బిల్లా ఏమయింది?

By Staff

Billa
ప్రభాస్ హీరోగా తమిళ రీమేక్ గా వచ్చిన బిల్లా సినిమా పెద్ద ఆకట్టుకోవటం లేదని ట్రేడ్ టాక్. ఫస్టాఫ్ స్టైల్ గా ఉన్నప్పటికీ సెకెండాఫ్ విసుగుతెప్పించేలా మిగిలటం మైనస్ గా మారింది. దాదాపు ముఫ్పై ఏళ్ళ క్రిందట రిలీజైన అమితాబ్ డాన్ కధను మోడ్రనైజ్ చేస్తూ రెండేళ్ళ క్రిందట వచ్చిన తమిళ చిత్రం ను ఫ్రేమ్ టు ఫ్రేమ్ (చాలా భాగం)షాట్ డివిజన్ తో సహా అనుకరించి, దించి సృజన రాహిత్యం చూపటంతో అనుకున్నంత కిక్ ప్రేక్షకుడికి ఇవ్వలేకపోతోంది. అయితే అరుంధతి మినహా పోటీ చిత్రం లేకపోవటం, ఎలక్షన్స్ అయ్యే దాకా పెద్ద సినిమా రిలీజ్ లు లేకపోవటం ఈ సినిమాకు కొంతలో కొంత రిలీఫ్. ఇక డైలాగులు సైతం తానే స్వయంగా రాసుకున్న దర్శకుడు మెహర్ రమేష్ ఆ విభాగంలోనూ ఫెయిల్ అయ్యారు.

ఇక ఫస్టాప్ లో డాన్ పాత్రలో ప్రభాస్ పర్శనాలిటి సూట్ అయినా వాయిస్ మైనస్ అయి చాలా మందికి డైలాగులు అర్ధం కాకుండా పోయాయి. ఇక రంగా(ప్రభాస్ డబుల్)పాత్ర బుజ్జిగాడుకి కంటెన్యూగా ఉంది. ఇక ఎంతగానో ఊరించిన అనూష్క బికినీ అనుకున్నంతగా టప్పట్లు కొట్టించలేకపోయింది. అలాగే నమిత భారీ శరీరంతో కొన్ని చోట్ల మరీ చిన్న డ్రస్ లు వేయిటం,హన్సిక వృధా కావటం జరిగింది. అయినా ఎన్టీఆర్ యుగంధర్ లో గాని అమితాబ్ డాన్ లో గానీ పాటలే హైలెట్ అవి ఇక్కడ పూర్తి స్ధాయిలో మిస్సయ్యాయి.కృష్ణరాజు చిరకాల విరామం తర్వాత తమ గోపీకృష్ణ బ్యానర్ పై సినిమా తీయటంతో నిర్మాణ పరంగా బాగానే ఖర్చుపెట్టారు. అయితే ఆయన నటన మాత్రం బాగా డల్ గా సాగటం విషాదం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X