'బిల్లా రంగ' విడుదల ఈ నెల్లోనే

By Srikanya

హైదరాబాద్‌: నేటి రాజకీయాలు, ఎన్నికలపై వ్యంగ్యాస్త్రంగా రాబోతున్న చిత్రం 'బిల్లా రంగ'. వాక్‌ కార్ప్‌ పతాకంపై జాతీయ పురస్కార గ్రహీత ప్రదీప్‌ మాడగుల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను విడుదల చేసుకుని ఈనెల 18న విడుదల కానుంది. మొదట ఈ చిత్రాన్ని పిభ్రవరి 21 న విడుదల చేద్దామనుకున్నారు. కానీ సాంకేతిక కారణాలతో వాయిదా వేసి ఇప్పుడు రిలీజ్ కు తీసుకు వస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో చిత్ర యూనిట్ 'బిల్లా రంగ' విశేషాలను వెల్లడించింది.

వెంకట్‌ రాహుల్‌, ప్రదీప్‌, రిషిక, చరణ్‌దీప్‌ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం 'బిల్లా - రంగ'. ప్రదీప్‌ మాడుగుల దర్శకుడు. అరవింద్‌ వన్నాల, వంశీ బోయిన, కాశీరెడ్డి సుధీర్‌రెడ్డి నిర్మాతలు. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రం పూర్తి స్థాయి వినోదాత్మకంగా తీర్చిదిద్దినట్లు దర్శకుడు ప్రదీప్‌ తెలిపారు. ''వూరి బాగుకోసం పాటుపడే యువకుల కథ ఇది. రాజకీయాలపై వ్యంగ్యాస్త్రం అనుకోవచ్చు. ''అని నిర్మాతలు తెలియచేసారు.

Billa Ranga Releasing On 18 th this month

మధుర శ్రీధర్‌ మాట్లాడుతూ ''ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థను కళ్లకు కట్టినట్టు చూపించే చిత్రమిది. ప్రచార చిత్రాలు బాగున్నాయి. 'అద్వైతం'కి అవార్డులు అందుకొన్న ప్రదీప్‌.. ఈ చిత్రానికీ అలాంటి పురస్కారాలు అందుకోవాలని ఆశిస్తున్నాను''అన్నారు.ఈ చిత్రానికి సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందించారు.

దర్శకుడు మాట్లాడుతూ.,...మాట్లాడుతూ- తమిళంలో మంచి పేరున్న సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ తొలిసారిగా తెలుగులో ఈ చిత్రానికి అందించిన పాటలకు మంచి స్పందన లభిస్తోందని, పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రంగా రెండ గంటలపాటు ప్రేక్షకులను అలరించే ఈ చిత్రంలో ప్రేమ, కెరీర్ అన్న అంశాలపై విశేలషణాత్మక కథనం ఉంటుందని తెలిపారు. ఈనెల 18నవిడుదలకానున్న ఈ చిత్రం అందరికీ నచ్చుతుంది. ఈ సినిమాకు మంచి నిర్మాతలు దొరికారు. సత్యానంద్‌గారు ఈ సినిమాలో నటించడం ఆనందంగా ఉందిని తెలిపారు.

సత్యానంద్ మాట్లాడుతూ "ఇందులో నటించడానికి నా శిష్యుడు మహేంద్ర చక్రవర్తి కారణం. అందరికీ నచ్చే పాత్ర చేశాను. దర్శకుడు సినిమాను తెరకెక్కించిన తీరు నచ్చింది. పాటలు బాగా కుదిరాయి'' అని అన్నారు. రాహుల్ వెంకట్ మాట్లాడుతూ "నా తొలి సినిమాకు భిన్నంగా ఉంటుందీ సినిమా. సంతోష్ నారాయణన్ ఎనర్జిటిక్ పాటలిచ్చారు'' అని తెలిపారు.

మంచి పాటలు కుదిరాయని స్వరకర్త సంతోష్ నారాయణన్ అన్నారు. జీవా, గౌతమ్‌రాజు, చరణ్, వేణు, వెనె్నల రామారావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా:ఎస్.వి.విశేవశ్వర్, సంగీతం:సంతోష్ నారాయణన్, పాటలు:వశిష్ఠ శర్మ, ఎడిటింగ్:చంద్రశేఖర్, నిర్మాతలు:అరవింద్ వన్నాల, వంశీబోయిన, కాశిరెడ్డి సుధీర్ రెడ్డి, దర్శకత్వం: ప్రదీప్ మాడుగుల.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X