For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నా అసలు ‘రంగు’ అదే.. నాలుగు రకాలుగా.. బిగ్‌బాస్‌లో ఉండగా.. తనీష్

  |
  Thanish Speech @Rangu Movie Press Meet | Priya Singh |Kartikeya | Filmibeat Telugu

  ప్రేక్ష‌కులు ఆలోచించే సోష‌ల్ మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రం రంగు కోసం ఎగ్జ‌యిట్‌మెంట్‌తో వెయిట్ చేస్తున్నాను - హీరో త‌నీష్న‌ల్ల‌స్వామి స‌మ‌ర్ప‌ణ‌లో యు అండ్ ఐ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ప‌తాకంపై త‌నీశ్‌, ప‌రుచూరి ర‌వి, ప్రియా సింగ్‌, ప‌రుచూరి వెంకటేశ్వ‌ర‌రావు, ష‌ఫీ, పోసాని కృష్ణ‌ముర‌ళి ప్ర‌ధాన తారాగ‌ణంగా రూపొందుతోన్న చిత్రం రంగు. కార్తికేయ‌.వి ద‌ర్శ‌క‌త్వంలో ఎ.ప‌ద్మ‌నాభ‌రెడ్డి, న‌ల్ల అయ్య‌న్న నాయుడు నిర్మాత‌లు. శ‌నివారం హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో ఈ సినిమా ట్రైల‌ర్‌ను ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు విడుద‌ల చేశారు.

  బిగ్‌బాస్‌లో నేను ఉండగా

  బిగ్‌బాస్‌లో నేను ఉండగా

  నేను బిగ్‌బాస్ హౌస్‌లో ఉండ‌గా మా రంగు సినిమాకు సంబంధించిన ట్రైల‌ర్‌, మూడు సాంగ్స్‌ను విడుద‌ల చేశారు. ట్రైల‌ర్‌కు 1 మిలియ‌న్ వ్యూస్ వ‌స్తే.. సాంగ్స్‌కు ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింద‌ని త‌ర్వాత నాకు తెలిసింది. ఇక సినిమా విష‌యానికి వ‌స్తే.. విజ‌య‌వాడ‌లో ఉన్న లారా అనే వ్య‌క్తి పాత్ర‌లో నేను క‌న‌ప‌డ‌తాను. ప‌దిహేడేళ్ల నుంచి ఇర‌వై ఎనిమిదేళ్ల వ్య‌క్తిగా క‌న‌ప‌డే పాత్ర నాది. నాలుగు వేరియేష‌న్స్‌తో సాగుతుంది. సోషల్ మెసేజ్ ఉన్న సినిమా. ప్రేక్ష‌కుల‌ను త‌ప్ప‌కుండా ఆలోచింప‌చేస్తుంది. కార్తికేయ ఈ మూడు నాలుగేళ్లుగా ఈ సినిమాతో ట్రావెల్ అవుతున్నారు. నాతో పాటు యూనిట్ అంతా ట్రావెల్ అవుతూ చేసిన మంచి ప్ర‌య‌త్న‌మిది అని తనీష్ అన్నారు.

  న్యూస్ పేప‌ర్‌లో ఓ విష‌యాన్ని

  న్యూస్ పేప‌ర్‌లో ఓ విష‌యాన్ని

  న్యూస్ పేప‌ర్‌లో ఓ విష‌యాన్ని చ‌దివి ఆ ఆలోచ‌న‌తో విజ‌య‌వాడ వెళ్లాను. అక్క‌డ లారా అనే వ్య‌క్తి గురించి విష‌యాల‌ను సేక‌రించి దాన్నుండి త‌యారుచేసుకున్న క‌థ. ఇలాంటి ఓ క‌థ‌ను రియలిస్టిక్‌గా క‌న‌ప‌డుతూనే క‌మ‌ర్షియ‌ల్ పంథాలో ఉండేలా ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్‌గారు నాకు స‌హాయం చేశారు. అంత పెద్ద ర‌చ‌యిత‌ల‌తో కల‌సి ఈ సినిమాకు ప‌నిచేయ‌డం ఆనందంగా ఉంది అని చిత్ర ద‌ర్శ‌కుడు కార్తికేయ.వి తెలిపారు.

  సిరివెన్నెల కొడుకు అని తెలియదు

  సిరివెన్నెల కొడుకు అని తెలియదు

  యోగేశ్వ‌ర శ‌ర్మ‌గారు సీతారామ‌శాస్త్రిగారి అబ్బాయి అని నాకు ముందు తెలియ‌దు. ఆయ‌న కంపోజ్ చేసిన శ్రీకారం చుడుతున్న‌ట్లు... అనే పాట మాత్ర‌మే విన్నాను. అది నాకు ఎంతో ఇష్ట‌మైన పాట‌. దాని సంగీత ద‌ర్శ‌కుడెవ‌రా? అని ఆరా తీసే స‌మ‌యంలో యోగేశ్వ‌ర శ‌ర్మ‌గారి గురించి.. ఆయ‌న సీతారామ‌శాస్త్రిగారి అబ్బాయి అనే విష‌యం కూడా అప్పుడే తెలిసింది. మా సినిమాకు యోగేశ్వ‌ర శ‌ర్మ‌గారు అద్భుత‌మైన సంగీతాన్ని అందించారు అని కార్తీకేయ చెప్పారు.

