»   »  రెచ్చిపోయిందంటే: ఏ హీరోయిన్ కూడా ఇంతలా బికినీలో ఎక్సపోజ్ చేయలేదు (ఫొటోలు)

రెచ్చిపోయిందంటే: ఏ హీరోయిన్ కూడా ఇంతలా బికినీలో ఎక్సపోజ్ చేయలేదు (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ముంబై: బికినీ ఫొటోలు తెల్లారితే ఎందరివో మీడియాలో వస్తూంటాయి...పోతూంటాయి . కానీ కొందరివి మాత్రం అలా కళ్ళలో నిలిచిపోతాయి అంటారు రసికులు. ఇదిగో అచ్చం ఈ స్టేట్ మెంట్ నిజమనిపించే ఫొటోలే మీరు ఇప్పుడు చూడబోయేది. తెల్లారి లేస్తే ఎన్నో ఫొటోషూట్ లు చూసి ..ఛల్ అనేసే బాలీవుడ్డే ...ఈ అందాలను చూసి కళ్లు తిప్పుకోలేమంటోంది. నమ్మచ్చా అంటారా..మీరు ఈ క్రింద ఫొటోలు అర్జెంటు గా చూసేయండి..మీరే ఒప్పుకుంటారు.

  ఇంతకీ ఎవరి ఫొటోలు అంటారా...బిగ్‌బాస్‌ రియాలిటీ షోతో ఫేమస్‌ అయిన ముద్దుగుమ్మ ఎల్లి అవరామ్‌ వి. బిగ్‌బాస్‌ హౌస్‌లో అత్యంత అందగత్తెగా ఈ అమ్మడికి పేరొచ్చింది. ఆ గుర్తింపుతోనే 'మిక్కీ వైరస్‌' అనే సినిమాలో హీరోయిన్ గా అవకాశం అందుకుంది. ఇదే బాలీవుడ్‌లో తొలిసినిమా. ప్రస్తుతం వరుసగా సినిమా అవకాశాల్ని అందుకుంటోందీ ఎల్లి.

  ఓ వైపు రియాలిటీ షోతో బిజీగా ఉంటూనే స్క్రిప్టులు వింటోంది. అయితే ఈ భామ కన్ను సల్మాన్‌ భాయ్‌పై పడిందని బాలీవుడ్‌లో ప్రచారమవుతోంది. బిగ్‌బాస్‌ హోస్ట్‌గా సల్మాన్‌ క్రేజు చూసిన ఎల్లీ ఈ కండలవీరుడిపై మనసు పారేసుకుందని వార్తా కథనాలు వచ్చాయి. కొందరైతే మరింత అడ్వాన్స్‌డ్‌గా 'మిసెస్‌ సల్మాన్‌ ఖాన్‌' అని అమ్మడిని పొగిడేసేసరికి .. ఉబ్బితబ్బిబ్బయిపోయింది ఈ ముద్దుగుమ్మ. అయితే తర్వాత లైట్ అనేసాడు..ఎప్పటిలా..వేరే భామని చూసుకోవటంలో బిజీ అయ్యిపోయాడు. సర్లే సల్మాన్ వదిలేసినా నేను..నా కెరీర్ ముఖ్యం కదా అని ఇదిగో ఇలా ..రెచ్చిపోయింది.

   బికినీలో భామ అదుర్స్

  బికినీలో భామ అదుర్స్

  రెడ్ అండ్ వైట్ బికినీలో కనిపించే ఎల్లి అవ్రామ్ ఇప్పుడు ఆన్ లైన్ లో హాట్ గా మారిపోయింది. ఎక్కడ చూసినా ఈమె ఫొటోలే దర్శనిమిస్తున్నాయి. సూర్యుడు క్రింద సేద దీరుతున్నట్లున్న ఈ ఫొటోలో ఆమె ఫొజ్ రసిక హృదయాలను కట్టిపారే స్తోంంది. వెంటనే ఆమె ప్రేమలో పడిపోయి ఆమెనే కలవరిస్తున్నారు.

   రావాల్సినంత రాలేదు

  రావాల్సినంత రాలేదు  స్వీడిష్-గ్రీకు జాతీయురాలైన ఎల్ల అవ్రమ్ ‘మికీ వైరస్' చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. పలు చిత్రాల్లో నటిస్తూ తన అందచందాలతో ఆకట్టుకుంటోంది. ఆమె అందాలు బాలీవుడ్ ని తొలి రోజుల్లో బాగానే ఆకట్టుుకన్నాయి. అయితే ఆమెకు రావాల్సినంత పేరు మాత్రం రాలేదంటారు.

   కూసింత అది కూడా కలపాలమ్మా

  కూసింత అది కూడా కలపాలమ్మా

  కేవలం తన అందాల ప్రదర్శనతోనే బాలీవుడ్ లో నిలబడాలని ఆమె చేసిన ప్రయత్నాలే దెబ్బ కొట్టాయంటారు. కాస్త నటన కూడా ఉంటే ఇంకా బాగుండేది. నటన లేని అందాలు ఎంతో కాలం నిలబడవు అనటానికి ఆమె నిదర్శనం అంటున్నారు. కాస్తంత నటన, ఎక్సప్రెషన్స్ కూడా ముఖంలో చూడగలిగితే ఇంకా బాగుండేదనే విమర్శలు ఉన్నాయి.

  అదే ఆమె ప్లస్ పాయింట్స్

  అదే ఆమె ప్లస్ పాయింట్స్

  ఈ స్వీడిష్, గ్రీకు భామ ఉన్నంతలో ఇండియన్ ఆడియన్స్ ఆకట్టుకోవటాని కి కారణం ఇన్నోసెంట్ ఛార్మ్, ఫ్లా లెస్ బ్యూటీ అంటారు. కంటిన్యూగా ఆమె అందం మెస్మరైజ్ చేయటమే అని చెప్తూంటారు. కపిల్ శర్మ సరసన కిస్ కిసీకో ప్యార్ కర్నూ చిత్రంలో బికినీలో అదరకొట్టింది.

   రెగ్యులర్ గా అది కావాల్సిందే

  రెగ్యులర్ గా అది కావాల్సిందే

  ఎల్లి అందం సీక్రెట్ రెగ్యులర్ జిమ్ కు వెళ్లటమే అంటుంది. జిమ్ కు వెళ్లనదే ఆమెకు ఆ రోజు ఏదో లోటుగా ఉన్న భావన ఉంటుందిట. అప్పట్లో సల్మాన్ కూడా ఆమె షేప్ కు కొన్ని జిమ్ టిప్స్ చెప్పారట. అలాగని జిమ్ లో విపరీతంగా కష్టపడితే అసలుకే మోసం వస్తుంది అని చెప్తుంది. జిమ్ లో జిమ్ జిమ్ అంటేనే జిగేల్మంటాను అంటోంది.

   చాలా మారిందంటోంది

  చాలా మారిందంటోంది

  ఈ మధ్యన బాలీవుడ్ ధోరణులలో చాలా మార్పు వచ్చిందని ఎల్లి ఈ మధ్యన ఓ ఇంటర్వూలో చెప్పుకొచ్చింది. గతంలో విదేశీ భామలకు ఇక్కడ పెద్దగా గుర్తింపు లభించేది కాదని, ఇప్పుడు ఇక్కడ విదేశీ భామలు చాలా మంది రాజ్యం ఏలుతున్నారని, గ్లోబులైజేషన్ ప్రభావం బాలీవుడ్ పై పడిందని, సినిమాలు కూడా అదే స్దాయిలో ఉంటున్నాయని కితాబు ఇచ్చింది

   ఏక్సెప్ట్ చేయబట్టే మేమంతా

  ఏక్సెప్ట్ చేయబట్టే మేమంతా

  గత పదేళ్లుగా బాలీవుడ్ లో శరవేగంగా మార్పులు వచ్చాయి. ఇండియన్ మూలాలు లేకపోయినా మాలాంటి వాళ్లం ఇక్కడ నెగ్గుకు రాగలుగుతున్నాం. మమ్మల్ని మాలాగే బాలీవుడ్ ఏక్సెప్ట్ చేస్తోంది. గతంలో ఫారిన్ అమ్మాయిలకు బాలీవుడ్ లో ఇచ్చే పాత్రలు సైతం ఫారిన్ అమ్మాయిలుగానే ఉండేవి. ఇప్పుడు మేం మెయిన్ స్ట్రీమ్ లో హీరోయిన్స్ గా కనిపించగలగుతున్నాం అంటూ ఆనందంగా చెప్తోంది.

   బాగా ఆదరణ ఉంది..విదేశాల్లోనూ

  బాగా ఆదరణ ఉంది..విదేశాల్లోనూ

  ఈ స్దాయి మార్పుకు కారణం ..బాలీవుడ్ కు విదేశాల్లో ఆదరణ బాగా పెరగటమే. ఇతర దేశాల్లో బాలీవుడ్ సినిమాలను బాగా చూస్తున్నారు. కాబట్టే మమ్మల్ని తమ సినిమాల్లో తీసుకవటానికి బాలీవుడ్ కు పెద్ద సమస్యగా కనపడటం లేదు. మేం ఉంటే ఇంకా విదేశీ మార్కెట్ కు ప్లస్ అవుతాం. మమ్మల్ని అక్కడివాళ్లు ఐడిటెంపై చేసుకుని మార్కెట్ పెరగటానికి దోహదపడతారు.

  ఇక్కడే మేము కలిసిపోయాం

  ఇక్కడే మేము కలిసిపోయాం

  నిజానికి మేము విదేశీ అమ్మాయిలం అయినా భారతీయ జీవిన విధానానికి కనెక్ట్ అయ్యాం. ఇక్కడ జీవితాల్లో కలిసిపోయాం. ఇది మా దేశమే అన్న భావన కలుగుతోంది. అందుకే మేం బాలీవుడ్ సినిమాల్లో చేసేటప్పడు సొంత సినిమాల్లో చేసినట్లుగా పీల్ అయ్యి చేయగలుగుతున్నాం. అందుకే ఆ స్దాయి అవుట్ పుట్ వస్తోంది. అదే సినిమాలకు కలిసి వస్తోంది.

   లేదని చెప్పలేం...ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది

  లేదని చెప్పలేం...ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది

  ఇక్కడ నటించే మాపై భారతీయ లైఫ్ స్టైయిల్ ప్రబావం ఖచ్చితంగా పడుతుంది. ఎవరైనా లేదు..నా మీద పడలేదు. నేను ఇంకా మేం పుట్టిన దేశంలో లాగానే ఉన్నాము అంటే అది అబద్దం. నాలోనే ఇన్నేళ్లలో చాలా మార్పులు వచ్చాయి,. అది మా ప్రాంతానికి వెళ్లినప్పుడు మాకు స్పష్టంగా అర్దమవుతుంది. ఇక్కడ సినిమాలు మాకు సొంత సినిమాల్లాగ అనిపిస్తున్నాయి. ఇక్కడ వాళ్లే మాకు సొంత వాళ్లు అంటూ ఏమోషనల్ గా చెప్పుకొచ్చింది.

   కత్రినాకు డూప్

  కత్రినాకు డూప్

  ఎల్లిని చూసిన వారంతా కత్రినా గుర్తుకువస్తుందంటారు. సల్మాన్ అందుకే ఆమెపై మోజు చూసి ఫ్రెండ్షిప్ చేసారంటారు. ఈ విషయాన్ని నవ్వూతూనే కొట్టి పారేస్తుంది ఎల్లి. తనను చూస్తే కొద్దిగా అలా అనిపించవచ్చేమో కానీ తనకూ, కత్రినాకు అసలు పోలీకే లేదు. ఎవరందం వారిదే అని వాదిస్తుంది.

   నిజంగా సల్మాన్ కు ఆమే గుర్తు వచ్చిందట

  నిజంగా సల్మాన్ కు ఆమే గుర్తు వచ్చిందట

  ఓ సారి స్వయంగా మీడియాతో సల్మాన్ సైతం కత్రినా యంగ్ ఉన్నప్పుడు ఎలా ఉండేదో ఎల్లి అలాగే ఉందంటూ చెప్పుకొచ్చాడు. తనకు ఎల్లినీ హఠాత్తుగా చూస్తే కత్రినా వెంటనే మైండ్ లోకి వస్తుందని చెప్పుకొచ్చాడు. అందుకే ఆమెకు చాలా సాయిం చేసాడట. ఆమె ఏది అడిగినా సల్మాన్ ఎప్పుడూ నో చెప్పలేదుట

   సల్మాన్ సొంత ప్రాజెక్టులోకి

  సల్మాన్ సొంత ప్రాజెక్టులోకి

  అక్కడితో ఆగకుండా సల్మాన్ ఆమెను తన సొంత ప్రాజెక్టు బీయింగ్ హ్యూమన్ లోకి ఆమెను తీసుకొచ్చాడు. ఆమె ఆ బ్రాండ్ కు అంబాసిడర్ గా మారింది. ఆమెను బాలీవుడ్ అంతా లక్కి అంది వెంటనే. ఎందుకంటే వారంతా ఎల్లినీ సల్మాన్ ఖచ్చితంగా సినిమాల్లోకి ప్రమోట్ చేస్తాడనుకున్నారు. అయితే సల్మాన్ ఎందుకనో ఆ విషయంలో సీరియస్ గా తీసుకోలేదు

   17 ఏళ్లకే

  17 ఏళ్లకే

  ఇక ఎల్లి పర్శనల్ లైఫ్ విషయానికి వస్తే ఆమె తన 17 సంవత్సరాల వయస్సుకే పరదేసి డాన్స్ గ్రూప్ లో భాగమై డాన్స్ పోగ్రామ్ లు ఇవ్వటం మొదలెట్టింది. స్కాండివియా దేశంలో ఆమె పోగ్రామ్ లు ప్రతీ చోటా ఇచ్చింది. చాలా పాపులర్ అయ్యింది. ఆ గ్రూపే లేకపోతే తనలోని నటి మరుగున పడిపోయేదని ఎల్లి చెప్తుంది.

   అప్పట్లోనూ ఇక్కడ పాటలే

  అప్పట్లోనూ ఇక్కడ పాటలే

  ఇంతకీ డాన్స్ గ్రూప్ లో ఆమె ఏ పాటలకు డాన్స్ చేసిందయ్యా అంటే కేవలం బాలీవుడ్ సాంగ్ లకే ఆమె స్పెషల్ గా డాన్స్ చేసేది. అదే ఆమెను ఇండియా లోని బాలీవుడ్ వైపు నడిపించింది. స్వీడన్ లోకూడా ఆమె కొన్ని యాక్టింగ్ ప్రాజెక్టులు చేపట్టింది. అక్కడ కొన్ని క్రైమ్ రొమాంటిక్ సినిమాలు చేసింది. టీన్ గర్లఫ్రెండ్ గా ఆ సినిమాలో కనిపించింది.

   డిజాస్టర్ అవ్వటమే..

  డిజాస్టర్ అవ్వటమే..

