసుకున్నాడట. అన్ స్థాపబుల్ అనే టైటిల్ తో రానున్న ఆ సినిమాకు నో డౌట్ 100% ఎంటర్టైన్మెంట్ అనే ట్యాగ్ లైన్ ఇచ్చారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను రీసెంట్ గా విడుదల చేశారు.

మల్టీస్టారర్
ఇక ఈ సినిమాలో మరొక హీరోగా కమెడియన్ సప్తగిరి నటిస్తున్నాడు. సన్ ఆఫ్ ఇండియా తరువాత రచయిత డైమండ్ రత్నబాబు చేస్తున్న సినిమా కావడంతో సోషల్ మీడియాలో సినిమాకు సంబంధించిన పోస్టర్ కొంత వైరల్ అయ్యింది. ఆ సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఇప్పుడు బాలయ్య టాక్ షో అన్ స్థాపబుల్ టైటిల్ తో వస్తున్నాడు.

మినీ బడ్జెట్ లో..
అన్ స్టాపబుల్ సినిమాను డిఫరెంట్ కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఇక ఈ సినిమాను AB ప్రొడక్షన్ పై అజిత్ రావ్ నిర్మిస్తున్నారు. దాదాపు 3.50 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించినున్నట్లు సమాచారం. ఇక VJ సన్నీ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఎలాగైనా మంచి క్రేజ్ అందుకొని ఇండస్ట్రీలో బిజీ అవ్వాలని అనుకున్నాడు. మరి సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











