»   » క్యాలెండర్ గర్ల్ మళ్లీ హల్‌చల్.. సోషల్ మీడియాలో బికినీ భామ ఫొటోలు వైరల్

క్యాలెండర్ గర్ల్ మళ్లీ హల్‌చల్.. సోషల్ మీడియాలో బికినీ భామ ఫొటోలు వైరల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ నటి, మోడల్ రుహి సింగ్ మరోసారి బికినితో హడలెత్తించింది. హాట్ హాట్ సమ్మర్‌లో బికినీ ధరించి బీచ్‌లో సేద తీరుతూ ఇలా కనిపించింది. ప్రముఖ దర్శకుడు మధుర్ భండార్కర్ తీసిన క్యాలెండర్ గర్ల్స్ చిత్రంతో బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన రుహి సింగ్ ఆ సినిమా తర్వాత పెద్దగా అవకాశాలు రాకపోవడం సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. అడపాదడపా మత్తెక్కించే స్టిల్స్‌తో సోషల్ మీడియాలో దుమారం రేపుతుంది. ఆ భాగంలోనే ఇటీవల ఇన్స్‌టాగ్రామ్‌లో ఇలా కనిపించింది.

ఇన్స్‌టాగ్రామ్‌లో వైరల్

ఇన్స్‌టాగ్రామ్‌లో వైరల్

అద్భుతమైన శరీర ఆకృతితో ఆకట్టుకొనే రుహి సింగ్ ప్రస్తుతం బొంగు అనే తమిళ చిత్రంలో నటిస్తున్నది. ఈ చిత్రంలో నటరాజన్ సుబ్రమణ్యం హీరోగా నటిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఆమె ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన చిత్రాలు ఇవే.

మిస్ ఇండియా అందాల పోటీలలో..

మిస్ ఇండియా అందాల పోటీలలో..

రుహి సింగ్ రాజస్థాన్‌లోని జైపూర్‌లో జన్మించింది. 2012 ఫెమీనా మిస్ ఇండియా అందాల పోటిలలో మెరిసింది. ఆ పోటీలలో టాప్ టెన్ స్థానంలో నిలిచింది.

ఆంగ్ల చిత్రం ద్వారా..

ఆంగ్ల చిత్రం ద్వారా..

రుహి సింగ్ తొలుత ఆంగ్ల చిత్రం ద్వారా యాక్టింగ్ కెరీర్‌ను ప్రారంభించింది. ఆమె ది వరల్డ్ బిఫోర్ హర్ అనే చిత్రం ఆమెకు నటిగా మంచి గుర్తింపునిచ్చింది.

క్యాలెండర్ గర్ల్స్ చిత్రంలో ..

క్యాలెండర్ గర్ల్స్ చిత్రంలో ..

ఆ తర్వాత రుహి సింగ్ బాలీవుడ్‌లోకి ప్రవేశించింది. 2015లో మధుర్ బండార్కర్ తీసిన క్యాలెండర్ గర్ల్స్ చిత్రంలో నటించింది.

బాలీవుడ్‌లో బోల్తా కొట్టిన..

బాలీవుడ్‌లో బోల్తా కొట్టిన..

క్యాలెండర్ గర్ల్స్ సినిమా తర్వాత 2016లో రుషి సింగ్ ఫిల్మ్ ఇష్క్ ఫరెవర్ అనే సినిమాలో నటించింది. అది కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఆమె కెరీర్ మసకబారింది.

పేరొచ్చింది కానీ..

పేరొచ్చింది కానీ..

క్యాలెండర్ గర్ల్స్‌ చిత్రంలో ఓ మోడల్‌గా రుహి సింగ్ నటించింది. ఆ చిత్రంలో ఆమె పోషించిన మయూరీ చౌహాన్ పాత్ర ఆమెకు మంచి పేరు తెచ్చింది.

మోడల్స్ జీవిత కథ ఆధారంగా..

మోడల్స్ జీవిత కథ ఆధారంగా..