  ఆక‌లిని మ‌ర‌చిపోయి ఆశ‌యం

  ఆక‌లిని మ‌ర‌చిపోయి ఆశ‌యం

  యు అండ్ మీ ఎంట‌ర్‌టైన్మెంట్స్ సంస్థ‌ను స్థాపించ‌డం వెనుక ప్ర‌ధాన కార‌ణం. ఆశ‌యాన్ని బ్ర‌తికించ‌డం. కృష్ణాన‌గ‌ర్‌లో ఆక‌లిని మ‌ర‌చిపోయి ఆశ‌యం కోసం తిరిగే ఎంతో మంది ద‌ర్శ‌కులున్నారు. అటువంటి వారి ఆశ‌యాన్ని బ్ర‌తికించ‌డానికి ఈ సంస్థ‌ను స్థాపించాం. మా బ్యాన‌ర్‌లో 7 సినిమాలు అండ‌ర్ ప్రొడ‌క్ష‌న్‌లో ఉండ‌గా.. 30-40 ద‌ర్శ‌కుల‌తో మంచి అనుబంధం ఏర్ప‌డింది అని నిర్మాత ఎ.ప‌ద్మ‌నాభ రెడ్డి అన్నారు.

  రంగు సినిమా కోసం

  రంగు సినిమా కోసం

  రంగు సినిమా కోసం రంగు సినిమా కోసం సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి, ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ లాంటి వారితో ప‌నిచేయ‌డం ఆనందంగా ఉంది. సినిమాటోగ్రాఫ‌ర్ సురేంద‌ర్ రెడ్డిగారు కూడా ఎంత‌గానో స‌పోర్ట్ చేశారు. యూత్ ఎలాంటి దారిలో న‌డ‌వాలి అనే విష‌యంతో పాటు పోలీస్ డిపార్ట్‌మెంట్ ఎలా ఉండాల‌నే విష‌యాన్ని కూడా మా `రంగు` సినిమాలో చూపిస్తున్నాం అని నిర్మాత న‌ల్ల అయ్య‌న్న నాయుడు అన్నారు.

   వాస్తవ సంఘ‌ట‌న‌ల‌ ఆధారంగా

  వాస్తవ సంఘ‌ట‌న‌ల‌ ఆధారంగా

  మ్యూజిక్ డైరెక్ట‌ర్ యోగేశ్వ‌ర శ‌ర్మ మాట్లాడుతూ ద‌ర్శ‌కుడు కార్తికేయ‌ల వాస్తవ సంఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని రాసుకున్న క‌థే `రంగు`. చాలా నేచుర‌ల్‌గా ఉంటుంది. ప‌రుచూరిగారి మాట‌లు, నాన్నగారి పాట‌ల‌తో పాటు. సాయికిర‌ణ్ పాటలు మంచి రీరికార్డింగ్ కుదిరింది. ప‌రుచూరి ర‌విగారు పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టించారు. ఓ పోలీస్ ఆఫీస‌ర్ స‌మాజంలో మార్పు కోసం చేసే ప్ర‌య‌త్న‌మే ఈ సినిమా`` అన్నారు.
  ఈ కార్యక్ర‌మంలో సినిమాటోగ్రాఫ‌ర్ సురేంద‌ర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ ఎస్‌.ఎస్‌.చ‌క్ర‌వ‌ర్తి, కో ప్రొడ్యూస‌ర్ క‌ట‌కం వాసు త‌దిత‌రులు పాల్గొన్నారు.

   నటీనటులు, సాంకేతిక వర్గం

  నటీనటులు, సాంకేతిక వర్గం

  తనీశ్‌, ప‌రుచూరి ర‌వి, ప్రియా సింగ్‌, ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు, పోసాని కృష్ణ‌ముర‌ళి, ష‌ఫీ, టార్జాన్‌, ర‌ఘు కారుమంచి, హ‌రిబాబు, త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్: శ‌్రీనివాస్ నాయుడు గ‌ల‌భా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: ఎస్‌.ఎస్‌.చ‌క్ర‌వ‌ర్తి, కో ప్రొడ్యూస‌ర్‌: క‌ట‌కం వాసు, సాహిత్యం: సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి, సాయికిర‌ణ్‌, సంగీతం: యోగీశ్వ‌ర శ‌ర్మ‌, ఎడిట‌ర్‌: పైడి బ‌స్వ రెడ్డి, సినిమాటోగ్రాఫ‌ర్‌: టి.సురేంద‌ర్ రెడ్డి, డైలాగ్స్‌: ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ నిర్మాత‌లు: ఎ.ప‌ద్మ‌నాభ రెడ్డి, న‌ల్ల అయ‌న్న నాయుడు, క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: కార్తికేయ‌.

  English summary
  Bigg Boss2 contestatn Tanish's latest movie Rangu. He is doing a different movie. He revealed his character in the Rangu movie. He is happy with the way getting response to the movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X