హన్సిక పెద్ద ముదురే
తాజా చిత్రం మస్కాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన బొద్దుగుమ్మ హన్సిక తన పారితోషికాన్ని అస్సలు పెంచలేదని చెబుతోంది. తెలుగులో తాను నటించిన దేశముదురు, కంత్రి, మస్కా చిత్రాలు హిట్ అయ్యేసరికి ఏ భాషలో ఎన్ని సినిమాలు చేసినా, 'దేశముదురు"లోని తన పాత్ర తీరుతెన్నులు ఇప్పటికీ తనను వెంటాడుతుంటాయని చెప్పుకొచ్చింది హన్సిక మొన్నీమధ్యనే అన్నది. 'దేశముదురు" పాపగా తనకు ఇప్పటికీ తొలి చిత్రం ఇమేజ్ కంటిన్యూ అవుతోందని అంటోంది హన్నిక ఓ ఇంటర్వ్యూలో ఇటీవల మురిసిపోయింది.
ఐటమ్ గర్ల్ గా కన్నించడమనేది అనుకోకుండా జరిగే విషయమనీ, నటిగా గుర్తింపు కోసమే ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాను తప్ప డబ్బు లొస్తున్నాయి కదా అని ఐటమ్ సాంగ్స్ వైపుకు మొగ్గ చూపనని తెగేసి చెబుతోంది హన్సిక.దేశముదురు సినిమాలో శరీరం మట్టిలో కలిసిపోవాల్సిందే...." అంటూ తాను ఆ చిత్రంలో చెప్పిన డైలాగ్ ఇప్పటికీ గుర్తుందనీ, ఇంకో ఐదేళ్ళ తర్వాత అడిగినా ఆ డైలాగ్ చెప్పేస్తానని చెబుతోన్న హన్సిక, టాలీవుడ్లో తనను చాలామంది 'మట్టి మట్టి" అని సంబోధిస్తుండడం చాలా ఆనందాన్నిస్తోందని అంటోంది.
అయితే హన్సిక మాత్రం కొంతమంది నిర్మాతలను వదిలించుకోవడానికే ఇలా చేస్తుందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. నిర్మాతలందరూ హన్సిక వెంటబడితే పాపం, ఆమె మాత్రం ఏం చేస్తుందని వారు ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ ఆర్ట్స్‌లో నందమూరి కళ్యాణ్ రామ్ సరసన హన్సిక నటిస్తోంది. గ్లామర్ ప్రపంచంలో ఎక్స్ పోజింగ్ తప్పు కాదనీ, శృతిమించిన వల్గారిటీకి మాత్రం తానెప్పుడూ దూరంగా వుంటానని రొటీన్ డైలాగులు వల్లించేస్తోంది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్రాల్లో వరుస ఆఫర్లతో బిజీగా వున్నానని చెబుతోన్న హన్సిక తెలుగులో సక్సెస్ ఇచ్చిన కిక్ డిఫరెంట్ గా వుంటుందనీ, అది మిగతా లాంగ్వేజెస్లో కాస్త తక్కువేనని ఆ క్రెడిట్ని టాలీవుడ్ జనానికి ఇచ్చేస్తోంది.


Click it and Unblock the Notifications











