స్టార్స్ హాట్ లుక్ హలో! హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డ్స్
హైదరాబాద్: ‘హలో! హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డ్స్' కార్యక్రమం ఆదివారం ముంబై తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ లోని క్రిస్టల్ రూంలో గ్రాండ్‌గా జరిగింది. ఈ అవార్డుల కార్యక్రమానికి బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు స్టార్స్, ప్రముఖులు హాజరయ్యారు.
సినిమా రంగంతో పాటు బిజినెస్, స్పోర్ట్స్, ఆర్ట్స్ ఇలా వివిధ రంగాల్లో అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. హలో! మేగజైన్ వారు ఈ అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. బాలీవుడ్ నుండి కరీనా కపూర్, సోనాక్షి సిన్హా, అర్జున్ కపూర్‌తో ఇతర ప్రముఖులు హాజరయ్యారు.
ఈ సంవత్సరం అవార్డులు అందుకున్న వారి వివారల్లోకి వెళితే....గ్లోబల్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్(ఏఆర్ రెహహాన్), స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్(సానియా మీర్జా), లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు(సతీష్ గుజ్రాల్), బిజినెస్ ఆఫ్ ది ఇయర్ (కుమార మంగళం బిర్లా) అందుకున్నారు. కరీనా కపూర్ కూడా ఓ అవార్డు అందుకుంది.
పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు తమ వస్త్రధారణతో ఆకట్టుకున్నారు.
అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో...

సోనాక్షి సిన్హా
బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ఇలా ప్రత్యేక వస్త్రధారణతో ఆకట్టుకుంది.

కరీనా కపూర్
తను అందుకున్న అవార్డుతో కరీనా కపూర్ ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

సానియా మీర్జా
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కూడా అవార్డుల కార్యక్రమానికి హాజరయ్యారు.

అర్జున్ కపూర్
త్వరలో తేవర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అర్జున్ కపూర్ ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

అభిషేక్ బచ్చన్
వైట్ కలర్ బ్లేజర్ ధరించిన అభిషేక్ బచ్చన్ ఇలా రాయల్ లుక్‌తో దర్శనమిచ్చారు.

సోనమ్ కపూర్
బాలీవుడ్ యువ నటి సోనమ్ కపూర్ ఇలా క్లాసీ లుక్ లో సరికొత్తగా కనిపించింది.

సోనమ్, ఫావద్
ఖూబ్ సూరత్ సినిమా జంట ఇలా హలో హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డుల కార్యక్రమంలో ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

నందనా సేన్
రంగ్ రసియా చిత్ర నటి నందనా సేన్ సంప్రదాయ చీరకట్టులో ఆకట్టుకున్నారు.

నవాజుద్దీన్ సిద్ధిఖీస
ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ అవార్డుల కార్యక్రమంలో ఇలా...

సోఫీ చౌదరి, మనీష్ మల్హోత్రా
సోఫీ చౌదరి, మనీష్ మల్హోత్రా ఇలా ఇద్దరూ కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.


Click it and Unblock the Notifications











