దారుణంగా చంపారు.. భావోద్వేగం.. అసహాయత పరిస్థితుల్లో.. తనీష్

హీరో, బిగ్‌బాస్ ఫేం తనీష్ అల్లాడి నటించిన రంగు చిత్రం నవంబర్ 23న రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. న‌ల్ల‌స్వామి స‌మ‌ర్ప‌ణ‌లో యు అండ్ ఐ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ప‌తాకంపై త‌నీశ్‌, ప‌రుచూరి ర‌వి, ప్రియా సింగ్‌, ప‌రుచూరి వెంకటేశ్వ‌ర‌రావు, ష‌ఫీ, పోసాని కృష్ణ‌ముర‌ళి ప్ర‌ధాన తారాగ‌ణంగా రూపొందుతోన్న చిత్రం రంగు. కార్తికేయ‌ వి ద‌ర్శ‌క‌త్వంలో ఏ ప‌ద్మ‌నాభ‌రెడ్డి, న‌ల్ల అయ్య‌న్న నాయుడు నిర్మాత‌లు. విజయవాడలో సంచలనం రేపిన లారా అనే ఓ రౌడీ షీటర్ జీవిత కథగా రంగు చిత్రాన్ని మలిచారు. విడుదలకు ముందు లారా కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు అభ్యంతరం తెలుపడంతో వివాదంగా మారింది. రంగు సినిమా సందర్భంగా తనీష్ మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..

ప్రతి మనిషిలో రంగులు

ప్రతి మనిషిలో రంగులు

రంగు టైటిల్ ఎందుకు అంటే ప్రతి మనిషిలో చాలా రంగులుంటాయి, డిఫరెంట్ ఎమోషన్స్ ఉంటాయి, అవి బయటకు వచ్చే సందర్భాలుంటాయి. రంగు చిత్రంలో నేను నటించిన ‘లారా' పాత్రను 19 ఏళ్ల వయస్సు నుంచి 27 ఏళ్ల వరకు మధ్య ఓ రౌడీషీటర్ జీవితంలో జరిగిన సంఘటనలను చూపించడం జరుగుతుంది అని తనీష్ అన్నారు.

అతి దారుణంగా చంపబడ్డాడు.

అతి దారుణంగా చంపబడ్డాడు.

లారా తన కాలేజ్ డేస్‌లో స్టేట్ రాంకర్ అలాంటి వ్యక్తి తన 27 ఏళ్ల వయసులో అతి దారుణంగా చంపబడ్డాడు. లారా జీవితంలో సంఘటనలు అనూహ్యంగా ఉంటాయి. ఈ చిత్రంలో నటించడానికి ఆ సంఘటనలే నన్ను ఎగ్జైట్ చేశాయి. ప్రతి ఎమోషన్‌ని ఓ కలర్‌తో సింబలైజ్ చేస్తాం, అతని ట్రావెల్ ఎమోషన్స్ సినిమాలో పీక్స్‌లో ఉంటాయి.

ఎదురు తిరిగిన వ్యక్తిగా..

ఎదురు తిరిగిన వ్యక్తిగా..

నాలుగు హోళీ పండగలు లారా జీవితాన్ని ఎలా మలుపుతిప్పాయో అనే అంశాలతో తెరకెక్కించాం. ఈ కథలో నాలుగు వేరియేషన్స్ ఉంటాయి. అమాయకంగా కనిపించే పాత్ర నుంచి ఆవేశపడే యువకుడిగా వరకు, అక్కడి నుంచి అతను వ్యవస్థకు ఎదురు తిరిగిన వ్యక్తిగా, ఆ తర్వాత తాను చిక్కుకున్న వలయం నుంచి బయటపడలేని ఒక అసహాయత పరిస్థితులు ‘లారా' పాత్రలో కనిపిస్తాయి.

సహజత్వమైన భావోద్వేగాలతో

సహజత్వమైన భావోద్వేగాలతో

లారా పాత్రలో సహజత్వమైన భావోద్వేగాలు కనిపిస్తాయి. ఈ సినిమాని ఒక జోనర్‌కి పరిమితం చేయలేం. అలాంటి కథ, ఇందులో డ్రామా, ముఖ్యంగా ఆ పాత్ర చేసే ట్రావెల్ ఎదురయ్యే సమస్యలు అతన్ని ఎలా మార్చాయి అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నటుడిగా నా 20 ఏళ్ల ప్రయాణంలో నేను ఏ పాత్ర చేసినా, నా క్యారెక్టర్‌కి హాండ్రడ్ పర్సెంట్ జస్టిఫై చేసానా లేదా అని చూసుకుంటాను.

హీరోగా ఇండస్ట్రీకి రాలేదు

హీరోగా ఇండస్ట్రీకి రాలేదు

సక్సెస్ ఎప్పూడూ అవసరమే, సక్సెస్ అవసరం లేని సందర్భం ఉండదని నమ్ముతాను. నేను హీరోగా ఇండస్ట్రీకి రాలేదు.. ఒక నటుడిగా వచ్చాను. నాకు రంగుతో సక్సెస్ వచ్చినా, నన్ను ఎగ్జైట్ చేసే పాత్రలు వస్తే తప్పకుండా చేస్తాను.

నటీనటులు, సాంకేతిక వర్గం

నటీనటులు, సాంకేతిక వర్గం

నటీనటులు: తనీశ్‌, ప‌రుచూరి ర‌వి, ప్రియా సింగ్‌, ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు, పోసాని కృష్ణ‌ముర‌ళి, ష‌ఫీ, టార్జాన్‌, ర‌ఘు కారుమంచి, హ‌రిబాబు తదితరులు
క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: కార్తికేయ‌
నిర్మాత‌లు: ఎ.ప‌ద్మ‌నాభ రెడ్డి, న‌ల్ల అయ‌న్న నాయుడు
లిరిక్స్: సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి, సాయికిర‌ణ్‌
సంగీతం: యోగీశ్వ‌ర శ‌ర్మ‌
ఎడిట‌ర్‌: పైడి బ‌స్వ రెడ్డి
సినిమాటోగ్రాఫ‌ర్‌: టి.సురేంద‌ర్ రెడ్డి
డైలాగ్స్‌: ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X