వాస్తవ జీవిత కథలను తెరకెక్కించే దర్శకుడిగా మధుర్ భండార్కర్ మంచి పేరున్నది. చాందీనీ బార్‌లో బార్ గర్ల్స్ గురించి, క్యాలెండర్ గర్ల్స్‌లో మోడల్స్ జీవితాల్లో చీకటి వెలుగుల కోణాన్ని తెరకెక్కించారు.

సినిమా ఆడకపోవడంతో ..

సినిమా ఆడకపోవడంతో ..

క్యాలెండర్ గర్ల్స్ చిత్రంలో ఆమె పాత్రకు మంచి పేరు వచ్చినా.. ఆ సినిమా గొప్పగా ఆడకపోవడంతో ఆమె బాలీవుడ్‌లో వెలుగులోకి రాలేకపోయింది.

క్రిటిక్స్ నుంచి మంచి రెస్సాన్స్

క్రిటిక్స్ నుంచి మంచి రెస్సాన్స్

క్యాలెండర్ గర్ల్స్ చిత్రానికి విమర్శకులు తక్కువ రేటింగ్ ఇచ్చినా రుహి సింగ్‌కు మాత్రం విమర్శకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఫ్లాప్ హీరోయిన్‌గా

ఫ్లాప్ హీరోయిన్‌గా

బాక్సాఫీస్ వద్ద క్యాలెండర్ గర్ల్స్ ప్రతికూల పరిస్థితి ఎదురుకావడంతో రిషి సింగ్ ఫ్లాప్ హీరోయిన్ అనే పేరును మూటగట్టుకొన్నది. ఆ చిత్రంలో బాలీవుడ్ నటుడు రోనిత్ రాయ్ ప్రధాన పాత్రలో కనిపించాడు.

సేద తీరుతున్న రుహి సింగ్..

సేద తీరుతున్న రుహి సింగ్..


ఓ విలాసవంతమైన హోటల్‌లోని స్మిమ్మింగ్ పూల్‌లో సేదతీరుతున్న రుషి సింగ్.

విజయ్ మాల్యా జీవితం..

విజయ్ మాల్యా జీవితం..

క్యాలెండర్ గర్ల్స్ సినిమా లిక్కర్ డాన్ విజయ్ మాల్యా జీవితంలోని కొన్ని కీలక అంశాలతో తెరకెక్కింది. అయితే ఆ వార్తలను మధుర్ బండార్కర్ ఖండించారు.

మోడల్స్ జీవితాల్లోని..

మోడల్స్ జీవితాల్లోని..

క్యాలెండర్ గర్ల్స్ సినిమా ఐదుగురు మోడల్స్ జీవితంలో చోటుచేసుకొన్న సంఘటనల ఆధారంగా తెరకెక్కించామని ఓ సందర్భంలో వివరణ ఇచ్చారు.

సంచలనాలకు దూరంగా..

సంచలనాలకు దూరంగా..

క్యాలెండర్ గర్ల్స్ సినిమా విడుదలకు ముందు భారీగా క్రేజ్ వచ్చింది. అయితే ప్రేక్షకుల అంచనాలకు తగినట్టు లేకపోవడంతో ఆ సినిమా సంచలనాలకు దూరంగానే ఉండిపోయింది.

రుషి సింగ్‌తోపాటు..

రుషి సింగ్‌తోపాటు..

క్యాలెండర్ గర్ల్స్ చిత్రంలో రుషి సింగ్‌తోపాటు ఆకాంక్ష పురి, అవనీ మోదీ, కైరా దత్, సతరుపా పైనీ నటించారు.

తమిళ చిత్రం బొంగులో..

తమిళ చిత్రం బొంగులో..

ప్రస్తుతం నటిస్తున్న తమిళ చిత్రం బొంగు సినిమాలోని ఓ స్టిల్ ఇది.

English summary
Ruhi Singh, who starred in Madhur Bhandarkar's Calendar Girls has been raising the temperatures on her Instagram handle by posting bikini pictures of herself and we can't stop swooning over them. Red hot and sizzling pictures of Ruhi Singh in bikinis will have you swooning for more. The Calendar Girls actress is blessed with a body to die for.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu