తనీష్‌కు ఝలక్.. రంగు మూవీని ఆపేస్తాం.. రౌడీ షీటర్లే గుర్తొకొస్తారా? కుటుంబ సభ్యుల ఫైర్

విజయవాడ రౌడీ షీటర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన లారా చిత్రం వివాదంలో చిక్కకున్నది. లారా వ్యక్తిగత జీవితం ఆధారంగా నిర్మించిన 'రంగు' సినిమాపై అభ్యతరాలు ఉన్నాయని 'లారా' కుటుంబ సభ్యులు ఫిల్మ్ ఛాంబర్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రంగు చిత్రంలో బిగ్‌బాస్ ఫేం తనీష్ హీరోగా ప‌రుచూరి ర‌వి, ప్రియా సింగ్‌, ప‌రుచూరి వెంకటేశ్వ‌ర‌రావు, ష‌ఫీ, పోసాని కృష్ణ‌ముర‌ళి ఇతర పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే.

మమ్మల్ని సంప్రదించలేదని

మమ్మల్ని సంప్రదించలేదని

మీడియా సమావేశంలో మాట్లాడుతూ..దిలీప్ (లారా బావ మరిది) :
ఏడాది క్రితం లారా (పవన్ కుమార్) గురించి విజయవాడలో సమాచారం సేకరించడానికి చిత్ర దర్శకుడు కార్తికేయ వచ్చాడు. అప్పుడు మమ్మల్ని సంప్రదించలేదు. పది రోజుల క్రితం సినిమా ట్రైలర్, ప్రెస్ మీట్ చూశాం.
లారా అనే రౌడీ షీటర్ అనే వాయిస్‌తో ట్రైలర్ మొదలు అయ్యింది. లారా మీద రౌడీ షీట్ అన్యాయం గా తెరిచారు. ఇప్పుడు ఆయన పిల్లలు చదుకుకుంటున్నారు. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయితే వాళ్ళ మీద ఎంత ఎఫెక్ట్ పడుతుందో ఆలోచించండి అని ఆవేదన వ్యక్తం చేశారు.

లారా రౌడీ షీటర్ కావొచ్చు

లారా రౌడీ షీటర్ కావొచ్చు

లారా కొంతమంది దృష్టిలో రౌడీ కావొచ్చు, కానీ లారా ఎంత మంచి వాడో విజయ వాడ లో చాలామంది కి తెలుసు. సినిమా ట్రైలర్ చూసిన దగ్గర నుండి దర్శక నిర్మాతల ను కలవాలని ప్రయత్నించాను, కానీ కుదరలేదు. ఇప్పుడు ఆ సినిమా ముందు మాకు చూపించాలని డిమాండ్ చేస్తున్నాం. మా అంగీకారం తోనే సినిమా రిలీజ్ చేయాలి. లేదంటే సినిమా రిలీజ్ ని లీగల్ గా అడ్డుకుంటాం. విజయవాడలో పోస్టర్ కూడా పడనీయం.
లారా గురించి వీరికి అసలు ఏం తెలుసు అని ప్రశ్నిస్తున్నాం అని ఆయన అన్నాడు.

దర్శకులకు రౌడీ షీటర్స్ మాత్రమే

దర్శకులకు రౌడీ షీటర్స్ మాత్రమే

సందీప్ (లారా స్నేహితుడు) మాట్లాడుతూ "విజయవాడ అంటే సినిమా దర్శకులకు రౌడీ షీటర్స్ మాత్రమే గుర్తుకు వస్తారా?
లారా మీద సినిమా వస్తుంది అనగానే దర్శకుడి నంబర్ తీసుకొని మాట్లాడాము. ఆయన చూద్దాం అని తర్వాత మా కాల్‌కి రెస్పాన్స్ ఇవ్వడం లేదు. వ్యక్తుల జీవితాలపై సినిమా చేసే తప్పుడు వారి కుటుంబం నుండి అనుమతి తీసుకోవాలి. నిర్మాత గాని దర్శకుడు కానీ ఆ పని చేయలేదు. లారాని చంపేయాలి అనే డైలాగ్‌తో ట్రైలర్ కట్ చేశారు. ఆ మాట వారిపై ఎంత ప్రభావం చూపుతుందో ఆలోచించారా...?

Recommended Video

Rangu Movie Controversial Press Meet | Tanish | Vijayawada Lara | Priya Singh | Filmibeat Telugu
రంగు సినిమాను ఆపేస్తాం..

రంగు సినిమాను ఆపేస్తాం..

మేము ముందుగా సినిమా చూడాలి...మాకు అభ్యతరాలు ఉంటే సినిమాను ఆపేస్తాము.. మాకు సినిమా చూపించకుండా రిలీజ్ చేస్తే లీగల్ గా కోర్టుకు వెళతాం. ఇంకా ఎంత దూరం అయినా వెళతాం. " అన్నారు.ధనుంజయ్ (లారా స్నేహితుడు )మాట్లాడుతూ :" గతం మరిచి పోయి బతుకు తున్న లారా ఫ్యామిలీ ఈ సినిమా తో మళ్ళి భయం, భయం గా బతుకు తుంది.

లారా కథపై హక్కులేదు

లారా కథపై హక్కులేదు

లారా కథ ను తెలుసుకోకుండా సినిమా తీశారు. వారికి ఆ కథపై ఎలాంటి హక్కు లేదు. సినిమా దర్శకుడు ఈ విషయం పై మాట్లాడితే రెస్పాన్డ్ కాలేదు. మేము రెండు రోజులు గడువు ఇస్తున్నాం. మాకు సినిమా చూపించి , మాకు అభ్యంతరం అనిపించే సన్నివేశాలను తొలిగించాలి. లేదంటే సినిమా ను ఆపేందుకు ఎంత దూరం అయినా వెళతాం" అన్నారు.రంగు సినిమా ఈ నెల 23 న విడుదలకు సిద్ధం అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X