Don't Miss!
- Automobiles ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- News తండ్రైన ముఖ్యమంత్రి: తొలి నేతగా రికార్డ్
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
బిల్లా పరిస్ధితి మరీ...
ప్రభాస్ హీరోగా చేసిన బిల్లా చిత్రం మొదట రోజు భారీ కలెక్షన్స్ వసూలు చేయగల్గినా నాలుగురోజులుకే డల్ అయిపోయింది.ఎంతో పబ్లిసిటీ చేసిన అనూష్క బికినీ, నమిత అందాలు కూడా చిత్రాన్ని మోయలేకపోతున్నాయని సమచారం. మినిమం నాలుగు వారాలన్నా హౌస్ ఫుల్ అవుతాయని ఎక్సెపెక్ట్ చేసిన వారి అంచనాలను తలక్రిందలు చాలా చోట్ల కలెక్షన్స్ పడిపోయాయి. సినిమా బిగిన్ అయ్యాక కూడా టిక్కెట్ కౌంటర్స్ తెరిచే ఉంటాయి. బుజ్జిగాడు ఫ్లాఫ్ కన్నా ఘోరంగా బిల్లా పరిస్ధితి ఉందని టాక్.
అందులోనూ ఫస్టాఫ్ లో బిల్లా గెటప్ లో కనిపించే ప్రభాస్ డైలాగులు అస్సలు అర్ధం కాకపోవటం, మాట్లాడితే కేన్..కేన్ అనటం చాలా విసుగు కలిగిస్తోందంటున్నారు. అస్సలు రెండో పాత్రపై (బిల్లా)పెట్టాల్సిన కాన్సర్టేషన్ ని తగ్గించి మొదటి పాత్రను పెంచటం (తమిళ బిల్లాలో ఇలానే ఉంటుంది)స్క్రీన్ ప్లే లోపమని విశ్లేషిస్తున్నారు పరిశ్రమవాసులు. బిల్లా అనేది మరీ విచిత్రంగా ఉందని యుగంధర్ అని టైటిల్ పెట్టినా బాగుండేదేమోనని మరికొందరు పెదవి విరుస్తున్నారు.
అయినా అమితాబ్ డాన్ లో ఆకట్టుకునే ప్రధాన అంశమైన యే మేరీ దిల్..దిల్ కా దీవానా వంటి కిక్కు ఇచ్చే పాటలు లేకపోవటం, పాన్ సాంగ్ లేకపోవటం డాన్ ప్రాంచైజీని చూద్దామని వచ్చినవారికి నిరాశపరుస్తున్నాయి. అయితే మక్కీకి మక్కీ ఒరిజనల్ తమిళ బిల్లా లో ని షాట్ డివిజన్ సైతం కాపీ చేసిన డైరక్టర్ ని మాత్రం హాలీవుడ్ రేంజ్ టేకింగ్ అని పొగుడుతున్నారు ఓ వర్గం. ఫ్లాఫ్ అయినా మరో సినిమా పట్టుకోవటనానికి ఇదో ప్రయత్నం కావచ్చు.