బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీతోనే అదరగొట్టిన తేజస్వి
నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 ఆదివారం రాత్రి 9 గంటలకు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా మొదటి సీజన్ సూపర్ హిట్ కావడం, మంచి ఎంటర్టెన్ అందించడం, సెకండ్ సీజన్ పై అంచనాలు పెరిగాయి. ఎన్టీఆర్ స్థానంలో నాని ఎంట్రీ ఇవ్వడం ఈ సారి షో ఎలా ఉండబోతోంది అనే ఆసక్తి అందరిలోనూ నెలకొని ఉంది. 16 మంది కంటెస్టెంట్లతో 106 రోజుల పాటు ఈ షో సాగబోతోంది. గత సీజన్ కంటే మరింత మసాలా దట్టించి తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను ఎంటర్టెన్ చేసేందుకు రంగం సిద్ధమైంది.

బిగ్ బాస్2 సీజన్లోకి సినీ నటి తేజస్వి మదివాడ సెలబ్రిటీగా ప్రవేశించారు. ఐస్ క్రీమ్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, హార్ట్ ఎటాక్, అనుక్షణం, మనం, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు చిత్రాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకొన్నారు. ఓ హిందీ పాటపై బ్రహ్మండమైన పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టారు.
bigg boss 2 bigg boss 2 telugu nani geetha madhuri tejaswi madivada బిగ్ బాస్ 2 బిగ్ బాస్ 2 తెలుగు నాని గీతా మాధురి తేజస్వి మదివాడ


Click it and Unblock the Notifications