యంగ్ ‘రెబల్’ ప్రభాస్ పాలిట శాపంగా మళ్ళీ సీనియర్ రెబల్ స్టార్...
ఆల్ రెడీ ఓసారి 'బిల్లా"లో కలిసి నటించిన రెబల్ స్టార్ కృష్ణంరాజు-యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లు మరోసారి స్ర్కీన్ షేరింగ్ సిద్దమవుతున్నారు. కాగా ఈ రెబల్ హీరోల డబుల్ ధమాకాని తన 'రెబల్" చిత్రంలో చూపించనున్న లారెన్స్ వారిద్దరి పాత్రలనీ సమవుజ్జీవులైన భిన్న దృవాలుగా మలిచానని చెబుతున్నారు. ఈ 'రెబల్"లో కొడుకుని ద్వేషించే తండ్రి పాత్రలో కృష్ణంరాజు, తండ్రికి తనేంటో తెలియజెప్పి ఆయన మనసు మార్చే కొడుకు పాత్రలో ప్రభాస్ నటిస్తుండగా ఇందులోనూ 'బిల్లా" తరహాలో ప్రభాస్ సరసన అనుష్కే హీరోయిన్ గా ఎంపికైంది. అయితే ఇదంతా ఓకే కానీ, నట తృష్ణ తీరని కృష్ణంరాజుని చూసి 'బిల్లా" థియేటర్లలోనే గొల్లుమన్న ప్రేక్షకులు ఆయనగారి 'రెబల్" గెటప్ కి ఈసారెలా స్పందిస్తారోనన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతుండడం గమనార్హం..


Click it and Unblock the Notifications