  తొలి చిత్రం మిక్కీ వైరస్ కనుక హిట్టే ఉంటేనే బాలీవుడ్ ని దున్నేసేది అంటారు ఆమె అభిమానులు. ఆ సినిమా భాక్సాఫీ స్ వద్ద డిజాస్టర్ అవటంతో ఆమెను ఎదగనివ్వలేదు. అప్పటికీ ఆమె తర్వాత చేసిన చిత్రానికి మంచి బిజినెస్ అయ్యింది. కానీ బ్రేక్ రాకపోవటం ఆమె కెరీర్ లో పెద్ద మైనస్ గా మిగిలింది.

   పాటలను అక్కడ ఎడాప్ట్ చేస్తున్నారు

  పాటలను అక్కడ ఎడాప్ట్ చేస్తున్నారు

  బాలీవుడ్ ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్. కేవలం గుర్తింపు ఉండటమే కాదు. గ్రేట్ ఫాలోయింగ్ కూడా ఉంది. అంతెందుకు స్పీడన్ లో బాలీవుడ్ కు పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. బాలీవుడ్ ఓల్డ్ సాంగ్స్ అనేక గ్రీక్ ఎడాప్షన్స్ వచ్చాయి. ఇప్పటికీ అక్కడ బాలీవుడ్ ఇన్ఫూలియెన్స్ ఉంది అని చెప్తుంది.

   అక్కడ ఏకంగా పండుగే చేస్తాం

  అక్కడ ఏకంగా పండుగే చేస్తాం

  స్వీడన్ లోని మా ప్రాంతంలో ఏకంగా ఇండియన్ ఫెస్టివల్ జరుపుతాం. ప్రతీ సంవత్స రం ఇండియన్ కథలు, కల్చర్ ని మేం గుర్తు చేసుకుంటాం. మాపై భారతీయ సినిమా, జీవితం అంతలా ప్రభావం చూపింది. అందుకే నాకు బాలీవుడ్ కి వచ్చిన కొత్తలో అసలు కొత్త చోటకు వచ్చామనే అనిపించలేదు.

  ఊరుకోండి నాకు ఫ్రెండే

  ఊరుకోండి నాకు ఫ్రెండే

  బాలీవుడ్ గురించి చెప్పాలంటే చాలా యూనిక్ . పాజిటివ్ గా చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. ఇక తనకూ సల్మాన్ ఖాన్ కు ఉన్న రిలేషన్ గురించి చెప్పాలంటే పుస్తకం రాయాలని, సల్మాన్ తనకు మంచి స్నేహితుడుని, అంతకు మించి ఎక్కువ ఆలోచించవద్దని నవ్వుతూ చెప్తుంది. సల్మాన్ లేకపోతే నేను బాలీవుడ్ లో ఉండేదాన్ని కాదేమో అన్నంతగా చెప్పుకొచ్చినా కేవలం ఫ్రెండ్ అని మాత్రమే అంది.

  వదిలేది లేదు

  వదిలేది లేదు

  తను ఇక్కడ బాలీవుడ్ లో సక్సెస్ వచ్చేదాకా ట్రైల్స్ వేస్తూంటాను అని చెప్పింది. దర్శకులు,నిర్మాతలు తనకు ఇచ్చిన పాత్రకు న్యాయం చేయటానికి వంద శాతం ప్రయత్నిస్తానని, అయితే సక్సెస్, ఫెయిల్యూర్ అనేవి తన చేతిలో లేవని అందరి హీరోయిన్స్ లాగానే రొటిన్ గా చెప్పింది. అలాగే ఇక్కడ మీడియా కూడా నిజాయితీగా వ్యవహిస్తుంది ఓ బిస్కెట్ వేసింది. ఏదైమైనా ఎల్లి ఇక్కడ సక్సెస్ కావాలని ఆశిద్దాం.

  English summary
  Elli, who was seen opposite Kapil Sharma in ‘Kis Kisko Pyaar Karoon’ has an awesome bikini body. In this photo-feature, we have compiled some of her Instagram posts that will inspire you to hit the gym to stay fit.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more