»   » ‘బిలాల్‌పూర్ పోలీస్ స్టేషన్’ ట్రైలర్ ఇదే, కీలక పాత్రలో గోరేటి వెంకన్న

‘బిలాల్‌పూర్ పోలీస్ స్టేషన్’ ట్రైలర్ ఇదే, కీలక పాత్రలో గోరేటి వెంకన్న

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    ఎంఎస్ క్రియేషన్స్ పతాకంపై మహంకాళి శ్రీనివాస్ నిర్మిస్తున్న చిత్రం బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్. మాగంటి శ్రీనాథ్, సాన్వీ మేఘనా జంటగా నటించారు. గోరేటి వెంకన్న ఓ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రాన్ని దర్శకుడు నాగసాయి మాకం తెరకెక్కించారు. బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో జరిగింది.

    ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్ శంకర్ మాట్లాడుతూ...వాస్తవ కథలతో సహజత్వం ఉట్టిపడేలా సినిమాలు నిర్మించాలంటే ధైర్యం ఉండాలి. బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ చిత్రంతో నిర్మాత మహంకాళి శ్రీనివాస్ అలాంటి సాహసం చేశారు. ఈ సినిమా ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ సినిమా రేపు థియేటర్ లలో ప్రేక్షకులను నిరాశపరచదు అని ఖచ్చితంగా చెప్పగలను. తెలంగాణ పల్లెల్లో ఉండే వాతావరణం ఈ చిత్రంలో కనిపిస్తుంది. అన్నారు.

    నిర్మాత మహంకాళి శ్రీనివాస్ మాట్లాడుతూ...సినిమా కథలు మన జీవితాల్లో నుంచే పుడతాయి. బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ కథ మన చుట్టూ ఉన్న ప్రజలను దగ్గర నుంచి చూసిన స్ఫూర్తితో రాసుకున్నాను. దర్శకుడు నాగసాయి నేనిచ్చిన కథను అంతే చక్కగా రూపొందించారు. ఈ కథను వాణిజ్య హంగులు ఉంటూనే సహజత్వం ఉండేలా నిర్మించాం. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెల రెండో వారంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం. అన్నారు.

    దర్శకుడు నాగసాయి మాకం మాట్లాడుతూ....మా సినిమా చూస్తే ప్రతి ఒక్కరికీ వాళ్ల ఊరు, ఆ ఊరిలో జరిగిన సంఘటనలు గుర్తొస్తాయి. ఈ కథను ఎక్కడో కాల్పనికంగా తీసుకొచ్చింది కాదు. అన్నీ మనం చూసిన సందర్భాలే ఉంటాయి. కమర్షియల్ అంశాల కోసం కథకు దూరంగా వెళ్లి సినిమాను రూపొందించలేదు. ఒక ఊరిలోని పోలీస్ స్టేషన్ కు ఎలాంటి వింత వింత కేసులు వస్తాయన్నది ఈ చిత్ర కథాంశం. అందులో వినోదాత్మకంగా సాగే అంశాలతో పాటు ఇప్పుడు సమాజంలో జరుగుతున్నకొన్ని చేదు ఘటనలు కూడా ఉంటాయి. సినిమా ఆద్యంతం నవ్విస్తూనే ఆలోచింపజేస్తుంది. అన్నారు.

    Bilalpur Police Station Second Trailer

    ప్రణవి, ఆర్ ఎస్ నందా, వెంకట్ గోవాడ, మల్లేష్, వైభవ్ తదితరులు ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ - తోట వి రమణ, ఎడిటింగ్ - ఎస్ బీ ఉద్ధవ్, సంగీతం - సాబూ వర్గీస్, రీ రికార్డింగ్ - జీబూ, డీటీఎస్ - రాజశేఖర్, పాటలు - గోరేటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ, రామాంజనేయులు, మౌనిశ్రీ మల్లిక్, నీల నర్సింహా, కథా, నిర్మాత - మహంకాళి శ్రీనివాస్, రచన, దర్శకత్వం - నాగసాయి మాకం.

    English summary
    Watch Bilalpur Police Station Second Trailer.Starring #MagantiSrinath, #SaanveMeghna, #GoratiVenkanna , #R.S.Nanda Music Composed By #SabuVarghese Directed by #NagaSaiMakam Produced by #MahankaliSrinivasulu Under the Banner of MS Creations.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more