కలెక్షన్స్ లో జల్సాని దాటి బిల్లా రికార్డు సృష్టించిందని ప్రముఖ దర్శకుడు వివి వినాయిక్ బిల్లా సక్సెస్ మీట్ లో అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దర్శకుడు మెహర్ రమేష్ తెలుగు సినిమా స్టాండర్డ్ ని దాటింది..చాలామంది రీమేక్ చేయటం చాలా సులభమని అనుకుంటారు కానీ అదే కష్టం..నేను ప్రభాస్ ప్యామిలీకి బాగా క్లోజ్..అందుకే బిల్లా హిట్టవటం నాకు చాలా ఆనందానిస్తోంది. అంతేగాక నేను ఈ చిత్రానికి ఎగ్జిబిటర్ ని. మా ధియేటర్ లో ఈ సినిమా మొదటి వారం షేర్..జల్సా షేర్ ని దాటి రికార్డు సృష్టిస్తోంది. జల్సాకి ఒక వారానికి లక్ష రూపాయలు వస్తే బిల్లా లక్షా పాతికవేలు కలెక్టు చేసింది అన్నారు. ఇక వినాయిక్ ధియోటర్ ఆయన సొంత గ్రామం అయిన పశ్చిమ గోదావరి జల్లా చాగల్లులో ఉంది. ప్రస్తుతం వినాయిక్..ఎన్టీఆర్ తో అదుర్స్ సినిమా చేస్తున్నారు. అందులో ఎన్టీఆర్ ద్విపాత్రల్లో కనిపించనున్నారు. త్వరలోనే ప్రభాస్ తో సినిమా చేయనున్నారు.