బికినీ పాపలతో అల్లరి నరేష్ ‘యాక్షన్ ’(ఫోటో ఫీచర్)
హైదరాబాద్: అల్లరి నరేష్ కథానాయకుడుగా ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్న 'యాక్షన్ డి'. ఈ చిత్రం తాజాగా గోవా, బ్యాంకాక్‌ల్లో షెడ్యూల్ పూర్తిచేసుకుంది. ఇక్కడ అల్లరి నరేష్, రాజు సుందరం, వైభవ్ తదితరులపై హాట్ హాట్ విదేశీ బికీనీ భామలతో కలిసి సాంగ్ చిత్రీకరించడంతో పాటు, పలు సన్నివేశాలు షూట్ చేసారు.

దర్శకుడు అనిల్ సుంకర దర్శకత్వంలో ఈ చిత్రం గూర్చి మాట్లాడుతూ, నవంబర్ 10 నుండి నెలాఖరు వరకు హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతుందని తెలిపారు.

దసరా నుండి డబ్బింగ్ జరుపుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోను ఈనెలాఖరులోపు విడుదల చేస్తామని తెలిపారు.

డిసెంబర్ చివరి వారంలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.

తెలుగులో తొలిసారిగా పూర్తి హాస్యరస చిత్రం త్రీడిలో చేయడం విభిన్నంగా ఉంటుందని, యాక్షన్‌కు తగ్గట్టుగానే ఎంటర్‌టైన్‌మెంట్ పాళ్లు ఉంటాయి.

తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులకు 100 శాతం హాస్యం అందిస్తుందని కథానాయకుడు నరేష్ వివరించారు.
అల్లరి నరేష్ మాట్లాడుతూ... సరికొత్త 3డి వెర్షన్ నిర్మిస్తున్న ఈ చిత్రం తమ యూనిట్‌కు మంచి పేరు తీసుకువచ్చేలా ఉంటుందని తెలిపారు. తండ్రీతనయులు బప్పా, బప్పీలహరి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండటం ఓ విశేషం. రీరికార్డింగ్‌తో పాటు తమన్ ఓ పాటకు సంగీతాన్ని సమకూరుస్తున్నారు.
వైభవ్, రాజుసుందరం, శ్యామ్, సుధీప్, నీలం ఉపాధ్యాయ, స్నేహ ఉల్లాల్, రీతు బర్మేచ, కామ్నాజెఠ్మలానీ, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, అలీ, నాజర్, జయప్రకాష్‌రెడ్డి, మనోబాల, ఝాన్సీ, భరత్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సర్వేష్ మురారి, సంగీతం: బప్పా-బప్పీలహరి, పాటలు: భువనచంద్ర, రామజోగయ్యశాస్ర్తీ, కేదార్‌నాథ్, సిరాశ్రీ, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, నిర్మాత: సుంకర రామబ్రహ్మం, కథ, స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: అనిల్ సుంకర.


Click it and Unblock the Notifications











